ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మనం హబ్ మౌంటెడ్ మోటార్ టెక్నాలజీని చూశాం. అంటే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వెనుక చక్రంలో ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉండి, బ్యాటరీ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. కానీ, కార్లలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉండేది.

ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

ఇప్పటి వరకూ మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లలో, ఎలక్ట్రిక్ మోటార్లను ముందు లేదా వెనుక యాక్సిల్స్‌లో (ఇరుసులలో) అమర్చేవారు. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగిన ఎలక్ట్రిక్ కార్లలో అయితే, రెండు యాక్సిల్స్‌లోనూ (ముందు, వెనుక) ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చేవారు.

ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

అయితే, ఇకపై టూవీలర్ల మాదిరిగానే కార్లలో కూడా ఎలక్ట్రిక్ మోటార్లను నేరుగా చక్రాల్లోనే అమర్చే టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. యూకేకి చెందిన సైయెట్టా గ్రూప్ ఈ కొత్త శ్రేణి ఇన్-వీల్ మోటార్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీ ఇంట్రా-సిటీ అవసరాలను మరియు ఇతర స్మార్ట్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకుని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

సైయెట్టా గ్రూప్ యొక్క ఏఎఫ్‌టి 140 ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీ అప్పటికే దాని ఇన్-వీల్ మోటార్ టెక్నాలజీ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సంస్థ తన ఇన్-వీల్ మోటార్ టెక్నాలజీ సామర్థ్యం గురించి పేర్కొన్నట్లుగా, ఇది వివిధ రకాల పట్టణ రవాణా అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.

ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల మాదిరిగా ఎలక్ట్రిక్ కార్లలో అనేక రకాల కదిలే భాగాలు ఉండవు. వీటిలో ప్రధానమైనవి ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌లు చాలా కాంపాక్ట్ ప్యాకేజింగ్‌ను కలిగి ఉండి, తయారీకి సులువుగా ఉంటాయి.

ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

ఇలాంటి ఎలక్ట్రిక్ కార్లలో ఎలక్ట్రిక్ మోటారును పూర్తిగా చక్రాలలోకి మార్చడం ద్వారా, సైయెట్టా గ్రూప్ సదరు వాహనాల కోసం ఉపయోగించే ప్లాట్‌ఫామ్‌ను దాదాపు చదునుగా మరియు ఎక్కువ అడ్డంకులు లేకుండా ఉండేలా డిజైన్ చేసింది.

ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

సైయెట్టా యొక్క ఇన్-వీల్ మోటార్లు చక్రాలలో ఖాళీ స్థలంలో ఉంచే విధంగా రూపొందించబడ్డాయి. ఫలితంగా ఈ ప్లాట్‌ఫామ్ కారులో తయారీలో ఎక్కువ స్థలాన్ని అందించేందుకు అనువుగా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ యొక్క ఫ్లాట్ ఫ్లోర్ ఏ రకమైన బాడీ టైప్ కారును తయారు చేయడానికైనా మద్దతు ఇవ్వడానికి అనుమతిస్తుంది.

ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

డ్రైవ్ షాఫ్ట్‌లు మరియు వాటికి సంబంధించిన కదిలే భాగాల సంఖ్యను మరింత తగ్గించడానికి ఈ ప్లాటా‌ఫామ్ ఇంజనీర్లకు అనుమతిస్తుంది. నిజానికి సైయెట్టా గ్రూప్ యొక్క ఇన్-వీల్ మోటారు మరియు ప్రస్తుతం లభిస్తున్న హబ్ మోటార్లు రెండూ కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.

ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

అదెలా అంటే, సైయెట్టా గ్రూప్ యొక్క ఇన్-వీల్ మోటారు కాన్సెప్ట్‌లు ఎలక్ట్రిక్ మోటారును చక్రం లోపల బ్రేక్ కాలిపర్లు ఉంచే చోట అమర్చడం జరుగుతుంది. కాబట్టి, ఇది చక్రానికి అమర్చే మోటారే కానీ, చక్రంలో ఇమిడి ఉండే మోటార్ మాత్రం కాదని గుర్తుంచుకోవాలి. ఇవి మెరుగైన పనితీరును, ఫ్లెక్సిబిలిటీని, మాడ్యులారిటీని మరియు ఆల్-వీల్ డ్రైవ్ సామర్ధ్యాలను కలిగి ఉంటాయని సైయెట్టా గ్రూప్ పేర్కొంది.

అయితే, ప్రస్తుతానికి ఈ తరహా మోటార్లు మాత్రం అధిక-పనితీరు వినియోగానికి ప్రత్యామ్నాయంగా మారుతాయని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో లభిస్తున్న లో-స్పీడ్ టూవీలర్స్ మాదిరిగానే, వీటిని కూడా లో-స్పీడ్ ఫోర్ వీలర్స్‌లో ఉపయోగించే అవకాశం ఉంది.

ఇకపై కార్ చక్రాల్లోనే ఎలక్ట్రిక్ మోటార్లు; కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన సైయెట్టా గ్రూప్

అంటే, పెట్రోల్ మరియు డీజిల్ కార్లతో పోటీగా తయారు చేయబోయే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఇవి పనికిరాకపోవచ్చు. కానీ, భవిష్యత్తుల్లో ఈ టెక్నాలజీని మరింత గొప్పగా అభివృద్ధి చేసి, హై-స్పీడ్ ఇన్-వీల్ ఎలక్ట్రిక్ మోటార్లను అందుబాటులోకి తెచ్చినట్లయితే, పరిస్థితులు మారే అకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Future Electric Cars Will Have In-Wheel Motors, Saietta Showcases New Technology. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X