హోండా కార్లపై అదిరిపోయే ఆఫర్స్.. దేనిపై ఎంతో ఇప్పుడే చూడండి
ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్, ఇటీవల 2021 మార్చి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం హోండా కార్స్ ఇండియా గత నెలలో 7,103 యూనిట్ల కార్లను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మార్చి 2021 లో కంపెనీ 39 శాతం వృద్ధి సాధించింది.

ప్రస్తుతం కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచడానికి, 2021 ఏప్రిల్ నెలలో భారీగా క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ఇతర ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవచ్చు.

ప్రస్తుతం హోండా కార్స్ యొక్క కాంపాక్ట్ సెడాన్ అయిన హోండా అమేజ్ యొక్క ఎస్ఎంటి పెట్రోల్ వేరియంట్ మినహా మిగతా అన్ని వేరియంట్లపై రూ. 17,000 నగదు తగ్గింపు లేదా రూ. 17,105 యాక్సెసరీస్ ప్యాక్‌ను అందిస్తోంది. అంతే కాకుండా, ఇదే సమయంలో, హోండా అమేజ్ యొక్క ఎస్ఎంటి పెట్రోల్ వేరియంట్ పై కంపెనీ రూ. 20,000 వరకు నగదు తగ్గింపు లేదా రూ .23,851 వరకు యాక్సెసరీస్ ప్యాక్ అందిస్తోంది. ఇది కాకుండా, హోండా అమేజ్ యొక్క అన్ని వేరియంట్లపై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా కస్టమర్లు పొందవచ్చు.

ఇప్పుడు హోండా కంపెనీ యొక్క ఫిఫ్త్ జనరేషన్ మిడ్-సైజ్ సెడాన్ అయిన హోండా సిటీ విషయానికి వస్తే, హోండా కార్స్ ఇండియా ఈ కారుపై కేవలం 10,000 రూపాయల కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. అదే విధంగా హోండా డబ్ల్యూఆర్-వి విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీపై కంపెనీ మొత్తం రూ . 32,500 బెనిఫీట్స్ అందిస్తుంది.

ఈ కారుపై రూ .15,000 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 17,527 వరకు యాక్సెసరీస్ ప్యాక్ అందిస్తోంది. ఇవే కాకుండా, హోండా కార్స్ ఇండియా కూడా డబ్ల్యుఆర్-విపై రూ. 15,000 వరకు కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్లు అన్ని పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లపై కూడా లభిస్తాయి.

హోండా కార్స్ యొక్క కొత్త తరం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్ కారుపై కంపెనీ రూ. 32,200 వరకు ఆఫర్స్ అందిస్తోంది. హోండా తన అన్ని వేరియంట్లపై రూ. 15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 17,248 వరకు యాక్సెసరీస్ ప్యాక్ అందిస్తోంది. ఇది కాకుండా రూ .15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు.

వీటితో పాటు హోండా కార్స్ తన వినియోగదారులకు ఇప్పుడు రూ. 5000 వరకు లాయల్టీ బోనస్ మరియు రూ. 9,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. హోండా కార్స్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్చి 2021 లో కంపెనీ 7,103 యూనిట్ల కార్లను విక్రయించింది.

గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 3,697 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది మార్చిలో కరోనా లాక్ డౌన్ కారణంగా అమ్మకాలు ప్రభావితమయ్యాయని కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. హోండా కార్స్ ఇండియా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 82,074 యూనిట్ల కార్లను విక్రయించగా, 5,131 యూనిట్ల కార్లను ఎగుమతి చేసింది. ఏది ఏమైనా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ల వల్ల అమ్మకాలు ఏవిధంగా ఉంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








