హోండా అభిమానులకు షాక్.. భారీగా పెరిగిన కార్ల ధరలు.. కొత్త ధరల జాబితా!

మారుతి సుజుకి, టాటా మోటార్స్ బాటలోనే ఇప్పుడు జపనీస్ కార్ బ్రాండ్ హోండా కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్లోని తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి కార్ల ధరలను రూ.1.2 లక్షల వరకు పెంచింది. కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

హోండా అభిమానులకు షాక్.. భారీగా పెరిగిన కార్ల ధరలు.. కొత్త ధరల జాబితా!

హోండా అమేజ్

హోండా అందిస్తున్న బెస్ట్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారు యొక్క రెండు వేరియంట్లు స్పెషల్ ఎడిషన్ మరియు ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ అమ్మకాలను నిలిపివేసింది. హోండా అమేజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో పెట్రోల్ వేరియంట్ల ధరలను కంపెనీ రూ.10,000 వరకూ పెంచింది.

హోండా అభిమానులకు షాక్.. భారీగా పెరిగిన కార్ల ధరలు.. కొత్త ధరల జాబితా!

తాజా ధరల పెంపుతో హోండా అమేజ్ పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.6.32 లక్షల నుండి రూ.9.01 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్)లో అమ్ముడవుతున్నాయి. కాగా, డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే, కంపెనీ వీటి ధరలను సుమారు రూ.78,000 నుండి రూ.1.2 లక్షల మధ్యలో పెంచింది. తాజా పెంపు తర్వాత అమేజ్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ.8.67 లక్షల నుండి రూ.11.11 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్)లో అమ్ముడవుతున్నాయి.

Amaze Petrol

Old Price New Price Difference
E MT ₹6.22 Lakh ₹6.32 Lakh +₹10,000
S MT ₹7.00 Lakh ₹7.10 Lakh +₹10,000
S MT Special Edition ₹7.12 Lakh Discontinued -
V MT ₹7.60 Lakh ₹7.70 Lakh +₹10,000
S CVT ₹7.90 Lakh ₹8.00 Lakh +₹10,000
S CVT Special Edition ₹8.02 Lakh Discontinued -
VX MT ₹8.08 Lakh ₹8.18Lakh +₹10,000
VX MT Exclusive Edition ₹8.01 Lakh Discontinued -
V CVT ₹8.50 Lakh ₹8.60 Lakh +₹10,000
VX CVT ₹8.91 Lakh ₹9.01 Lakh +₹10,000
VX CVT Exclusive Edition ₹8.84 Lakh Discontinued No Change
Amaze Diesel

Old Price New Price Difference
E MT ₹7.68 Lakh ₹8.67 Lakh +₹ 99,000
S MT ₹8.35 Lakh ₹9.20 Lakh +₹85,000
S MT Special Edition ₹8.47 Lakh Discontinued -
V MT ₹8.95 Lakh ₹9.80 Lakh +₹85,000
S CVT ₹9.15 Lakh ₹10.00 Lakh +₹85,000
S CVT Special Edition ₹9.27 Lakh Discontinued -
VX MT ₹9.43 Lakh ₹10.21 Lakh +₹78,000
VX MT Exclusive Edition ₹9.31 Lakh Discontinued -
V CVT ₹9.75 Lakh ₹10.60 Lakh +₹85,000
VX CVT ₹9.99 Lakh ₹11.11 Lakh +₹1.12 lakh
VX CVT Exclusive Edition ₹9.99 Lakh Discontinued -
హోండా అభిమానులకు షాక్.. భారీగా పెరిగిన కార్ల ధరలు.. కొత్త ధరల జాబితా!

