త్వరలో విడుదల కానున్న ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్; డీటేల్స్

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఫోర్డ్ ఫిగోలో కంపెనీ ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఫోర్డ్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది.

త్వరలో విడుదల కానున్న ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్; డీటేల్స్

తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఫిగో త్వరలోనే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదల కానుంది. ఫోర్డ్ ఫిగో పెట్రోల్ ఇంజన్‌ను కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో నేరుగా మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

త్వరలో విడుదల కానున్న ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్; డీటేల్స్

కొత్త ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్‌ను 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్ చేయవచ్చని సమాచారం. ఫోర్డ్ ఇప్పటికే ఈ ఇంజన్‌ను తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో ఉపయోగిస్తోంది. ఎకోస్పోర్ట్‌లోని ఈ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 96 బిహెచ్‌పి పవర్‌ను మరియు 119 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

త్వరలో విడుదల కానున్న ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్; డీటేల్స్

భారత మార్కెట్లో ఫోర్డ్ ఫిగో ఎస్‌యూవీని తొలిసారిగా 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ఆ సమయంలో ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అమ్ముడయ్యేది. అప్పట్లో ఫోర్డ్ ఫిగోను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విక్రయిస్తున్న ఈ కారులో 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించేవారు.

త్వరలో విడుదల కానున్న ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్; డీటేల్స్

ఈ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసింది. కానీ ఫోర్డ్ ఇండియా 2019లో ఫిగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు, దాని స్థానంలో టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టింది.

త్వరలో విడుదల కానున్న ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్; డీటేల్స్

దీనితో పాటుగా కంపెనీ మరింత శక్తివంతమైన 1.5-లీటర్ డ్రాగన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించింది. అయితే, బిఎస్6 ఉద్గార నిబంధనలను అమలు చేయడం వల్ల, ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ తమ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను నిలిపివేసింది. కాగా, ఇప్పుడు త్వరలోనే ఈ మోడల్ తిరిగి సరికొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.

త్వరలో విడుదల కానున్న ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్; డీటేల్స్

ఫోర్డ్ ఫిగో యొక్క కొత్త పెట్రోల్-ఆటోమేటిక్ ఇంజిన్-గేర్‌బాక్స్ కలయిక దాని మిడ్-స్పెక్ టైటానియం ట్రిమ్‌లో అందించబడుతుందని సమాచారం. అంతేకాకుండా, ఈ గేర్‌బాక్స్‌ను హ్యాచ్‌బ్యాక్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్‌లో కూడా అందించే అవకాశం ఉంది.

త్వరలో విడుదల కానున్న ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్; డీటేల్స్

ఇదిలా ఉంటే, ఫోర్డ్ ఇండియా ఇటీవలే తమ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఎండీవర్ యొక్క టైటానియం 4x2 బేస్ వేరియంట్ అమ్మకాలను నిలిపివేసింది. ఇకపై ఈ ఎస్‌యూవీని టైటానియం ప్లస్ 4x2 ఆటోమేటిక్, టైటానియం ప్లస్ 4x4 ఆటోమేటిక్ మరియు స్పోర్ట్ 4x4 ఆటోమేటిక్ అనే మూడు వేరియంట్లలో మాత్రమే విక్రయించనున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 14, 2021, 17:26 [IST]
English summary
Ford India To Launch Figo Automatic Variant Soon, Details. Read in Telugu.
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+