భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం Ford (ఫోర్డ్), భారతదేశంలో వచ్చిన నష్టాల కారణంగా ఇక్కడి మార్కెట్లో తమ ప్రత్యక్ష వ్యాపారాన్ని నిలిపివేసి, దేశం విడిచి వెళ్లిపోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, ఫోర్డ్ భారతదేశంలో తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దేశంలో పరోక్షంగా తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

ఇప్పటికే, దేశంలో విక్రయించబడిన Ford కార్ల విషయంలో తమ కస్టమర్లకు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ ను అందించే విషయంలో కంపెనీ హామీ కూడా ఇచ్చింది. ఇటీవల కొత్తగా ఫోర్డ్ కార్లను కొనుగోలు చేసిన వారు, ఇకపై కొనుగోలు చేయబోయే వారు ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. చూస్తుంటే ఫోర్డ్, భారత మార్కెట్లో హార్లే డేవిడ్సన్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

మనదేశంలో హార్లే డేవిడ్సన్ కూడా భారత మార్కెట్ నుండి ప్రత్యక్షంగా నిష్క్రమించి, పరోక్షంగా హీరో మోటోకార్ప్‌తో కలిసి వ్యాపారం చేస్తోంది. ఈ బైక్ లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఎంపిక చేసిన హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్స్ లేదా హీరో మోటోకార్ప్ అధీనంలో ఉన్న ప్రస్తుత హార్లే డేవిడ్సన్ షోరూమ్‌ల ద్వారా ఈ ప్రీమియం మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయవచ్చు.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

అదే విధంగా, Ford కూడా మనదేశంలో పరోక్ష వ్యాపారాన్ని సాగించే అవకాశం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఫోర్డ్ తమ Mustang Mach-e (మస్టాంగ్ మాక్-ఇ) ఎలక్ట్రిక్ కారును ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా భారత్‌ కి వచ్చే అవకాశం ఉంది.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

Ford నుండి అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ కారు Mustang GT ని ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. అయితే, మస్టాంగ్ జిటి స్పోర్ట్స్ కార్ కూప్ స్టైల్ బాడీని కలిగి ఉంటే, ఈ కొత్త Mustang Mach-e ఎలక్ట్రిక్ మాత్రం ఎస్‌యూవీ / క్రాసోవర్ టైప్ బాడీని కలిగి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ తో పాటుగా F-150 Lightning (ఎఫ్-150 లైట్నింగ్) అనే ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును కూడా కంపెనీ విక్రయిస్తోంది.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

ఈ నేపథ్యంలో, భారత మార్కెట్లోకి రానున్నFord Mustang Mach-e ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

Ford Mustang Mach-e డిజైన్

Ford Mustang Mach-e డిజైన్‌ను దాని పాపులర్ పెట్రోల్ వెర్షన్ Ford Mustang నుండి తీసుకోబడింది. ఇది Mustang తరహాలోనే కూప్ స్టైల్ బాడీ టైప్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో స్టాండర్ మస్టాంగ్ తరహా మాదిరిగా కనిపించే ఫాక్స్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్లతో కూడిన సన్నటి ఎల్ఈడి ఫాగ్‌ల్యాంప్స్, మస్టాంగ్ స్టైల్ సిగ్నేచర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ రూఫ్, ఆటోమేటిక్ డోర్స్ మరియు స్టైలిష్ అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

Ford Mustang Mach-e రేంజ్

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో అత్యంత ప్రధానమైనది దాని రేంజ్. Ford Mustang Mach-e రేంజ్ మరియు పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుబాటులో సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారులో 68 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీని స్టాండర్డ్ బ్యాటరీ ప్యాక్‌గా అందిస్తారు. కావాలనుకుంటే, దీనిని 88 kWh వరకూ పెంచుకోవచ్చు. ఇది ఆల్-వీల్ డ్రైవ్ మరియు రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని చిన్న బ్యాటరీ యొక్క పూర్తి చార్జ్ పై ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 370 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. అలాగే, పెద్ద బ్యాటరీ సాయంతో గరిష్టంగా 483 కిమీ వరకు రేంజ్ ను పొందవచ్చు.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

Ford Mustang Mach-e పెర్ఫార్మెన్స్

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారే అయినప్పటికీ, ఇది స్టాండర్డ్ పెట్రోల్ యొక్క పనితీరుతో ఏ మాత్రం తీసిపోదని కంపెనీ పేర్కొంది. ఈ కారులోని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ సాధారణ స్పోర్ట్స్ కారుకి సమానమైన పనితీరును అందిస్తుంది. స్టాండర్డ్ బ్యాటరీ ప్యాక్‌తో, ఇది గరిష్టంగా 270 బిహెచ్‌పి పవర్ ను మరియు 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, దీని టార్క్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌ లో 580 ఎన్ఎమ్‌ కి చేరుకుంటుంది. ఈ కారు కేవలం 3.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 96 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

Ford Mustang Mach-e ఇంటీరియర్స్

ఈ ఎలక్ట్రిక్ కారులోని ఇంటీరియర్స్ చాలా క్లీన్‌ గా, తక్కువ బటన్లతో ఎంతో ప్రీమియం అప్పీల్ ను కలిగి ఉంటాయి. డ్యాష్‌బోర్డ్ మధ్యలో సెంటర్ కన్సోల్ కి అనుసంధానంగా ఇందులో నిలువుగా అమర్చిన ఓ పెద్ద 15 ఇంచ్ వెర్టికల్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ యూనిట్ ఉంటుంది. దీని సాయంతోనే ఈ ఎలక్ట్రిక్ కారులోని అనేక ఫీచర్లను కంట్రోల్ చేయటం జరుగుతుంది.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారులో డ్రైవర్ సమాచారం కోసం 10.2 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఈ డిస్‌ప్లే యూనిట్‌లో, నావిగేషన్‌తో పాటు అనేక రకాల సమాచారం లభిస్తుంది. మరియు నియంత్రణలు ఇవ్వబడతాయి. ఇదొక 5 సీటర్ ఎస్‌యూవీ మరియు ఇందులో స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ మస్టాంగ్ కన్నా మెరుగైన క్యాబిన్ స్పేస్ ఉంటుంది. ఇంకా ఈ కారులో 3 స్పోక్ స్పోర్టీ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పవర్ టెయిల్ గేట్, యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి పలు సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

Ford Mustang Mach-e ధర

అమెరికా మార్కెట్లో Ford Mustang Mach-e ప్రారంభ ధర 42,895 డాలర్లు (పన్ను రాయితీ కలపకుండా) గా ఉంటుంది. అంటే మనదేశ కరెన్సీలో ప్రస్తుత మారకపు విలువ ప్రకారం, సుమారు రూ. 31.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. అయితే, ఈ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, భారతదేశానికి దిగుమతి చేసుకోవటం వలన దీని ధర రెండింతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

భారత్‌కు రానున్న Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు: టాప్ 5 డీటేల్స్

అంటే, భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 70 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ 2022 లో విడుదల కావచ్చని సమాచారం. అమెరికాలో Ford Mustang Mach-e మొత్తం నాలుగు వేరియంట్లలో (సెలక్ట్, ప్రీమియం, కాలిఫోర్నియా రూట్ 1 మరియు జిటి) లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి దాని రేంజ్ మరియు ఫీచర్లు మారుతూ ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 13, 2021, 12:52 [IST]
English summary
Ford mustang mach e india launch expected top 5 things to know
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+