హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

భారతదేశంలో కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ అందిస్తున్న కార్లకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. హ్యుందాయ్ కార్లు చాలా ప్రీమియం అప్పీల్‌ను కలిగి ఉండి, మంచి ఫీచర్లతో మొదటి చూపులోనే కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంటాయి. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకొని, దానికి తగినట్లుగా కార్లను మరియు అందులోని ఫీచర్లను అందించడంలో హ్యుందాయ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. కొత్త కార్లకే కాకుండా, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా హ్యుందాయ్ కార్లకు ఎక్కువ గిరాకీ ఉంటోంది.

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

హ్యుందాయ్ కార్లు చాలా విశ్వసనీయైమనవి. ఇందుకు ప్రధాన కారణం, కస్టమర్ల నుండి హ్యుందాయ్ దక్కించుకున్న బ్రాండ్ ఇమేజ్. భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ కి, దేశవ్యాప్తంగా సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ ఉంది. మెట్రో నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకూ హ్యుందాయ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ కార్లు సాధారణ కార్ మెకానిక్ లు కూడా మరమత్తు చేసేంత సులువుగా ఉంటాయి.

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

అందుకే, సెకండ్ హ్యాండ్ మార్కెట్ లోనూ హ్యుందాయ్ కార్లు ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. మరి ఈనాటి మన కథనంలో, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ గా ఉన్నా నాలుగు పాపులర్ హ్యుందాయ్ కార్ల గురించి తెలుసుకుందాం రండి..!

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

హ్యుందాయ్ ఐ10 - 2012-2018 (Hyundai i10)

హ్యుందాయ్ నుండి లభిస్తున్న అద్భుతమైన కార్లలో ఐ10 హ్యాచ్‌బ్యాక్ కూడా ఒకటి. హ్యుందాయ్ శాంత్రో కొంత కాలం పాటు మార్కెట్ నుండి తొలగిపోయిన తర్వాత, ఈ విభాగంలో ఎంట్రీ లెవల్ కారుగా ఐ10 అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఈ చిన్న కారు సరసమైన ధరతో పాటుగా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క ప్రధాన లక్షణం, దాని ఆకర్షణీమైన మైలేజ్. ఒక చిన్న కారులో ఉండాల్సిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

మైలేజ్ మరియు ఫీచర్ల కారణంగా హ్యుందాయ్ ఐ10 వినియోగదారులలో ప్రసిద్ధి చెందింది. హ్యుందాయ్ ఐ10 కొనుగోలు చేయడానికి ఇవి రెండూ ప్రధాన కారణాలు. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో హ్యుందాయ్ ఐ10 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ కారును రూ. 2.50 లక్షల నుండి రూ. 3.50 లక్షల మధ్యలో కొనుగోలు చేయవ్చచు. అయితే, ఈ ధర కారు కండిషన్ మరియు తయారైన సంవత్సరాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

హ్యుందాయ్ ఐ20 - 2012-2020 (Hyundai i20)

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో హ్యుందాయ్ ఐ20 ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. హ్యుందాయ్ చాలా కాలంగా ఐ20 కారును భారత మార్కెట్లో విక్రయిస్తోంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్ మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్ల కారణంగా, ఇది మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతోంది. ఈ కారుకి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా మంచి క్రేజ్ ఉంది.

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

వాడిన హ్యుందాయ్ ఐ20 కారును దాని మేక్, వేరియంట్, మైలేజ్ మరియు దాని కండిషన్ ను బట్టి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో రూ. 3 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్యలో కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ గతేడాది చివరి త్రైమాసికంలో తమ కొత్త తరం 2020 హ్యుందాయ్ ఐ20 మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త తరం మోడల్ కూడా మార్కెట్లో మంచి ఆదరణను పొందుతోంది.

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

హ్యుందాయ్ ఎలంట్రా - 2014-2019 (Hyundai Elantra)

హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలాంట్రా. భారత మార్కెట్లో ఇది ఈ విభాగంలో హోండా సివిక్, టొయోటా కరోలా మరియు స్కోడా ఆక్టావియా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్ మంచి క్యాబిన్ స్పేస్ మరియు ఇంటీరియర్ కంఫర్ట్ ఫీచర్లను కలిగి ఉండి, ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని మరియు డ్రైవర్ కు విలాసవంతమైన డ్రైవింగ్ అనుభూకిని అందిస్తుంది.

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

హ్యుందాయ్ ఎలాంట్రా కారులోని 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మంచి ప్రజాదరణ పొందింది. ఈ కారులో కొత్త వచ్చిన వేరియంట్‌లు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో హ్యుందాయ్ ఎలాంట్రా కండిషన్‌ను బట్టి దానిని రూ. 6 లక్షల నుంచి రూ. 13 లక్షల మధ్యలో కొనుగోలు చేయవచ్చు. ఇదివరకు చెప్పుకున్నట్లుగా, ఈ ధర అనేది కారు తయారైన సంవత్సరం, అది తిరిగిన కిలోమీటర్లు మరియు దాని ఓవరాల్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది.

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

హ్యుందాయ్ వెర్నా - 2014-2020 (Hyundai Verna)

హ్యుందాయ్ నుండి లభిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ వెర్నా. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కార్లలో హ్యుందాయ్ వెర్నా కూడా ఒకటి. ముఖ్యంగా ఈ కారు దాని డీజిల్ ఇంజన్ కు ప్రసిద్ధి చెందినది. హ్యుందాయ్ వెర్నా లోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ రీఫైన్‌మెంట్ మరియు విశ్వసనీయతలో అత్యుత్తమంగా ఉంటుంది.

హ్యుందాయ్ బ్రాండ్ నుండి ఈ 4 సెకండ్ హ్యాండ్ కార్లను కళ్లు మూసుకొని కొనేయచ్చు!

నిజానికి, చాలా మంది వినియోగదారులు తమ హ్యుందాయ్ ఎలంట్రా కారును 1 లక్ష కిలోమీటర్లకు పైగా ఎటువంటి సమస్యలు లేకుండా నడిపి ఉంటారు. ప్రధానంగా, ఈ కారు డిజైన్ మరియు అందులో లభించే ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. హ్యుందాయ్ వెర్నా తయారైన సంవత్సరం మరియు దాని ఓవరాల్ కండీషన్ ఆధారంగా, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ కారును రూ. 4 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్యలో కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Four best used hyundai cars you may consider to buy i10 i20 elantra verna details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X