గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అప్‌డేట్: స్మార్ట్‌ఫోన్‌తో కార్ లాక్/అన్‌లాక్ ఫీచర్!

గూగుల్ తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం సరికొత్త ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త అప్‌డేట్‌లో కొత్త యుఐ, పనితీరును మెరుగుపరచే అంశాలు మరియు కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ఫీచర్లలో ప్రధానమైనది డిజిటల్ కార్ కీ, ఇది మీ కారుని యాక్సెస్ చేయటానికి అనుమతిస్తుంది.

గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అప్‌డేట్: స్మార్ట్‌ఫోన్‌తో కార్ లాక్/అన్‌లాక్ ఫీచర్!

సింపుల్‌గా చెప్పాలంటే, మీ కారును మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా లాక్ చేయవచ్చు, అన్‌లాక్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు. అంటే, ఇకపై మీ కార్ కీ మీ ఫోనే అవుతుందన్నమాట. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, ఇకపై మీరు మీ కార్ కీలను జేబులో మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అప్‌డేట్: స్మార్ట్‌ఫోన్‌తో కార్ లాక్/అన్‌లాక్ ఫీచర్!

ఈ డిజిటల్ కీ కొత్త అల్ట్రా వైడ్ బ్యాండ్ (యుడబ్ల్యుబి) సాంకేతికతను ఉపయోగించుకొని, చిన్న రాడార్‌లా పనిచేస్తుంది. వాహనాన్ని యాక్సెస్ చేయడానికి మీరు మీ ఫోన్‌ను మీ జేబులో నుండి తీసివేయవలసిన అవసరం కూడా ఉండదు. కారు వద్దకు చేరుకోగానే ఆటోమేటిక్‌గా గుర్తించి కారు డోర్ అన్‌లాక్ అవుతుంది.

MOST READ:అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అప్‌డేట్: స్మార్ట్‌ఫోన్‌తో కార్ లాక్/అన్‌లాక్ ఫీచర్!

ఇది ఎన్ఎఫ్‌సి (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) అనుకూలమైన కార్లతో కూడా పని చేయగలదు. ఈ టెక్నాలజీతో మీ కారు డోరుపై ఫోన్‌ను సింపుల్‌గా ట్యాప్ చేయటం ద్వారా కారును లాక్, అన్‌లాక్ చేయటం చేయవచ్చు. అంతే కాకుండా, మీరు ఈ డిజిటల్ కీని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవచ్చు.

గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అప్‌డేట్: స్మార్ట్‌ఫోన్‌తో కార్ లాక్/అన్‌లాక్ ఫీచర్!

ఈ తరహా టెక్నాలజీని ప్రవేశపెట్టడం ఇదేం మొదటిసారి కాదు. జూన్ 2020లో, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ తమ ఐఓఎస్14 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా, ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అలాగే, లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ కలిగిన కార్లు మరియు ఇంటర్నెట్ సాంకేతికత కలిగి కార్లలో కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ల ద్వారా ఇలాంటి ఫీచర్లు లభిస్తున్నాయి.

MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అప్‌డేట్: స్మార్ట్‌ఫోన్‌తో కార్ లాక్/అన్‌లాక్ ఫీచర్!

అయితే, జీవనవిధానం ఎంత డిజిటలైజ్ అయినప్పటికీ మన జాగ్రత్తలో ఉండకపోతే ప్రమాదాలు తప్పవు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని కారు కీని వదిలి వెళ్లితే, ఆ తర్వాతి పరిణామాలు వేరేలా ఉండే అవకాశం ఉంది.

గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అప్‌డేట్: స్మార్ట్‌ఫోన్‌తో కార్ లాక్/అన్‌లాక్ ఫీచర్!

ఒకవేళ ఫ్యోన్ బ్యాటరీ ఖాళీ అయి, ఫోన్ స్విచాఫ్ అయితే, కారును అన్‌లాక్ చేయటం, స్టార్ట్ చేయటం సాధ్యం కాదు. కాబట్టి, ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా మీరు కారు కీని మీతో తీసుకెళ్లటం ఉత్తమం.

MOST READ:ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అప్‌డేట్: స్మార్ట్‌ఫోన్‌తో కార్ లాక్/అన్‌లాక్ ఫీచర్!

ఆండ్రాయిడ్ 12 యొక్క డిజిటల్ కార్ కీ కోసం, మీకు కావలసిందల్లా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మాత్రమే. ప్రస్తుతానికి, గూగుల్ ఈ డిజిటల్ కార్ కీని గూగుల్ పిక్సెల్ మరియు శామ్‌సంగ్ గెలాక్సీ వంటి ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల కోసం మాత్రమే విడుదల చేస్తోంది.

గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అప్‌డేట్: స్మార్ట్‌ఫోన్‌తో కార్ లాక్/అన్‌లాక్ ఫీచర్!

ఈ ఫీచర్‌ను మొదటగా బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించబడుతుంది. ఆ తర్వాత, సమీప భవిష్యత్తులో ఇతర కార్లలోనూ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

Most Read Articles

English summary
Google To Introduce New UI Feature With Android 12 OS; It Will Feature A Digital Car Key. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X