అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త Honda Amaze: వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా (Honda) కంపెనీ యొక్క 'హోండా అమేజ్ సెకండ్ జనరేషన్' ఇప్పటికి దాదాపుగా 2 లక్షల యూనిట్ల డెలివరీలను పూర్తి చేసింది. దేశీయ మార్కెట్లో ఈ సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ 2018 లో ప్రారంభించబడింది. ప్రారభించినప్పటినుంచి కూడా ఇది మంచి మమకాల్తో ముందుకు సాగింది. మొత్తానికి ఇప్పటికి ఏకంగా 2 లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

హోండా అమేజ్ మొదటిసారిగా 2013 లో దేశంలో ప్రారంభించబడినప్పటినుంచి మొత్తం 4.6 లక్షల మంది వినియోగదారులను సంపాదించుకుంది. అయితే కొత్త సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్న కారణంగా ఇది మరింత వేగవంతమైన అమ్మకాలను పొందగలిగింది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

కొత్త హోండా అమేజ్ తయారీలో కంపెనీ దాదాపు 95% స్థానికీకరణ విధానాన్ని అనుసరించింది. హోండా అమేజ్ అమ్మకాలలో గణనీయమైన భాగం CVT గేర్‌బాక్స్‌తో కూడిన మోడల్‌ల విక్రయాల నుండి వచ్చింది. అమేజ్ మొత్తం విక్రయాల్లో CVT గేర్‌బాక్స్ మోడల్ వాటా దాదాపు 20 శాతం ఉంది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

హోండా అమేజ్ 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ మరియు 1.5-లీటర్ i-DTEC ఇంజన్‌లతో అందుబాటులోకి వచ్చింది. భారతదేశపు కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా మరియు టాటా టిగోర్‌ అంటి వాటికి ఇది ప్రత్యర్థిగా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ ఇంజన్‌లో హోండా అమేజ్ ధర రూ. 6.32 లక్షల (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది, కానీ VX CVT డీజిల్ టాప్ మోడల్ ధర రూ. 11.15 లక్షల (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) వరకు ఉంటుంది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

హోండా కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టడమే కాకుండా, సరఫరా వంటి వాటివైపు కూడా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు భారతదేశంలో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారంభించింది. ఇది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ మరియు బ్యాటరీ మార్పిడి వంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది హోండా ప్రారంభించిన బ్యాటరీ షేరింగ్ సర్వీస్. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 వ సంవత్సరం మొదటి అర్ధభాగం నుంచి భారతీయ మార్కెట్లోని ఆటో-రిక్షాల కోసం బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందించనుంది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

కంపెనీ మొదటి ఈ సర్వీస్ బెంగళూరులో అందుబాటులోకి రానుంది, ఆ తరువాత కాలంలో భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలలో కూడా అందుబాటులోకి రానుంది. రాయితీ ఈ సర్వీస్ దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. దీని కోసం, హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఈ-బ్యాటరీని కూడా భారతదేశంలో స్థానికంగా తయారు చేస్తుంది. తమ సర్వీస్ సబ్‌స్క్రైబర్‌లు బ్యాటరీని మార్చుకోవడానికి సమీపంలోని బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్ నుండి సర్వీస్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

కంపెనీ ప్రారంభించిన ఈ సర్వీస్ వల్ల ఆటో-రిక్షా డ్రైవర్లు ఇప్పుడు ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. కావున వారి సమయాన్ని అదా చేయడమే కాకుండా, తమ వ్యాపారాలను కూడా వృద్ధి చేస్తుంది. మొత్తానికి ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించిన తర్వాత కొత్త అనుబంధ సంస్థలతో కూడా కంపెనీ భాగస్వామి అవుతుంది. కాగా, వచ్చే ఐదేళ్లలో కనీస పది కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని హోండా యోచిస్తోంది. కంపెనీ 2040 తర్వాత పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుని ఈ దిశగా అడుగులు వేస్తోంది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ఈ కారణంగానే కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి తమ ఉనికిని మరింత విస్తరించాలని యోచిస్తోంది. మొత్తానికి కంపెనీ రానున్న కాలంలో హోండా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది, అని భావిస్తున్నాము.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

ఇదిలా ఉండగా హోండా కంపెనీ 2050 సంవత్సరం నాటికి వాహన ప్రమాదాలను పూర్తిగా (0%) తగ్గించడానికి కృషి చేస్తోంది. కంపెనీ అందించిన తాజా నివేదికల ప్రకారం, వచ్చే 2050 నాటికి వాహన ప్రమాదాలను 0% తగ్గించడానికి సహాయపడే అధునాతన భద్రతా సాంకేతికతపై పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, కంపెనీ రెండు ప్రధాన సాంకేతికతలను ఉపయోగించబోతోంది. ఇందులో మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కాగా, రెండవది కార్ల నెట్‌వర్క్ ఆధారిత సాంకేతికత. ఈ రెండూ కూడా వాహన ప్రమాదాలను పూర్తిగా తగ్గించడంలో సహాయపడతాయి.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న కొత్త హోండా అమేజ్: వివరాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఇటీవల వస్తున్న కొత్త కార్లలో వస్తున్న లేటెస్ట్ ఫీచర్. ఈ ఫీచర్ డ్రైవింగ్ చేసేటప్పుడు సంభావ్య ప్రమాదాల గురించి కారు డ్రైవర్‌కు తెలియజేస్తుంది, అంతే కాకుండా రోడ్డుపైన డ్రైయర్ యొక్క అజాగ్రత్తను తగ్గించడంలో సహాయపడుతుందని హోండా తెలిపింది.

సురక్షితమైన మరియు పటిష్టమైన నెట్‌వర్క్ టెక్నాలజీ రోడ్డుపైన వాహనాలు మరియు పాదచారులకు కార్-టు-కార్ కనెక్టివిటీని అనుమతిస్తుంది. టెలికమ్యూనికేషన్ ద్వారా, రహదారిపై సాధ్యమయ్యే ప్రమాదాలను అంచనా వేయడం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. కావున సులభంగా రోడ్డు ప్రమాదాలను నివారించ్చవచ్చు. తద్వారా 2050 నాటికి 0% ప్రమాదాల రేటుని పొందటం చాలా సులభం.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda amaze second generation achieves 2 lakh sales milestone
Story first published: Friday, December 17, 2021, 18:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X