Just In
- 21 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 31 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 40 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- News
ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇక తప్పనిసరే.. పొడగింపులు ఉండవ్..: ఫాస్టాగ్‌పై నితిన్ గడ్కరీ స్టేట్‌మెంట్
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల గుండా ప్రయాణించే వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలని గత కొంత కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసినదే. కరోనా మహమ్మారి నేపథ్యంలో, ఫాస్టాగ్ తప్పనిసరి నిబంధనల్లో కొన్నిసార్లు సడలింపులు ఇస్తూ వచ్చారు.

అయితే, ఇకపై ఈ విషయంలో ఎలాంటి పొడగింపులు ఉండబోవని, తప్పనిసరిగా నూటికి నూరు శాతం ఫాస్టాగ్ నిబంధనలను పాటించాలని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజు వసూలు కోసం ఫాస్టాగ్ వ్యవస్థను 100 శాతం అమలు చేయడానికి గడువును పొడిగించే ప్రతిపాదన లేదని నితిన్ గడ్కరీ తెలిపారు.

వాస్తవానికి ఇదివరకటి నిబంధనల ప్రకారం, జనవరి 1, 2021వ తేదీ నుండి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల గుండా వెళ్లే అన్ని వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలి. అయితే, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయాన్ని ఫిబ్రవరి 15 వరకూ పొడగించారు.

ఇక ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత ఈ విషయంలో ఎలాంటి పొడగింపులు ఉండవని గడ్కరీ స్పష్టం చేశారు. ఈ గడువు తేదీ లోపుగా వాహనాలను వినియోగించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ వాహనాలకు ఫాస్టాగ్‌ను జోడించుకోవాలని సూచించారు.

గత 2019 డిసెంబర్‌లో 44.31 శాతంగా ఉన్న ఫాస్టాగ్ వసూళ్లు గడచిన 2020 డిసెంబర్‌లో 73.36 శాతానికి పెరిగాయని గడ్కరీ వివరించారు. డిసెంబర్ 2020 నెలలో ఫాస్టాగ్ ద్వారా వసూలు చేసిన నెలవారీ ఫీజు మొత్తం రూ.2,088.26 కోట్లుగా నమోదైందని ఆయన అన్నారు.

ఒక్క తమిళనాడులో రాష్ట్రంలోనే జనవరి 12 వరకు మొత్తం 18,64,115 ఫాస్ట్ ట్యాగ్‌లు జారీ చేయబడ్డాయి. ఈ చొరవ వల ఫాస్టాగ్ దారుల్లో నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గిందని, ఈ వ్యవస్థ మరింత కార్యాచరణలోకి రావడంతో ఇది మరింత మెరుగుపడుతుందని గడ్కరీ చెప్పారు.

ఫాస్ట్‌ట్యాగ్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?
ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాల విండ్‌షీల్డ్‌పై అమర్చిన ఓ డిజిటల్ స్టిక్కర్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఈ స్టిక్కర్ కలిగిన వాహనం టోల్ ప్లాజా గుండా వెళుతున్నప్పుడు, అక్కడ ఉండే సెన్సార్లు ఈ ట్యాగ్‌ని రీడ్ చేసి, ఫాస్ట్‌ట్యాగ్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ లేదా ప్రీపెయిడ్ ఖాతా నుండి డబ్బును ఆటోమేటిక్‌గా డిడక్ట్ చేస్తాయి.