డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనకు గడువు పొడిగించిన ప్రభుత్వం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

కార్లలో ఎయిర్‌బ్యాగులు ప్రాముఖ్యత ఎంత ఉందో వాహనదారులందరికి బాగా తెలిసిందే. ఎయిర్‌బ్యాగులు లేకపోవడం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఎన్నో సంఘటనల ద్వారా ఇది వరకు తెలిసి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కార్లలో ఫ్రంట్ ప్యాసింజర్లకు తప్పనిసరిగా ఎయిర్‌బ్యాగులు ఉండాలి అనే నిబంధను తీసుకువచ్చింది.

డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనకు గడువు పొడిగించిన ప్రభుత్వం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

నివేదికల ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇది 2021 ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా పాటించాలి, కానీ కరోనా అధికంగా వ్యాపించిన కారణంగా ప్రభుత్వం ఈ సమయాన్ని కాస్త ఇప్పుడు పొడిగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కార్లలో ఎయిర్‌బ్యాగులు ఏర్పాటు 2021 డిసెంబర్ 31 వరకు అంటే నాలుగు నెలలు సమయం పొడిగించబడింది.

డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనకు గడువు పొడిగించిన ప్రభుత్వం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

దేశంలో కారు ప్రయాణికుల భద్రతను పెంచడానికి, డ్రైవర్ సీటుతో పాటు ముందు ప్రయాణీకుల సీటుకు కూడా ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేయబడ్డాయి. భారతదేశంలో తయారు చేయబడిన మరియు విక్రయించే అన్ని కార్లకు ముందు వరుస సీట్లకు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి.

డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనకు గడువు పొడిగించిన ప్రభుత్వం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

అయితే, కొత్త నిబంధనలను అమలు చేయడానికి కార్ కంపెనీలు ఎక్కువ సమయాన్ని కోరాయి. ఎయిర్‌బ్యాగ్‌లకు సరిపోయేలా తన ప్రొడక్షన్ లైన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి అవసరం ఉంటుందని కూడా చెప్పారు. దీని కోసం ఎక్కువ సమయం కేటాయించారు. ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగుల ఏర్పాటు అనేది సుప్రీంకోర్టు కమిటీ సిఫారసుల ఆధారంగా ఉంటుంది.

డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనకు గడువు పొడిగించిన ప్రభుత్వం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

భారతీయ రోడ్లపై వాహనాలకు ఇది ముఖ్యమైన భద్రతా లక్షణంగా విడుదల చేయబడింది. ఎందుకంటే భారతీయ రోడ్లపై రోజురోజుకు లెక్కకు మించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో చాలా వాహనాల్లో ఎయిర్‌బ్యాగులు లేకపోవడం వల్ల ఎక్కువమంది మృత్యువాత పడుతున్నారు.

డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనకు గడువు పొడిగించిన ప్రభుత్వం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఆదేశాల మేరకు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా ఎఐఎస్ 145 ప్రమాణాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఈ నియమం భారతదేశంలో ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగులు లేని ఎంట్రీ లెవల్ కార్లలో భద్రతను పెంచుతుంది. ఇవి వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనకు గడువు పొడిగించిన ప్రభుత్వం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ఫ్రంట్ సీట్ ఎయిర్‌బ్యాగులు అదనంగా భారతదేశంలో ఎంట్రీ లెవల్ కార్ల ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. కొత్త నిబంధన ప్రకటించిన తరువాత ఎయిర్‌బ్యాగ్ కంపెనీ ఆటోలైవ్ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ సంస్థ కార్లలో ఏర్పాటు చేసిన ఎయిర్‌బ్యాగ్‌ల కోసం ఇన్‌ఫ్లేటర్లను తయారు చేస్తుంది.

డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనకు గడువు పొడిగించిన ప్రభుత్వం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

రోడ్డు ప్రమాదంలో ప్రయాణికుల భద్రతలో ఎయిర్‌బ్యాగులు చాలా అవసరం, ఒక కారు దేన్నైనా ఢీ కొట్టినప్పుడు ఎయిర్‌బ్యాగ్ ఆటోమాటిక్ గా తెరుచుకుంటుంది, ఈ విధంగా తెరుచుకున్నప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతుంది.

డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ నిబంధనకు గడువు పొడిగించిన ప్రభుత్వం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి కంపెనీలు సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటివి ప్రస్తుతం తప్పనిసరి. ఇవన్నీ వాహనదారుని భద్రతకు ఉపయోగపడతాయి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనను ఉల్లంఘిస్తూ ఎవరైనా పట్టుబడితే వారికి భారీగా జరిమానా ఉటాయి. ప్రయాణికులు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.

Most Read Articles

English summary
Front Seat Passenger Airbag Deadline Extended 2021 December 31st. Read in Telugu.
Story first published: Monday, June 28, 2021, 14:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X