మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

భారతదేశపు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫేమ్ II పథకం కింద అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు (ఎలక్ట్రిక్ 2-వీలర్, 3-వీలర్ మరియు 4-వీలర్స్‌కు) సంబంధించి జారీ చేసిన ఫేమ్ II ధృవపత్రాల చెల్లుబాటును (సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ) మరో ఏడాది కాలం పాటు పొడగించినట్లు ప్రకటించింది.

మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

ఈ మేరకు భారత హెవీ ఇండస్ట్రీస్ విభాగం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, ఫేమ్-II ప్రూఫ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) యొక్క చెల్లుబాటును ఒక సంవత్సరం పాటు పొడిగించింది.

మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

ఇదివరకటి నోటిఫికేషన్ ప్రకారం, ఫేమ్ II పథకం క్రింద జారీ చేసిన సర్టిఫికెట్ల చెల్లుబాటు మార్చి 31, 2021తో ముగిసింది. కాగా, మార్చి 31, 2021 తర్వాత ఫేమ్ II సర్టిఫికేట్ జారీ చేసిన వాహన తయారీదారులకు ఈ సర్టిఫికెట్ చెల్లుబాటును మరో 12 నెలల వరకు పొడిగిస్తున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

ఎలక్ట్రిక్ వాహనాలు మరియు మౌలిక సదుపాయాల కోసం నడుస్తున్న ఫేమ్ II పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం తెలిసినదే. ఈ పథకం క్రింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. ఈ సబ్సిడీని రోడ్ టాక్స్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ నుండి మినహాయించారు.

మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

ఫేమ్ II పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే అనేక కంపెనీలు కేంద్ర ప్రభుత్వ జాబితాలో లిస్ట్ చేయబడ్డాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే సంస్థలైన ఏథర్ ఎనర్జీ, టాటా మోటార్స్, హీరో ఎలక్ట్రిక్, బజాజ్ ఆటో, టివిఎస్ మోటార్, రివాల్ట్ మోటార్స్, ఆంపియర్ మొబిలిటీ మొదలైన కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెంచడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడం మరియు టెక్నాలజీ సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఫేమ్ పథకం యొక్క మొదటి దశను ఏప్రిల్ 2015లో రెండేళ్ల కాలానికి అమలు చేశారు. ఆ తర్వాత మొదటి దశ ఫేమ్ వ్యవధిని చాలాసార్లు పొడిగించారు మరియు ఇది (ఫేమ్ 1 మొదటి దశ) మార్చి 31, 2019న పూర్తయింది.

మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

ఫేమ్ II పథకం యొక్క ప్రధాన లక్ష్యం దేశంలోని కొనుగోలుదారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేలా ప్రోత్సహించడం మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలపై పన్నును తగ్గించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం జీఎస్టీ విధించగా, ఇతర వాహనాలపై 28 శాతం వసూలు చేస్తున్నారు. ఫేమ్ II పథకం క్రింద ప్రధానంగా వాణిజ్య ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, ఫోర్-వీలర్ మరియు ప్రైవేట్ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్లను అందిస్తున్నారు.

మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

ఈ చొరవ ద్వారా 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, 55,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు మరియు 7,000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లను సులభతరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 2030 నాటికి దేశంలో పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించింది.

మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మనదేశంలో ఇప్పటికే, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఎమ్‌జి మోటార్ ఇండియా వంటి సంస్థలు సరసమైన ధరలకే ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నాయి. కాగా, ఇటీవలే మెర్సిడెస్ బెంజ్ మరియు జాగ్వార్ వంటి సంస్థలు ప్రీమియం విభాగంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాయి. ఈ కోవలోనే ఆడి, బిఎమ్‌డబ్ల్యూ మరియు టెస్లా వంటి సంస్థలు కూడా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నాయి.

Most Read Articles

English summary
Heavy Industry Ministry Extends Fame II Certificate Validity For One Year From The Date Of Issue. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X