Honda కార్లపై అద్భుతమైన ఆఫర్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో ఇప్పుడే చూడండి
Honda (హోండా) కంపెనీ 2021 ఆగష్టు నెలలో తన బ్రాండ్ వాహనాలపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులకు దాదాపు రూ. 57,000 వరకు ఆదా చేయవచ్చు. కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన మోడల్స్ పై (హోండా సిటీ, అమేజ్, డబ్ల్యూఆర్-వి మరియు జాజ్) ఈ ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Honda Amaze (హోండా అమేజ్):
హోండా అందిస్తున్న ఆఫర్లు ఇప్పుడు Honda Amaze కొనుగోలుపై కూడా వర్తిస్తుంది. నివేదికల ప్రకారం, ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ సెడాన్ Amaze యొక్క పాత BS6 మోడల్‌పై రూ. 57,044 వరకు అఫర్ అందుబాటులో ఉంది. ఇందులో రూ. 5,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్, రూ .9,000 కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.

కేవలం పాత Amaze పై మాత్రమే కాకుండా కంపెనీ Honda Amaze పై కూడా ఆఫర్లను అందిస్తోంది. కొత్త Honda Amaze కొనుగోలుపై ఇప్పుడు దాదాపు రూ. 18,000 వరకు ఆదా చేయవచ్చు. ఇందులో కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5,000, కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 9,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000 ఉన్నాయి.

కొత్త Honda Amaze దేశీయ మార్కెట్లో 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో అందుబాటులో ఉంటుంది. Honda Amaze ధర రూ. 6.32 లక్షల నుంచి రూ. 9.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Honda City (హోండా సిటీ):
Honda కంపెనీ ఇప్పుడు Honda City నాల్గవ జనరేషన్ మరియు ఐదవ జనరేషన్ మోడళ్లపై డిస్కౌంట్‌లు అందిస్తుంది. Honda City ఐదవ జనరేషన్ పై రూ. 37,708 మరియు నాల్గవ జనరేషన్ మోడల్ పై రూ. 22,000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఐదవ జనరేషన్ మోడల్ యొక్క డిస్కౌంట్స్ లో రూ .10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 5,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 5,000 కస్టమర్ లాయల్టీ బోనస్, రూ .9,000 కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 8,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.

Honda City యొక్క 4 వ జనరేషన్ మోడల్‌లో 22,000 పొందవచ్చు. ఇందులో రూ .5,000 లాయల్టీ బోనస్, కారు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ .9,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ .8,000 వంటివి అందుబాటులో ఉంటాయి.
హోండా సిటీ 4 వ జనరేషన్ ధర రూ. 9.30 లక్షలు కాగా, 5 వ జనరేషన్ మోడల్ ధర రూ .11.16 లక్షలు(ఎక్స్-షోరూమ్). హోండా సిటీ 4 వ జనరేషన్ మోడల్స్ పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రమే మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది, కానీ ఐదవ తరం మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

Honda WR-V (హోండా డబ్ల్యుఆర్-వి):
కంపెనీ అందిస్తున్న ఆఫర్లలో Honda WR-V కొనుగోలుపై రూ .39,998 వరకు ఆదా చేయవచ్చు. ఈ కారుపై కంపెనీ రూ .10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ .5,000 లాయల్టీ బోనస్, రూ .9,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ కస్టమర్ల కోసం రూ .4,000 తగ్గింపు ఉంటుంది.

Honda WR-V దహర దేశీయ మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ .8.76 లక్షల నుండి రూ .9.89 లక్షల వరకు ఉంటుంది. Honda WR-V మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రెండు పెట్రోల్ ఇంజిన్లలో లభిస్తుంది. ఇద్హి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Honda Jazz (హోండా జాజ్):
Honda Jazz కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు ఏకంగా రూ. 39,947 డిస్కౌంట్ అందిస్తుంది. ఇప్పుడు కంపెనీ ఈ కారుపై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, కస్టమర్ లాయల్టీ బోనస్ రూ .5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ .9,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ .4,000 వరకు అందిస్తోంది.

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న Honda Jazz (హోండా జాజ్) పెట్రోల్ ఇంజిన్‌లో 6 వేరియంట్లలో లభిస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ (CVT) గేర్‌బాక్స్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. Honda Jazz (హోండా జాజ్) ధర రూ .7.65 లక్షల నుండి రూ. 9.89 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

దేశీయ మార్కెట్లో కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఈ ఆఫర్లను పొందవచ్చు. ఇది కొనుగోలుదారులకు ఎక్కువ డబ్బు అదా చేస్తుంది.


Click it and Unblock the Notifications








