త్వరపడండి.. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 5,000 మాత్రమే

ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా ఇప్పుడు తన కొత్త అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్ ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ కొత్త కాంపాక్ట్ సెడాన్‌ను కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌షిప్‌లలో వరుసగా రూ. 5,000 మరియు రూ .21,000 టోకెన్ మొత్తానికి బుక్ చేసుకోవచ్చు.

త్వరపడండి హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 5,000 మాత్రమే

హోండా కంపెనీ తన హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ యొక్క టీజర్ కూడా విడుదల చేసింది. ఇందులో ఈ కారులో చేసిన మార్పులను చూడవచ్చు. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్‌లో అనేక కొత్త ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ కారును ఆగస్టు 18 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయబోతోంది.

త్వరపడండి హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 5,000 మాత్రమే

కొత్త హోండా సెడాన్ ప్రస్తుతం భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతుంది. కావున మనదేశం నుంచి ఇతర దేశాలను ఎగుమతి చేయబడుతుంది. ఈ కొత్త సెడాన్ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

త్వరపడండి హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 5,000 మాత్రమే

కొత్త హోండా అమేజ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు కొత్త కలర్ ఆప్షన్‌లను పొందుతుంది. క్రోమ్ దాని బాహ్య భాగంలో చాలా చోట్ల ఉపయోగించబడింది, ఇది కారుకు మరింత ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. మొత్తానికి ఎక్స్టీరియర్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది.

త్వరపడండి హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 5,000 మాత్రమే

కొత్త హోండా అమేజ్ ఇంటీరియర్‌లో కూడా అనేక మార్పులు జరిగాయి. ఇందులో కొత్త అపోల్స్ట్రే, కొత్త డాష్‌బోర్డ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు సన్‌రూఫ్‌ ఉన్నాయి. అంతే కాకూండా ఇందులో హోండా అలెక్సా వాయిస్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది.

త్వరపడండి హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 5,000 మాత్రమే

అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కంపెనీ ప్రస్తుత వెర్షన్ లోని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను ఉపయోగించనుంది. అమేజ్ ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ ఐ-డీటెక్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించబడుతుంది.

త్వరపడండి హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 5,000 మాత్రమే

ఇందులోని పెట్రోల్ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్ మరియు 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజిన్ 99 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. సివిటి గేర్‌బాక్స్‌లో, ఈ ఇంజన్ 79 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తానికి ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుందని చెప్పవచ్చు.

హోండా అమేజ్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 6.3 నుంచి రూ. 11 లక్షల మధ్య ఉంది. అయితే కొత్త అవతార్‌తో మార్కెట్లోకి రానున్న ఈ అమేజ్ ధర కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త హోండా అమేజ్ భారత మార్కెట్లో మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా మరియు టాటా టిగోర్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

త్వరపడండి హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 5,000 మాత్రమే

హోండా అమేజ్ భారతీయ మార్కెట్లో ప్రముఖ సెడాన్ మరియు డీజిల్ ఇంజిన్‌కు ప్రసిద్ధి చెందింది. హోండా అమేజ్ ఇప్పుడు కొత్త అవతార్‌లో తీసుకురాబడుతోంది. దీని ధర కూడా మనం ఇంతకు ముందు చెప్పకున్నట్లు కొంత ఎక్కువగా ఉంటుంది. కావున భారతీయ మార్కెట్లో దీనికి ఎటువంటి స్పందన వస్తుందో తెలుసుకోవడానికి వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 4, 2021, 17:08 [IST]
English summary
Honda amaze facelift bookings start rs 5000 details
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+