పండుగ సీజన్లో కార్లపై భారీ ఆఫర్స్ ప్రకటించిన Honda: వేరియంట్ వారీగా డిస్కౌంట్స్ డీటైల్స్

భారతదేశంలో రేపటి నుంచి పండుగ (దసరా మరియు దీపావళి) సీజన్ ప్రారంభం కానుంది. ఈ పండుగ సీజన్ వేళలో ఎంతోమంది కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున ఈ సీజన్లో కంపెనీలు ఎక్కువ అమ్మకాలను చేపట్టడానికి మరియు కొత్త కస్టమర్లకు ఆకర్శించడానికి అనేక ఆఫర్లను మరియు డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

పండుగ సీజన్లో కార్లపై భారీ ఆఫర్స్ ప్రకటించిన Honda: వేరియంట్ వారీగా డిస్కౌంట్స్ డీటైల్స్

ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీదారు Honda Cars India 2021 అక్టోబర్ నెలలో తన బ్రాండ్ వానలపైన భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ ఆర్టికల్ లో జపనీస్ కార్ల తయారీ సంస్థ Honda Cars India ఏ వాహనంపై ఎంత డిస్కౌంట్ అందిస్తుంది అనే విషయాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం.

పండుగ సీజన్లో కార్లపై భారీ ఆఫర్స్ ప్రకటించిన Honda: వేరియంట్ వారీగా డిస్కౌంట్స్ డీటైల్స్

New Honda Amaze (న్యూ హోండా అమేజ్):

Honda కంపెనీ యొక్క Amaze దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. కంపెనీ ఇటీవల ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ Honda Amaze కారుపై రూ. 18,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది.

ఇందులో రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 9,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త Honda Amaze కొనుగోలు చేయదలచిన వారు ఈ అద్భుతమైన ఆఫర్ పొందవచ్చు.

పండుగ సీజన్లో కార్లపై భారీ ఆఫర్స్ ప్రకటించిన Honda: వేరియంట్ వారీగా డిస్కౌంట్స్ డీటైల్స్
Model Offers
5th జనరేషన్ హోండా సిటీ Upto ₹53,500
4th జనరేషన్ హోండా సిటీ Upto ₹22,000
న్యూ హోండా అమేజ్ Upto ₹18,000
న్యూ హోండా డబ్ల్యు-వి Upto ₹40,100
న్యూ హోండా జాజ్ Upto ₹45,900
పండుగ సీజన్లో కార్లపై భారీ ఆఫర్స్ ప్రకటించిన Honda: వేరియంట్ వారీగా డిస్కౌంట్స్ డీటైల్స్

New Honda WR-V (న్యూ హోండా డబ్ల్యు-వి):

కంపెనీ ఈ పండుగ సీజన్‌లో దాని మిడ్-సైడ్ ఎస్‌యూవీ అయిన New Honda WR-V (హోండా డబ్ల్యుఆర్-వి) పై మొత్తం రూ. 40,158 వరకు బెన్ఫీట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ .12,158 వరకు FOC యాక్సెసరీస్ ఉన్నాయి. అంతే కాకుండా కార్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ. 10,000, లాయల్టీ బోనస్ రూ. 5,000, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 9,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000 వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా పండుగ సీజన్లో హోండా డబ్ల్యుఆర్-వి కొనుగోలుపై పొందవచ్చు.

పండుగ సీజన్లో కార్లపై భారీ ఆఫర్స్ ప్రకటించిన Honda: వేరియంట్ వారీగా డిస్కౌంట్స్ డీటైల్స్

5th-Generation Honda City (5 వ తరం హోండా సిటీ):

హోండా కార్స్ ఇండియా 5th-Generation Honda City మిడ్-సైజ్ లగ్జరీ సెడాన్ మీద గరిష్టంగా రూ .53,505 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 9,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 8,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటాయి.

పండుగ సీజన్లో కార్లపై భారీ ఆఫర్స్ ప్రకటించిన Honda: వేరియంట్ వారీగా డిస్కౌంట్స్ డీటైల్స్

4th-Generation Honda City (4 వ తరం హోండా సిటీ):

హోండా కార్స్ ఇండియా ఇప్పుడు తన 4th-Generation Honda City పై రూ. 22,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇందులో లాయల్టీ బోనస్ రూ .5,000, కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ .9,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ .8,000 వరకు ఉన్నాయి. కావున కొనుగోలుదారులు ఈ డిస్కౌంట్స్ పొందవచ్చు.

పండుగ సీజన్లో కార్లపై భారీ ఆఫర్స్ ప్రకటించిన Honda: వేరియంట్ వారీగా డిస్కౌంట్స్ డీటైల్స్

New Honda Jazz (న్యూ హోండా జాజ్):

హోండా కార్స్ ఇండియా కూడా ఈ పండుగ సీజన్‌లో న్యూ హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మీద ఆఫర్లను అందిస్తోంది. ఇప్పుడు కొత్త హోండా జాజ్ పై కంపెనీ దాదాపు రూ. 45,996 వరకు డిస్కౌంట్స్ మరియు ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో కంపెనీ రూ. 15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 17,996 వరకు FOC యాక్ససరీస్ ఉంటాయి. అంతే కాకుండా ఇందులో రూ .10,000 కార్ ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, కస్టమర్ లాయల్టీ బోనస్ రూ .5,000, కార్ ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ .9,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ .4,000 వరకు ఉన్నాయి.

పండుగ సీజన్లో కార్లపై భారీ ఆఫర్స్ ప్రకటించిన Honda: వేరియంట్ వారీగా డిస్కౌంట్స్ డీటైల్స్

రానున్న దుర్గాష్టమి మరియు దీపావళి సంర్భంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికీ హోండా అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. కావున కొనుగోలుదారులు హోండా కంపెనీ యొక్క కార్లను కొనుగోలు చేసి ఈ ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ పొందవచ్చు.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda cars india october 2021 offers up to rs 53000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X