ఐదవ తరం హోండా సిటీ

కొత్త తరం హోండా సిటీ మిడ్-సైజ్ సెడాన్ విషయానికి వస్తే, ఈ కారు కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో అన్ని వేరియంట్ల ధరలు రూ.17,000 మేర పెరిగాయి. ప్రస్తుతం హోండా సిటీ పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.11.16 లక్షల నుండి రూ.14.91 లక్షల మధ్యలో అమ్ముడవుతున్నాయి. కాగా డీజిల్ వేరియంట్ల ధరలు రూ.12.76 లక్షల నుండి రూ.15.11 లక్షల మధ్యలో ఉన్నాయి.

City Petrol

Old Price New Price Difference
V MT ₹10.99 Lakh ₹11.16 Lakh No Change
V CVT ₹12.39 Lakh ₹12.56 Lakh +₹17,000
VX MT ₹12.45 Lakh ₹12.62 Lakh +₹17,000
VX CVT ₹13.75 Lakh ₹13.92 Lakh +₹17,000
ZX MT ₹13.44 Lakh ₹13.61 Lakh +₹17,000
ZX CVT ₹14.74 Lakh ₹14.91 Lakh +₹17,000
City Diesel

Old Price New Price Difference
V MT ₹12.59 Lakh ₹12.76 Lakh +₹17,000
VX MT ₹13.95 Lakh ₹14.12 Lakh +₹17,000
ZX MT ₹14.94 Lakh ₹15.11 Lakh +₹17,000
హోండా అభిమానులకు షాక్.. భారీగా పెరిగిన కార్ల ధరలు.. కొత్త ధరల జాబితా!

హోండా జాజ్

హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్, ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తోంది. ఇందులో కంపెనీ దానిబేస్ మరియు టాప్-స్పెక్ వేరియంట్‌లను రూ.10,000 వరకూ పెంచింది. కాగా, మిగిలిన అన్ని వేరియంట్ల ధరలను రూ.11,000 మేర పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత హోండా జాజ్ ధరలు రూ.7.65 లక్షల నుండి రూ.9.89 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Jazz Petrol

Old Price New Price Difference
V MT ₹7.55 Lakh ₹7.65 Lakh +₹10,000
V CVT ₹8.64 Lakh ₹8.75 Lakh +₹11,000
VX MT ₹8.24 Lakh ₹8.35 Lakh +₹11,000
VX CVT ₹9.24 Lakh ₹9.35 Lakh +₹11,000
ZX MT ₹8.88 Lakh ₹8.99 Lakh +₹11,000
ZX CVT ₹9.79 Lakh ₹9.89 Lakh +₹10,000
హోండా అభిమానులకు షాక్.. భారీగా పెరిగిన కార్ల ధరలు.. కొత్త ధరల జాబితా!

హోండా డబ్ల్యూఆర్-వి

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అందస్తున్న డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీలో కంపెనీ దాని స్పెషల్ ఎడిషన్ మోడల్ అమ్మకాలను నిలిపివేసింది. కాగా, ఇందులో పెట్రోల్ వేరియంట్ల ధరలను రూ.14,000 మేర పెంచగా, డీజిల్ వేరియంట్ల ధరలను రూ.75,000 నుండి రూ.92,000 మధ్యలో పెంచారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.8.76 లక్షల నుండి రూ.11.80 లక్షల మధ్యలో ఉన్నాయి. నాల్గవ తరం హోండా సిటీ సెడాన్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇది రూ.9.29 లక్షల నుండి రూ.9.99 లక్షల మధ్యలో అమ్ముడవుతోంది.

WR-V Petrol

Old Price New Price Difference
SV MT ₹8.62 Lakh ₹8.76 Lakh +₹14,000
VX MT ₹9.75 Lakh ₹9.89 Lakh +₹14,000
VX MT Exclusive Edition ₹9.75 Lakh Discontinued -
WR-V Diesel

Old Price New Price Difference
SV MT ₹9.85 lakh ₹10.77 Lakh +₹92,000
VX MT ₹11.05 Lakh ₹11.80 Lakh +₹75,000
VX MT Exclusive Edition ₹11.05 Lakh Discontinued -
Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda cars cost more from this august price hike details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X