కరోనా ఎఫెక్ట్: రెండేళ్ల విరామం తర్వాత జరగనున్న జెనీవా మోటార్ షో

గత 2019లో ప్రారంభమైన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపివేసిన మనందరికీ సంగతి తెలిసినదే. ఈ మహమ్మారి కారణంగా, గడచిన రెండేళ్లలలో అనేక కార్యక్రమాలు మరియు ప్రముఖ ఈవెంట్లన్నీ కూడా వాయిదాపడ్డాయి. అలాంటి వాటిలో జెనీవా మోటార్ షో కూడా ఒకటి.

కరోనా ఎఫెక్ట్: రెండేళ్ల విరామం తర్వాత జరగనున్న జెనీవా మోటార్ షో

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఆటో ప్రదర్శన కార్యక్రమాలలో జెనీవా మోటార్ షో ఒకటి. ఈ ఈవెంట్ ప్రతి ఏటా జెనీవాలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుండి అనేక ఆటోమొబైల్ కంపెనీలు విచ్చేసి తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతాయి.

కరోనా ఎఫెక్ట్: రెండేళ్ల విరామం తర్వాత జరగనున్న జెనీవా మోటార్ షో

అయితే, 2020 మరియు 2021లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్వాహకులు ఈ మోటార్ షోను పూర్తిగా నిలిపివేశారు. ఫలితంగా, మార్కెట్లోకి రావల్సిన ఎన్నో సరికొత్త ఉత్పత్తులు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభం కానున్న జెనీవా మోటార్ షో 2022 పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

కరోనా ఎఫెక్ట్: రెండేళ్ల విరామం తర్వాత జరగనున్న జెనీవా మోటార్ షో

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, పూర్తి మార్గదర్శకాలను పాటిస్తూ ఈ 2022 సీజన్‌ను నిర్వహించాలని జెనీవా మోటార్ షో నిర్వాహకులు భావిస్తున్నారు. తాజాగా, ఈ సీజన్‌కు సంబంధించిన జెనీవా మోటార్ షో 2022 తేదీలను కూడా సదరు షో నిర్వాహకులు వెల్లడించారు.

కరోనా ఎఫెక్ట్: రెండేళ్ల విరామం తర్వాత జరగనున్న జెనీవా మోటార్ షో

జెనీవా మోటార్ షో 2022వ ఎడిషన్ ఫిబ్రవరి 17, 2022వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 27, 2022వ తేదీన ముగుస్తుంది. ఈ తేదీలలో 17 మరియు 18 తేదీలను ప్రత్యేకించి మీడియా ప్రతినిధుల కోసం కేటాయించగా, 19 నుండి 27 వరకు ప్రజల సందర్శనార్థం కేటాయించారు.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

కరోనా ఎఫెక్ట్: రెండేళ్ల విరామం తర్వాత జరగనున్న జెనీవా మోటార్ షో

కాగా, వచ్చే ఏడాది జరగబోయే ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఎగ్జిబిటర్లు ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు అభ్యర్థించారు. వచ్చే ఏడాది జరగబోయేది 91వ ఎడిషన్ జెనీవా మోటార్ షో అవుతుంది.

కరోనా ఎఫెక్ట్: రెండేళ్ల విరామం తర్వాత జరగనున్న జెనీవా మోటార్ షో

ఈ మోటార్ షో నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, వచ్చే ఏడాది జరగబోయే ప్రదర్శన దాని మునుపటి ప్రదర్శనల కన్నా 'గణనీయంగా భిన్నంగా ఉంటుంద'ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జెనీవా మోటార్ షో 2022పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

కరోనా ఎఫెక్ట్: రెండేళ్ల విరామం తర్వాత జరగనున్న జెనీవా మోటార్ షో

జెనీవా మోటార్ షో 2022 ఈవెంట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను రాబోయే వారాల్లో వెల్లడి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఈవెంట్ ఖచ్చితంగా ఎగ్జిబిటర్లను మరియు అభిమానులను ఆశ్చర్యపరుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Most Read Articles

English summary
Geneva Motor Show 2022 Dates Announced. Show Organisers Says This New Edition Will Be 'Significantly Different' From Its Past Iterations. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X