Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) దేశీయ మార్కెట్లో ఆధునిక వాహనాలను విడుదల చేసి అత్యంత ప్రజాదరణ పొందుతూ చాలా కాలంగా నిరాఘాటంగా ముందుకు సాగుతోంది. కంపెనీ యొక్క దాదాపు అన్ని వాహనాలు మంచి అమ్మకాలను పొందుతున్నాయి. అయితే కంపెనీ 2050 సంవత్సరం నాటికి వాహన ప్రమాదాలను పూర్తిగా (0%) తగ్గించడానికి కృషి చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

కంపెనీ అందించిన తాజా నివేదికల ప్రకారం, వచ్చే 2050 నాటికి వాహన ప్రమాదాలను 0% తగ్గించడానికి సహాయపడే అధునాతన భద్రతా సాంకేతికతపై పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, కంపెనీ రెండు ప్రధాన సాంకేతికతలను ఉపయోగించబోతోంది. ఇందులో మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కాగా, రెండవది కార్ల నెట్‌వర్క్ ఆధారిత సాంకేతికత. ఈ రెండూ కూడా వాహన ప్రమాదాలను పూర్తిగా తగ్గించడంలో సహాయపడతాయి.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఇటీవల వస్తున్న కొత్త కార్లలో వస్తున్న లేటెస్ట్ ఫీచర్. ఈ ఫీచర్ డ్రైవింగ్ చేసేటప్పుడు సంభావ్య ప్రమాదాల గురించి కారు డ్రైవర్‌కు తెలియజేస్తుంది, అంతే కాకుండా రోడ్డుపైన డ్రైయర్ యొక్క అజాగ్రత్తను తగ్గించడంలో సహాయపడుతుందని హోండా తెలిపింది.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

సురక్షితమైన మరియు పటిష్టమైన నెట్‌వర్క్ టెక్నాలజీ రోడ్డుపైన వాహనాలు మరియు పాదచారులకు కార్-టు-కార్ కనెక్టివిటీని అనుమతిస్తుంది. టెలికమ్యూనికేషన్ ద్వారా, రహదారిపై సాధ్యమయ్యే ప్రమాదాలను అంచనా వేయడం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. కావున సులభంగా రోడ్డు ప్రమాదాలను నివారించ్చవచ్చు. తద్వారా 2050 నాటికి 0% ప్రమాదాల రేటుని పొందటం చాలా సులభం.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

ప్రజా రహదారులపైన ప్రమాదాలు పూర్తిగా తగ్గించడానికి 'హోండా సెన్సింగ్ 360'ని కూడా త్వరలో పరిచయం చేయనున్నట్టు హోండా తెలిపింది. ఇది 2030 నుండి హోండా కార్లలో ఉపయోగించే మల్టీపర్పస్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ మీడియా మద్దతుతో, ఈ సాంకేతికత హోండా కార్లను రోడ్డుపై సురక్షితంగా ఉండేట్లు చేస్తుంది. అంతే కాకూండా డ్రైవర్‌లు రోడ్డుపై సరైన మార్గంలో కారును నడపడానికి కూడా సహాయపడుతుంది.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

హోండా కంపెనీ కేవలం కార్లను మాత్రమే కాకుండా కంపెనీ యొక్క బైక్‌లు, స్కూటర్ల వంటి ద్విచక్ర వాహనాలను కూడా రక్షించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగించే అవకాశం ఉంటుంది. కావున హోండా కంపెనీ యొక్క కార్లు మరియు బైకులు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు. దీని ద్వారా ప్రమాదాల శాతం పూర్తిగా తగ్గుతుంది. డ్రైవింగ్‌లో తప్పులకు గల కారణాలను తెలుసుకోవడానికి మరియు రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు వ్యక్తుల మానసిక స్థితిని తెలుసుకోవడానికి కూడా సాంకేతికతను ఉపయోగిస్తామని హోండా పేర్కొంది.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

ప్రమాదాలను నివారించడంలో సేఫ్టీ టెక్నాలజీ మెరుగ్గా సహాయపడుతుందని కార్ల కంపెనీ తెలియజేసింది. తరువాతి తరం డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీ ప్రస్తుతం పరిశోధన మరియు అభివృద్ధిలో ఉందని కూడా హోండా నివేదించింది. ఇవన్నీ కూడా ప్రమాదాలను తప్పకుండా తగ్గిస్తాయి. తద్వారా కంపెనీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

కంపెనీ 2021 నవంబర్ నెల ప్రారంభంలో, ఇండోనేషియా మార్కెట్లో జెడ్ఆర్-వి కాంపాక్ట్ SUVని పరిచయం చేసింది. కంపెనీ ఈ SUVని దక్షిణాసియా మార్కెట్ల కోసం పరిచయం చేస్తుంది, ఇది ఈ మార్కెట్లలో హోండా WR-V SUV స్థానంలో ఉంటుంది. భారతదేశంలో, హోండా ZR-V మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లోని ఇతర సబ్‌కాంపాక్ట్ SUVలకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

హోండా కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా WR-V ని విక్రయిస్తోంది. ఇది మాత్రమే కాకుండా హోండా కంపెనీ హోండా సిటీ మరియు హోండా అమేజ్ వంటి మిడ్-సైజ్ మరియు సబ్ కాంపాక్ట్ సెడాన్‌లను కూడా విక్రయిస్తోంది. ఇవన్నీ కూడా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లు.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

కంపెనీ నుంచి రాబోయే హోండా ZR-V SUV కొత్త-తరం కాంపాక్ట్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రముఖ సెడాన్ హోండా సిటీకి కూడా ఉపయోగించబడుతుంది. ఆగ్నేయాసియా మరియు భారతదేశంలోని సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్ కోసం హోండా ZR-V ని ఉపయోగించాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది. కావున ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

ఇందులోని ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, హోండా జెడ్ఆర్-వి (Honda ZR-V) ఎస్‌యూవీలో 90 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేయగల 1. 2 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌ను ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇందులో మరింత శక్తివంతమైన 116 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ లేదా సుమారు 122 హార్స్ పవర్ శక్తిని విడుదల చేయగల 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండొచ్చని తెలుస్తోంది.

Honda కంపెనీ కొత్త టెక్నాలజీలు & కొత్త వ్యూహాలు: ఎందుకంటే?

ఇదిలా ఉండగా హోండా కంపెనీ ఇటీవల తన ZR-V యొక్క స్కెచ్ టీజర్‌ను కూడా విడుదల చేసింది, ఈ టీజర్ స్కెచ్ ద్వారా ఈ కొత్త కారు యొక్క డిజైన్ వంటి వివరాలు వెల్లడవుతాయి. అయితే ఇందులో మొత్తం డిజైన్ ఫీచర్స్ విల్లడి కాలేదు. ఏది ఏమైనా ఈ కొత్త SUV మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత కంపెనీ యొక్క అమ్మకాలను తప్పకుండా పెంచే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Monday, November 29, 2021, 12:53 [IST]
English summary
Honda aims zero accidental deaths by 2050 details
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+