ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలు మరియు ఇతర ఆటోమోటివ్ పరికరాల ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి. ఇందుకు కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులో లేక మరే ఇతర కారణాలో కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమలు ఎదుర్కుంటున్న సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు ప్రధాన కారణం.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆధునిక కార్లు చాలా క్లిష్టమైన ఎలక్ట్రానిక్ పరికరాలను కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయాలంటే వాటి కోసం అనేక రకాల సర్క్యూట్లు మరియు కొన్ని కీలకమైన ఎలక్ట్రానిక్ చిప్స్ అవసరం. అలాంటి ఎలక్ట్రానిక్ చిప్స్‌లో సెమీకండక్టర్స్ చాలా ప్రత్యేకమైనవి.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

కారులోని ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే, వాటిలో సెమీకండక్టర్స్‌ను ఉపయోగించడం ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలు ఆటోమోటివ్ పరిశ్రమ నుండి వస్తున్న ప్రపంచ డిమాండ్‌ని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వీటి తయారీ తగినంత మోతాదులో ఉండటం లేదు.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

తూర్పు దేశాలలో ఈ సెమీకండక్టర్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ప్రధాన కార్పోరేట్‌లు సెమీకండక్టర్ తయారీ పరిశ్రమను తూర్పు దేశాలకు తీసుకెళ్లడానికి గల ప్రధాన కారణం, అక్కడ చౌకైన కార్మికులు లభించడం మరియు తక్కువ ఆంక్షలు ఉండటం. ఆ దేశాల్లో వీటి తయారీకి అయ్యే ఖర్చు తక్కువగా మరియు అధిక లాభదాయకంగా ఉంటుంది.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

ప్రపంచ వ్యాప్తంగా ఆటోమోటివ్ పరిశ్రమను పీడిస్తున్న ప్రస్తుత 'చిప్ కొరత' సమస్య విషయానికి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థలైన Volkswagen, Toyota, Geely వంటి కంపెనీలు ఇప్పటికే ఈ సెమీకండక్టర్ చిప్స్ సరఫరా కొరత కారణంగా, తమ వాహనాల ఉత్పత్తిని తగ్గించడానికి కఠినమైన ప్రణాళికలను ప్రకటించాయి.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

యూరోపియన్ ఆటోమోటివ్ దిగ్గజం, Volkswagen సెమీకండక్టర్ సరఫరాలో కొరతను భర్తీ చేయడానికి, ఇప్పటికే రెండవ ఉత్పత్తి తగ్గింపును ప్రకటించింది. అయితే, జపనీస్ బ్రాండ్ Toyota మాత్రం ఇతర తయారీదారుల కంటే ఈ సెమీకండక్టర్ కొరతను బాగా నిర్వహించగలిగింది. గత 2011లో సంభవించిన భూకంపం మరియు ఫుకుషిమా అణు విపత్తు సమయంలో సరఫరా కొరత సంక్షోభాన్ని నిర్వహించడంలో టొయోటాకు ఉన్న అనుభవమే ఇందుకు కారణం.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

అప్పటి నుండి ఈ జపనీస్ బ్రాండ్ సంక్షోభ సమయాల్లో సరఫరా కొరతను నిర్వహించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి తగినంత పెద్ద నిల్వను ఉంచడం మొదలు పెట్టింది. అయినప్పటికీ, Toyota ప్రస్తుత సంక్షోభాన్ని నిర్వహించడానికి దాని మునుపటి ప్రణాళిక నుండి మొత్తం ఉత్పత్తిని 40 శాతం తగ్గించాలని నిర్ణయించింది.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

Toyota సంస్థ జపాన్ మరియు విదేశాలలో ఉన్న 14 ఫ్యాక్టరీలలో తమ వాహనాల ఉత్పత్తిని తగ్గించవలసి వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ తమ ప్రపంచ ఉత్పత్తి 3.6 లక్షల యూనిట్లకు పరిమితం చేసింది. ఈ ఉత్పత్తి తగ్గింపు ఫలితంగా Toyota షేర్ విలువ కూడా 4.4 శాతానికి తగ్గిపోయింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, Toyota మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి తన ఉత్పత్తి లక్ష్యాన్ని 9.3 మిలియన్ వాహనాలు మరియు రిటైల్ లక్ష్యాన్ని 8.7 మిలియన్ వాహనాలుగా సెట్ చేసింది.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్-19 వ్యాప్తి కారణంగా, అగ్రశ్రేణి చిప్‌మేకర్ అయిన Infineon మలేషియాలోని తమ ప్లాంట్‌ను మూసివేసినందున వీటి ఉత్పత్తి మరింత దెబ్బతింటుందని ఆటోమోటివ్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా Volkswagen, BMW, Renault, Daimler మరియు Stellantis వంటి యూరోపియన్ ఆటోమోటివ్ దిగ్గజాల షేర్ విలువలు ఇప్పటికే 2 శాతానికి పైగా పడిపోయాయి.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

మరో వైపు అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం Ford తమ లేటెస్ట్ F-150 పిక్-అప్ ట్రక్కు కోసం సెమీకండక్టర్ సంబంధిత భాగాల కొరత కారణంగా కాన్సాస్ సిటీ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసింది. దీంతో ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరగనుంది. ఇకపోతే, ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీకి పుట్టినిల్లు అయిన చైనాలోని ఆటోమొబైల్ కంపెనీలు ఈ సమస్య గురించి ఆందోళన చెందుతున్నాయి.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

ప్రముఖ చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ Geely కూడా ఈ సెమీకండర్ చిప్స్ కొరత గురించి చింతిస్తోంది. ఈ పరిస్థితుల్లో కూడా కంపెనీ తమ పూర్తి సంవత్సరం విక్రయ లక్ష్యాన్ని 1.53 మిలియన్ వాహనాలుగా సెట్ చేసింది. గడచిన ఆరు నెలల్లో ఈ కంపెనీ ఆదాయం 22 శాతం పెరిగి 6.94 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో దాని మొత్తం వాహన అమ్మకాలు 19 శాతం పెరిగి 6,30,237 యూనిట్లకు చేరుకున్నాయి.

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను గడగడలాడిస్తున్న చిన్న చిప్..

ఈ సెమీకండక్టర్ చిప్స్ కొరత మనదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. MG Motor, Mahindra, Maruti Suzuki వంటి కొన్ని సంస్థలు ఈ సమస్యను ఎదుర్కుంటున్నాయి. అయితే, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం Tata Group మాత్రం ఈ చిప్స్ విషయంలో తూర్పు దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రానిక్స్ రంగంలోకి ప్రవేశించింది. ఈ నిర్ణయం వలన ఎలక్ట్రానిక్ చిప్స్ కోసం ఇకపై విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించటమే కాకుండా మన దేశ జిడిపి ని కూడా ఇది మెరుగుపరుస్తుంది.

Most Read Articles

English summary
Global chip shortage car makers reducing their vehicle production
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X