కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?

భారత ఆటోమొబైల్ తయారీదారులకు షాకిచ్చే విషయాన్ని చెప్పనుంది సర్కార్. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు మరియు ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకొని, భారత రోడ్లపై తిరిగే కార్లలో తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కార్ల తయారీ సంస్థలను ఆదేశించే అవకాశం ఉంది.

కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?

ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ తరహా ఇంజన్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించినందున, వచ్చే 8-10 రోజుల్లో ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్‌లపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ చర్య రైతులకు సహాయపడుతుందని, భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని గడ్కరీ చెప్పారు.

కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?

అసలు ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ అంటే ఏమిటి?

పూర్తిగా 100 శాతం పెట్రోల్ లేదా పూర్తిగా 100 శాతం బయో-ఇథనాల్ (జీవ ఇంధన)తో నడిచే ఇంజన్‌ను ఫ్లెక్-ఫ్యూయెల్ ఇంజన్ అంటారు. అంటే, ఇది పూర్తిగా పెట్రోల్‌తో అయినా పనిచేస్తుంది లేదా పూర్తిగా జీవ ఇంధనంతోనైనా పనిచేస్తుంది. బ్రెజిల్, కెనడా, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ తరహా ఇంజన్లను ఉపయోగిస్తున్నారు.

కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?

పెట్రోల్‌కి ప్రత్యామ్నాయ ఇంధనమైన ఇథనాల్ ధర లీటరుకు రూ.60-62 వరకూ ఉంటుంది. కాగా, ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు చాలా ప్రాంతాల్లో లీటరుకు రూ.100 కంటే ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ల వినియోగం కస్టమర్లకు ఎంతో మేలు చేస్తుందని రోటరీ జిల్లా సదస్సు 2020-21లో ప్రసంగించిన నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?

ఇథనాల్ ఇంధనాన్ని వాడటం ద్వారా భారతీయులు లీటరుకు 30-35 రూపాయలు ఆదా చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నేను రవాణా శాఖ మంత్రిని, ఇకపై పెట్రోల్ ఇంజన్లు మాత్రమే ఉండవు, ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లు కూడా ఉంటాయని నేను పరిశ్రమకు ఆదేశాలు జారీ చేయబోతున్నాను" అని అన్నారు.

కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?

"ఈ ఇంజన్ల వలన వినియోగదారులు 100 శాతం ముడి చమురు లేదా 100 శాతం ఇథనాల్ వాడకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ తయారీదారులు బ్రెజిల్, కెనడా మరియు అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను ఉత్పత్తి చేస్తున్నారు" అని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి గడ్కరీ పేర్కొన్నారు.

కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?

భారతదేశంలో ఈ ఫ్లెక్స్-ఫ్యూయెల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే, సదరు ఇంజన్లు కలిగిన వాహనాలను ఉపయోగించే వినియోగదారులు తమ ఎంపిక మేరకు పూర్తిగా 100 శాతం పెట్రోల్ లేదా 100 శాతం బయో ఇథనాల్‌ను వాడే అవకాశాన్ని పొందవచ్చు.

కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?

వాహనాల్లో బయో ఇథనాల్‌ను ఉపయోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటుగా మరియు ముడి చమురు దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. పెట్రోల్‌తో 20 శాతం ఇథనాల్-బ్లెండింగ్ సాధించే లక్ష్యం యొక్క తేదీని ఐదేళ్ల వరకు (2025 వరకు) పొడిగించామని ప్రధాని మోదీ గతంలో చెప్పారు.

కార్ కంపెనీలకు షాక్: ఇకపై తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాల్సిందేనా?

వచ్చే 2022 నాటికి పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను మరియు 2030 నాటికి 20 శాతం డోపింగ్ కలపాలని ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. గడచిన 2014లో పెట్రోల్‌లో 1-1.5 శాతం ఇథనాల్‌ను కలుపుతుండగా, ప్రస్తుతం అది 8.5 శాతానికి పెరిగిందని, ఫలితంగా ఇథనాల్ సేకరణ 38 కోట్ల లీటర్ల నుండి 320 కోట్ల లీటర్లకు పెరిగిందని గడ్కరీ చెప్పారు.

Most Read Articles

English summary
Flex-fuel Engines To Be Made Mandatory In India; Govt To Take Decision In 8-10 Day, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X