భారత్‌లో మరిన్ని నగరాల్లో అమ్ముడుకానున్న BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి!

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో (BYD Auto) గడచిన నవంబర్ నెలలో భారత మార్కెట్లో తమ మొట్టమొదటి 'ఇ6' (e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని సైలెంట్ గా విడుదల చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును కంపెనీ భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు బివైడి భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, ల్యాండ్‌మార్క్ గ్లోబల్ సంస్థతో BYD ఓ వ్యాపార భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

భారత్‌లో మరిన్ని నగరాల్లో అమ్ముడుకానున్న BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి!

దీంతో గ్రూప్ ల్యాండ్‌మార్క్ (Group Landmark) ఇప్పుడు భారతదేశంలో ఈవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కొత్త భాగస్వామ్యం నుంజి దేశవ్యాప్తంగా మరిన్ని కొత్త రిటైల్ అవుట్‌లెట్‌లు ఏర్పాటు కానున్నాయి. బివైడి బ్రాండ్ విషయానికి వస్తే, ఇది ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీదారు మరియు BYD India దాని అనుబంధ సంస్థ. ఇటీవల, BYD ఇండియా దేశంలో తమ E6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని రూ. 29.15 లక్షల ధరతో విడుదల చేసింది.

భారత్‌లో మరిన్ని నగరాల్లో అమ్ముడుకానున్న BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి!

బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివి చూడటానికి ఇంచు మించు టొయోటా ఇన్నోవా మాదిరిగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్ మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ సాయంతో BYD e6 గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అయితే, BYD E6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ప్రస్తుతం వాణిజ్య వినియోగదారులకు మాత్రమే, అదికూడా ఐదు సీట్ల కాన్ఫిగరేషన్ తో మాత్రమే అందుబాటులో ఉంది.

భారత్‌లో మరిన్ని నగరాల్లో అమ్ముడుకానున్న BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి!

అంటే, ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం ప్రైవేట్ కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే విక్రయించబడుతున్నమాట. వ్యక్తిగత వినియోగం కోసం ఇది అందుబాటులో లేదు. ఈ ఎలక్ట్రిక్ కారులో 71.6kWh 'బ్లేడ్' లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఈ బ్యాటరీ నుండి వచ్చే శక్తి ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. ఇది WLTP ప్రమాణాల ప్రకారం, పూర్తి చార్జ్ పై గరిష్టంగా 415 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో మరిన్ని నగరాల్లో అమ్ముడుకానున్న BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ BYD e6 ఎలక్ట్రిక్ కారులో 'నగరం మాత్రమే' (సిటీ ఓన్లీ) రేంజ్ సెలక్ట్ చేసుకుంటే, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 520 కిలోమీటర్లకు పైగా రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఈ కారులో అమర్చిన కోబాల్ట్-రహిత LiFePO4 బ్యాటరీ ప్యాక్ 'బ్లేడ్' చాలా సురక్షితమైనది మరియు ఇది ప్రమాదవశాత్తు పంక్చర్ అయినప్పటికీ కాలిపోవడం లేదా పేలిపోవడం జరగదని కంపెనీ తెలిపింది.

భారత్‌లో మరిన్ని నగరాల్లో అమ్ముడుకానున్న BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి!

బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు AC మరియు DC (స్టాండర్డ్ మరియు ఫాస్ట్) ఛార్జింగ్ లను సపోర్ట్ చేస్తుంది. ఈ కారును DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా చార్జ్ చేసినప్పుడు, ఈ కారులోని బ్యాటరీ ప్యాక్‌ ను కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే దీని ఫాస్ట్ చార్జర్ ద్వారా పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. కస్టమర్లు రూ. 45,000 అదనంగా చెల్లిస్తే, కంపెనీ ఈ కారుతో పాటుగా BYD 7kW అనే AC ఛార్జర్‌ ను కూడా అందిస్తుంది.

భారత్‌లో మరిన్ని నగరాల్లో అమ్ముడుకానున్న BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి!

ఈ ఎలక్ట్రిక్ కారు లోపల 10 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, లెథర్ సీట్ అప్‌హోలెస్ట్రీ, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్ మరియు ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ వంటి అనేక సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేక్‌లు (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో మరిన్ని నగరాల్లో అమ్ముడుకానున్న BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి!

బివైడి ఈ6 ఎలక్ట్రిక్ వాహనంపై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని అందిస్తోంది. అలాగే, ఇందులోని ట్రాక్షన్ మోటార్‌ పై 8 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్లు మరియు బ్యాటరీ సెల్ పై 8 సంవత్సరాలు లేదా 5 లక్షల కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు 570 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది మరియు దీని మొత్తం బరువు 1,930 కిలోలుగా ఉంటుంది.

భారత్‌లో మరిన్ని నగరాల్లో అమ్ముడుకానున్న BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి!

ఇక ల్యాండ్‌మార్క్ గ్రూప్ విషయానికి వస్తే, ప్రస్తుతం భారతదేశంలోని 32 ప్రధాన నగరాల్లో Mercedes-Benz, Honda, Jeep, Volkswagen మరియు Renault వంటి OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్) కోసం 113 అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. BYDతో తమ భాగస్వామ్యం గురించి, సంజయ్ థాక్కర్ మాట్లాడుతూ.. చైనా యొక్క ప్రముఖ ఈవీ మరియు హైబ్రిడ్ వాహన OEMలలో ఒకటైన BYDతో అనుబంధం కలిగి ఉన్నందుకు మరియు భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవంలో భాగమైనందుకు తాము సంతోషిస్తున్నామని, రాబోయే దశాబ్దంలో దేశం యొక్క చలనశీలత (మొబిలిటీ) పూర్తిగా మారిపోనుందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, December 31, 2021, 10:31 [IST]
English summary
Group landmark partners with ev maker byd india to expand e6 sales details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+