భారత మార్కెట్లో రూ. 7.75 లక్షలకే ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్; వివరాలు

భారత మార్కెట్లో ఫోర్డ్ ఇండియా తన ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందించబడుతుంది మరియు ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి టైటానియం, టైటానియం ప్లస్ వేరియంట్లు.

భారత మార్కెట్లో రూ. 7.75 లక్షలకే ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్; వివరాలు

కంపెనీ ఇప్పుడు ఈ ఆటోమేటిక్ వేరియంట్ కోసం బుకింగ్‌లను దేశవ్యాప్తంగా స్వీకరించడం ప్రారంభించింది. ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ కొనుగోలు చేయాలననుకునే వినియోగదారులు 11,000 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

భారత మార్కెట్లో రూ. 7.75 లక్షలకే ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్; వివరాలు

ఫోర్డ్ ఫిగో యొక్క టైటానియం వేరియంట్ ధర రూ. 7.75 లక్షలు కాగా, టైటానియం ప్లస్ వేరియంట్ ధర రూ. 8.20 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్‌ 5 కలర్ ఆప్సన్లలో విక్రయించబడుతుంది. అవి రూబీ రెడ్, మూండస్ట్ సిల్వర్, స్మోక్ గ్రే, వైట్ గోల్డ్, డైమండ్ వైట్ కలర్స్.

భారత మార్కెట్లో రూ. 7.75 లక్షలకే ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్; వివరాలు

ఫోర్డ్ ఫిగో యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌ను 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో కంపెనీ విడుదల చేసింది. ఈ ఇంజన్ 95 బిహెచ్‌పి పవర్ మరియు 119 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో రూ. 7.75 లక్షలకే ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్; వివరాలు

ఫోర్డ్ ఇండియా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కూడా ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా విక్రయిస్తోంది. ఈ డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్ మరియు 215 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక లీటరుకి 24.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

భారత మార్కెట్లో రూ. 7.75 లక్షలకే ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్; వివరాలు

కొత్త ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్‌లో 15 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రో-క్రోమిక్ ఐఆర్‌విఎం, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివి వాటిని కలిగి ఉండి, వాహనదారునికి చాలా అనుకూలంగా ఉండేవిధంగా ఉంటుంది.

భారత మార్కెట్లో రూ. 7.75 లక్షలకే ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్; వివరాలు

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్‌ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫోర్డ్‌పాస్ కనెక్ట్ కార్ టెక్నాలజీ, ఆటో హెడ్‌ల్యాంప్స్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ వంటివి ఉంటాయి.

భారత మార్కెట్లో రూ. 7.75 లక్షలకే ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్; వివరాలు

భారతీయ మార్కెట్లో ఫోర్డ్ ఫిగో మారుతి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ వంటి వాటికీ ప్రతక్ర్తిగా ఉంటుంది. ఇటీవల, ఫోర్డ్ ఇండియా తన ఫుల్ సైజ్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఎండీవర్ యొక్క టైటానియం 4 ఎక్స్ 2 బేస్ వేరియంట్ అమ్మకాలను నిలిపివేసింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీని టైటానియం ప్లస్ 4 ఎక్స్ 2 ఆటోమాటిక్, టైటానియం ప్లస్ 4 ఎక్స్ 4 ఆటోమాటిక్ మరియు స్పోర్ట్ 4 ఎక్స్ 4 ఆటోమేటిక్ అనే మూడు వేరియంట్లలో విక్రయిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 22, 2021, 15:43 [IST]
English summary
2021 Ford Figo Petrol Automatic Launched In India. Read in Telugu.
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+