అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

భారతదేశంలో చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలో ప్రధానమైనది వాహదారులు రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేయడం. ఇది మరింత ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడటానికి కారణమవుతుంది. చాలా మంది వాహనదారులు యు-టర్న్ తీసుకోకుండా రాంగ్ సైడ్‌లో వాహనాలను నడపడం నిత్యజీవితంలో చాలా చూసి ఉంటారు.

అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్లడం ట్రాఫిక్ జామ్ లేదా కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తుంది. ఇటీవల రాంగ్ సైడ్‌లో ప్రయాణించే వాహనదారులపై గురుగ్రామ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారుడు రాంగ్‌సైడ్‌లో ప్రయాణిస్తున్నట్లైతే వారి డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుందని గురుగ్రామ్ పోలీసులు నిర్ణయించారు.

అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

రాంగ్ సైడ్ లో ప్రయాణించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ పోలీసు సిబ్బందికి నోటిఫికేషన్ జారీ చేశారు. అలాంటి వాహనదారులకు జరిమానాలు విధించాలని, వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.

MOST READ:ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి

అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

ఇది మళ్ళీ మళ్ళీ పునరావృతమైతే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయబడుతుంది. అప్పుడు వ్యక్తికి మళ్ళీ లైసెన్స్ ఇవ్వబడదు. గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, 2019 లో రాంగ్‌సైడ్‌లో డ్రైవింగ్ చేస్తున్న 49,671 మందికి జరిమానా విధించారు.

అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

2020 లో, రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేసినందుకు 39,765 మంది వాహనదారులకు జరిమానా విధించారు. వాహనదారుడు రాంగ్ సైడ్‌లో వెళ్లి ప్రమాదానికి కారణమైతే ఇండియన్ పీనల్ కోడ్ 304 (2) కింద వారిపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై సిసిటివి కెమెరాలతో వారిని పర్యవేక్షిస్తామని పోలీసులు తెలిపారు.

MOST READ:సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

తమ ప్రాణాలకు ప్రమాదం జరగకుండా మాత్రమే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండటానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

సెంట్రల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాలు మరణానికి లేదా అంగ వైకల్యానికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.

MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం

అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం, 2019 లో భారతదేశంలో మొత్తం 449,002 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 1,51,113 మంది మరణించారు మరియు 4,51,361 మంది గాయపడ్డారు. 2019 సెప్టెంబర్ నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి కొంచెం మెరుగుపడిందని కేంద్ర రవాణా శాఖ తెలిపింది.

అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

భారతీయ రహదారులను సురక్షితంగా చేయడానికి ఈ విభాగం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది మరియు వాటిని కఠినంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. రోడ్‌బ్లాక్ విషయంలో సంబంధిత ఏజెన్సీని శిక్షించడానికి ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

MOST READ:మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

దేశంలో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఒక్క ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం మాత్రమే కాకుండా సరైన రహదారులు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. రహదారి భద్రతపై పౌరులకు అవగాహన కల్పించడానికి కేంద్ర రవాణా శాఖ జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు ఒక నెల పాటు రోడ్ సేఫ్టీ మంత్ జరుపుకుంటోంది. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి వాహనదారులు కూడా తమవంతు కూడా సహకరించాలి.

Most Read Articles

English summary
Gurugram Police To Terminate Driving Licence For Wrong Side Driving. Read in Telugu.
Story first published: Friday, January 22, 2021, 18:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X