తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మరియు భారత యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రాలు కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడేందుకు గడచిన 2019 సంవత్సరంలో ఇరు కంపెనీలు ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఆశ్చర్యకరంగా ఈ జాయింట్ వెంచర్ నుండి తప్పుకుంటున్నట్లు ఫోర్డ్ ఇండియా ప్రకటించింది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

భారతదేశంలో తమ కార్యకలాపాలను స్వతహాగా నిర్వహించడం కొనసాగిస్తామని ఫోర్డ్ పేర్కొంది. మహీంద్రా అండ్ మహీంద్రా మరియు ఫోర్డ్ ఇండియా కంపెనీలు అక్టోబర్ 1, 2019వ తేదీన తమ జాయింట్ వెంచర్ ప్లాన్‌ను ప్రకటించాయి. ఈ రెండు బ్రాండ్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఫోర్డ్ ఇండియా భవిష్యత్తులో భారత మార్కెట్ కోసం తీసుకురానున్న మోడళ్లలో ఉపయోగించే అండర్‌పిన్నింగ్స్‌ను (ప్లాట్‌ఫామ్)ను మహీంద్రా నుండి తీసుకోనుంది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

అయితే, ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ పేపర్ల దశలోనే ఆగిపోయింది. ఈ జేవీ నుండి తప్పుకుంటున్నట్లు ఫోర్డ్ ఇండియా డిసెంబర్ 31, 2020వ తేదీ సాయంత్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కారణాన్ని ఫోర్డ్ వెల్లడించకపోయినప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్ల కారణంగానే ఇరు కంపెనీలు ఈ జాయింట్ వెంచర్‌ను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

మహమ్మారి కారణంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులును దృష్టిలో ఉంచుకొని ఫోర్డ్ మరియు మహీంద్రా కంపెనీలు తమ మూలధన కేటాయింపు ప్రాధాన్యతలను తిరిగి అంచనా వేసుకోవలసి ఉందని ఫోర్డ్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ జాయింట్ వెంచర్ గురించి ఖచ్చితమైన ఒప్పందం కుదుర్చుకోవడంలో తుది నిర్ణయం తీసుకోవటానికి ఇరు కంపెనీలకు డిసెంబర్ 31, 2020వ తేదీ వరకు గడువు ఉందని ఆ ప్రకటన గుర్తు చేసింది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

అయితే, అక్టోబర్ 2019 నుండి వచ్చిన ఆర్థిక మార్పులను చూస్తే, ఈ రెండు కంపెనీలు ఈ ఒప్పందాన్ని పూర్తిగా ముగించడానికి బదులుగా, జాయింట్ వెంచర్‌ను విరమించుకోవాలని ఎంచుకున్నాయి.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

అక్టోబర్ 2019లో ఇరు కంపెనీలు ప్రకటించిన జాయింట్ వెంచర్ ప్రకారం, భారతదేశంలో ఫోర్డ్ కంపెనీ సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ మహీంద్రా నియంత్రించాల్సి ఉంటుంది. ఇందులో ప్రొడక్షన్, సేల్స్ సహా ఇతర కార్యకలాపాలు ఉన్నాయి. ఈ జాయింట్ వెంచర్ ప్రారంభంలో రెండు సంస్థలూ తగిన వనరులను సమకూర్చడానికి మరియు కొత్త ఉత్పత్తులు మరియు సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను వేసుకున్నాయి.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

కాగా, ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ ఇండియా విరమించుకోవడంతో, భారతదేశంలో స్వతంత్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని ఈ అమెరికన్ బ్రాండ్ పేర్కొంది. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాలను చురుకుగా అంచనా వేస్తున్నామని, దాని ఆధారంగా ఎంపికలు చేసి, మూలధనాన్ని కేటాయిస్తామని ఫోర్డ్ తమ ప్రకటనలో పేర్కొంది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

ఫోర్డ్-మహీంద్రా కంపెనీల మధ్య కుదిరిన జాయింట్ వెంచర్ నుండి భారత మార్కెట్లో ఇరు బ్రాండ్ల నుండి అనేక కొత్త ఉత్పత్తులు వస్తాయని అందరూ భావించారు. వీటిలో నెక్స్ట్-జెనరేషన్ ఎకోస్పోర్ట్ మరియు ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కూడా ఉన్నాయి. వాస్తవానికి, ఫోర్డ్-మహీంద్రా జేవీ నుండి రాబోయే మిడ్-సైజ్ ఎస్‌యూవీ చిత్రం కూడా గతంలో ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

ఈ జేవీలో భాగంగా, మహీంద్రా-ఫోర్డ్ కంపెనీల నుండి భారత మార్కెట్ కోసం అనేక మోడళ్లను ప్లాన్ చేసినప్పటికీ, అన్నింటి కన్నా ముందుగా మహీంద్రా ప్లాట్‌ఫామ్‌ను పంచుకోనున్న మొదటి ఫోర్డ్ ఉత్పత్తిగా సరికొత్త సి-ఎస్‌యూవీ (మిడ్-సైజ్ ఎస్‌యూవీ)ని ప్లాన్ చేశారు.

తూచ్.. నో డీల్..: మహీంద్రాతో జాయింట్ వెంచర్ నుండి ఫోర్డ్ అవుట్

ఈ కొత్త ఫోర్డ్ ఎస్‌యూవీని మహీంద్రా నుండి రాబోయే కొత్త తరం 2021 ఎక్స్‌యూవీ500 మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడు ఈ మొత్తం జేవీని పూర్తిగా నిలిపివేయడంతో, పైన పేర్కొన్న ఉత్పత్తులన్నీ కూడా నిలిచిపోనున్నాయి. కాగా, ఈ జాయింట్ వెంచర్ విషయంపై మహీంద్రా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Article Published On: Saturday, January 2, 2021, 12:32 [IST]
English summary
Ford India Exits From Proposed Ford-Mahindra Joint Venture. Read in Telugu
Read more on: #ఫోర్డ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+