రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపును అందుకున్న మోడళ్లలో హోండా జాజ్, డబ్ల్యుఆర్-వి, అమేజ్ మరియు ఫిఫ్త్ జనరేషన్ సిటీ సెడాన్ కార్లు ఉన్నాయి.

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

కంపెనీ గత నెలలో హోండా సిఆర్-వి ఎస్‌యూవీ మరియు హోండా సివిక్ ప్రీమియం సెడాన్లను మార్కెట్లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి హోండా కార్ల ధరలు గరిష్టంగా రూ.20,000 వరకూ పెరిగాయి.

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

దేశంలో కార్ల తయారీకి వెచ్చించే ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఆటోమోటివ్ తయారీ ప్రక్రియలో కీలకమైన స్టీల్ ధరలు దేశంలో గత కొన్ని నెలలుగా అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న సంగతి తెలిసినదే.

MOST READ:న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

దేశీయ డిమాండ్ మరియు ముడి ఇనుము ధరలు పెరగడం, అంతర్జాతీయ ధరలు పెరగడం మరియు ఉత్పత్తి మరియు పరిమిత దిగుమతులు తగ్గడం వంటి వివిధ కారణాల వలన స్టీల్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

వీటికి అదనంగా, గతేడాది దేశంలో కోవిడ్ -19 మహమ్మారి సృష్టించిన కలకలం, ఉత్పత్తి అంతరాయం, అమ్మకాల నిలిపివేత వంటి సమస్యలకు తోడు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ల కొరత వంటి అంశాలు కూడా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

MOST READ:రేసు గుర్రం వంటి కొత్త నిస్సాన్ పాత్‌ఫైండర్ టీజర్ వీడియో

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

హోండా జాజ్

ఇక మోడల్ వారీగా ధరల పెంపు విషయానికి వస్తే, కంపెనీ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్ అన్ని వేరియంట్లపై రూ.5,000 మేర ధరలు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత, మార్కెట్లో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు రూ.7.55 లక్షల నుండి రూ.9.79 లక్షల ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) మధ్యలో రీటైల్ అవుతోంది. ఈ కారు ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది.

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

హోండా అమేజ్

హోండా విక్రయిస్తున్న కాంపాక్ట్-సెడాన్ 'అమేజ్' మోడల్‌లో టాప్-ఎండ్ డీజిల్ సివిటి వేరియంట్స్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లపై రూ.5,000 మేర ధరలను పెంచారు. ధరల పెంపు అనంతరం అమేజ్ పెట్రోల్ వేరియంట్లు రూ.6.22 లక్షల నుండి రూ.8.84 లక్షల మధ్య రిటైల్ అవుతుండగా, డీజిల్ వేరియంట్లు రూ.7.68 లక్షల నుంచి రూ .9.99 లక్షల మధ్యలో రిటైల్ అవుతున్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హోండా అమేజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

MOST READ:వావ్.. నిన్న కాక మొన్న వచ్చిన ఈ కార్.. అమ్మకాల్లో అప్పుడే టాప్ 10 లో చేరిపోయింది

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

హోండా డబ్ల్యూఆర్-వి

హోండా అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ డబ్ల్యూఆర్-విలోని అన్ని వేరియంట్లపై రూ.5,000 మేర ధరలు పెరిగాయి. ధరల పెంపు తర్వాత మార్కెట్లో డబ్ల్యుఆర్-వి పెట్రోల్ వేరియంట్లు రూ.8.55 లక్షల నుంచి రూ.9.75 లక్షల మధ్యలో ఉండగా, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.9.85 లక్షల నుండి రూ.11.05 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

హోండా సిటీ

ఇక ఈ జాబితాలో చివరగా, హోండా సిటీ సెడాన్ (ఐదవ తరం) మోడల్ ధరలు గరిష్టంగా రూ.20,000 వరకూ పెరిగాయి. ఈ సెడాన్ యొక్క ఎంట్రీ లెవల్ మరియు మిడ్-స్పెక్ వేరియంట్ల ధరలు రూ.10,000 పెరిగాయి. కాగా, రెండు ఇంజన్ ఆప్షన్లలోని టాప్-ఎండ్ జెడ్ఎక్స్ వేరియంట్ల ధరలు రూ.20,000 మేర పెరిగాయి.

MOST READ:2021 కేంద్ర బడ్జెట్‌లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

ధరల పెరుగుదల తరువాత, ఐదవ తరం హోండా సిటీ పెట్రోల్ వెర్షన్ ధరలు రూ.10.99 లక్షల నుండి రూ.14.64 లక్షల మధ్యలో ఉన్నాయి. డీజిల్ ఇంజన్ మోడల్‌ను మూడు వేరియంట్లలో మాత్రమే విక్రయిస్తున్నారు. వాటి ధరలు రూ.1249 లక్షల నుండి రూ.14.84 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

రూ.20,000 వరకూ పెరిగిన హోండా కార్ల ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..

కాగా, ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌తో పాటే కంపెనీ తమ నాల్గవ తరం సిటీ సెడాన్‌ను కూడా విక్రయిస్తోంది. అయితే, ఈ మోడల్ ధరలలో కంపెనీ ఎలాంటి సవరణలు చేయలేదు. ఈ పాత తరం హోండా సిటీ స్మాల్-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల నుండి సెడాన్ విభాగంలోకి ప్రవేశించాలనుకునే కొనుగోలుదారులకు మంచి ఆప్షన్‌గా ఉండి, ధరకు తగిన విలువను అందిస్తుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India Increases Car Prices Upto Rs.20,000; New Pricelist. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X