భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీకి చేరువలో ఉన్నాయి. భారత్‌లో వరుసగా ఎనిమిదో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఫలితంగా ఢిల్లీలో పెట్రోల్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 16న దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై వరుసగా 26-30 పైసలు మరియు 33-38 పైసల మేర ధర పెరిగింది.

భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

గత కొంత కాలంగా చమురు కంపెనీలు ఇంధన ధరలను పైసల్లోనే పెంచుతున్న ఉన్నప్పటికీ, ఫైనల్‌గా పెరిగిన ధరలను చూసుకుంటే మాత్రం మంట పుట్టక మానదు. చమురు ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేసిన తర్వాత, దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు ఇష్టారాజ్యంగా తమ ఇంధన ధరలను పెంచేస్తున్నాయి.

భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

తాజా పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.88.99 నుండి రూ.89.29కి చేరుకోగా, డీజిల్ ధర రూ.79.35 నుండి రూ.79.70కి పెరిగింది. గత ఎనిమిది రోజుల్లో, రాజధానిలో పెట్రోల్ ధర మొత్తం రూ.2.36 మరియు డీజిల్ ధర రూ.2.91 మేర పెరిగింది.

MOST READ:భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

అదే ముంబైలో చూసుకుంటే, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.95.75 లకు పెరిగింది. డీజిల్ ధర లీటరుకు రూ.86.72 లకు చేరుకుంది. కాగా, బెంగళూరులో పెట్రోల్ ధర లీటరుకు రూ.92.28 కు మరియు డీజిల్ ధరను లీటరుకు రూ.84.49 లకు చేరుకుంది.

భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

అలాగే, చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు రూ.91.45 మరియు రూ.84.77 లకు పెరిగాయి. గత వారం, చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంధన ధరలను తగ్గించడానికి పన్నులను తగ్గించే అవకాశాన్ని తోసిపుచ్చిన విషయం మనందరికీ తెలిసినదే.

MOST READ:ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

గతేడాది కరోనా మహమ్మారి కారణంగా, దేశంలోని చమురు కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణను కొన్ని నెలలపాటు నిలిపివేసాయి. అయితే, ఇప్పుడు దేశంలోని ప్రధాన చమురు కంపెనీలైన భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం అంతర్జాతీయ మార్కెట్ల ధరలను ఆధారంగా దేశీయ మార్కెట్లో రోజూ ఇంధన ధరలను సవరిస్తూనే ఉన్నాయి.

భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండే కొత్త చమురు ధరలను అమలు చేస్తుంది. మరోవైపు కొన్ని నగరాల్లో అయితే, ప్రీమియం కార్లలో ఉపయోగించే ప్రీమియం పెట్రోల్ సెంచరీని దాటిపోయింది. పలు నగరాల్లో ప్రీమియం పెట్రోల్ ధర లీటరకు రూ100 పైగానే ఉంది.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

ఇదిలా ఉంటే, దేశంలో భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరాఘాతాన్ని ఎదుర్కునేందుకు కేంద్రం ఇప్పుడు కొత్త ప్రణాళికలకు సిద్ధమవుతోంది. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి, దేశవ్యాప్తంగా మొత్తం 69,000 పెట్రోల్ పంపుల వద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ నిర్మించే ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనుంది.

భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

దేశంలో చమురు ధరలు ఇంత అధికంగా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంకా నోరు విప్పడం లేదు. అయితే, పెట్రో మంటను చూస్తున్న వినియోగదారులు మాత్రం ప్రత్యామ్నాయంగా, కాస్తంత ఖరీదైనా పర్వాలేదని ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

MOST READ:ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

ప్రభుత్వం కూడా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించేందుకు అనేక డిస్కౌంట్లను, ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే, బ్యాటరీ ధరను ఎలక్ట్రిక్ వాహనాల ధర నుండి వేరు చేయబడింది. దీని ఫలితంగా 30 శాతం వరకూ పన్ను ఆదా అవుతుంది.

Most Read Articles

English summary
Fuel Price Increased Again; Petrol Price Touches Record High In Delhi. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X