ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

ఇండియన్ మార్కెట్లో కరోనా మహమ్మరి వల్ల, చాలా వాహనాలు విడుదల కాలేకపోయాయి, కానీ కరోనా లాక్ డౌన్ సడలించిన తర్వాత గత సంవత్సరం చాలా కార్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టాయి. అయితే ఈ ఏడాది కూడా భారత మార్కెట్లో కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్లో విడుదలవుతున్న మరో 5 కార్లను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

స్కోడా కుషాక్ :

స్కోడా నుంచి రాబోయే తన కొత్త ఎస్‌యూవీ, ‘కుషాక్' అని నామకరణం చేయబడింది. ఇది గత సంవత్సరం బ్రాండ్ ప్రదర్శించిన విజన్ ఇన్ కాన్సెప్ట్ కారుపై ఆధారపడి ఉంటుంది. ఇది 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తినివ్వగలదని, ఇది 150 పిఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలదని భావిస్తున్నారు.

ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

భారత మార్కెట్ కోసం స్కొడా మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇండియా 2.0' ప్రాజెక్ట్‌లో భాగం వస్తున్న తొలి మోడల్ స్కొడా కుషాక్. అంతేకాకుండా, ఇది 'ఎమ్‌క్యూబి ఏ0 ఇన్' ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న మొట్టమొదటి మోడల్ కావటం విశేషం. భారతదేశం కోసం ఇదే ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తులో మరిన్ని స్కొడా మోడళ్లు తయారు కానున్నాయి.

MOST READ:ఫలించిన కల; భారత్‌లో ప్రారంభమైన ఎయిర్ టాక్సీ సర్వీస్

ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్:

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కూడా ఈ సంవత్సరం కొత్త ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది, స్కోడా కుషాక్ వలె అదే ఎంక్యుబి-ఏ0-ఇన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది. రాబోయే విడబ్ల్యు ఎస్‌యూవీ 1.5 టిఎస్‌ఐ పెట్రోల్ మోటారుతో కలిగి ఉంటుందని, అంతే కాకుండా ఇది 1.0 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ కూడా లభిస్తుందని భావిస్తున్నారు.

ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

ఎంజీ జెడ్‌ఎస్ పెట్రోల్ :

ఎంజీ మోటార్ యొక్క జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇప్పటికే భారత మార్కెట్లో ఉంది, కానీ ఇప్పుడు కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో తన పెట్రోల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం, ఈ కారు మూడు ఇంజన్లతో విదేశీ మార్కెట్లలో అమ్మబడుతోంది.

MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

ఈ కొత్త ఎంజీ జెడ్‌ఎస్ పెట్రోల్ ఎస్‌యూవీలో1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ కారును 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లతో అందించే అవకాశం ఉంది.

ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

మహీంద్రా స్కార్పియో :

భారత మార్కెట్లో ప్రముఖ వాహనతయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది తన కొత్త జనరేషన్ ఎస్‌యూవీ మహీంద్రా స్కార్పియోను విడుదల చేయబోతోంది. సమాచారం ప్రకారం, ఈ ఎస్‌యూవీని 3-రో కాన్ఫిగరేషన్‌తో లాంచ్ చేయనున్నారు.

MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

కొత్త తరం మహీంద్రా స్కార్పియోను 2021 మధ్య నాటికి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు భావిస్తున్నారు. ఈ కారు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 :

ఈ కొత్త సంవత్సరం మహీంద్రా అండ్ మహీంద్రా మరో ఎస్‌యూవీని విడుదల చేయబోతోంది. ఈ ఎస్‌యూవీని కంపెనీ ఇప్పటికే చాలా సార్లు టెస్ట్ చేసింది. ఈ ఎస్‌యూవీలో 2.2 లీటర్, ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉపయోగించబడుతుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉండటంతో పాటు మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

Most Read Articles

English summary
5 New SUV Launches In This Year MG ZS, VW Taigun, Skoda Kushaq And More Details. Read in Telugu.
Story first published: Monday, January 18, 2021, 13:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X