ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్ డేట్ వెల్లడి.. ఎప్పుడంటే..?

ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఫిగోలో ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా, ఇందుకు సంబంధించి కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్ డేట్ వెల్లడి.. ఎప్పుడంటే..?

ఫోర్డ్ ఇండియా విడుదల చేసిన టీజర్ ప్రకారం, కంపెనీ తమ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్‌ను జులై 22, 2021వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఫోర్డ్ ఫిగో కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్ డేట్ వెల్లడి.. ఎప్పుడంటే..?

కాగా, కొత్తగా రాబోయే ఈ ఆటోమేటిక్ వేరియంట్‌లో కంపెనీ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. కొత్త ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్ డేట్ వెల్లడి.. ఎప్పుడంటే..?

ఫోర్డ్ ఇప్పటికే ఈ ఇంజన్‌ను తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్‌లో ఉపయోగిస్తోంది. ఎకోస్పోర్ట్‌లోని ఈ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 96 బిహెచ్‌పి పవర్‌ను మరియు 119 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్ డేట్ వెల్లడి.. ఎప్పుడంటే..?

ఫోర్డ్ ఫిగోని తొలిసారిగా తొలిసారిగా 2015 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదల చేశారు. ఆ సమయంలో ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా అమ్ముడయ్యేది. అప్పట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విక్రయించిన ఫోర్డ్ ఫిగో కారులో 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించేవారు.

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్ డేట్ వెల్లడి.. ఎప్పుడంటే..?

ఈ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసింది. అయితే, ఫోర్డ్ ఇండియా 2019లో ఫిగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు, ఈ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టింది.

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్ డేట్ వెల్లడి.. ఎప్పుడంటే..?

అంతేకాకుండా, కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన 1.5-లీటర్ డ్రాగన్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా జోడించింది. ఇటీవల, భారతదేశంలో బిఎస్6 ఉద్గార నిబంధనలను కఠినతరం చేయడంతో, ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ తమ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను నిలిపివేసింది.

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ లాంచ్ డేట్ వెల్లడి.. ఎప్పుడంటే..?

కాగా, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫోర్డ్ ఫిగోలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను దాని మిడ్-స్పెక్ టైటానియం ట్రిమ్‌లో అందించబడుతుందని సమాచారం. అంతేకాకుండా, ఈ గేర్‌బాక్స్‌ను ఫిగో టాప్-స్పెక్ వేరియంట్‌లో కూడా అందించే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో నేరుగా మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 20, 2021, 12:48 [IST]
English summary
Ford Figo Automatic Variant India Launch On July 22, 2021. Read in Telugu.
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+