హోండా కార్ మాస్క్.. కారుకి మాస్క్ ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

ప్రపంచమంతా కరోనా కోరల్లో నలిగిపోయింది. కరోనా మహమ్మరి వల్ల ప్రజలు మాత్రమే కాదు వాహనతయారీ కంపనీలు కూడా ఎక్కువ నష్టాలను చవి చూశాయి. అయినప్పటికీ 2020 చివరలో మంచి అమ్మకాలను చేపట్టగలిగాయి. కానీ ఇప్పుడు కూడా చాలా దేశాలలో ఈ మహమ్మరి విజృంభిస్తూనే ఉంది.

హోండా కార్ మాస్క్.. కార్ మాస్క్ ఏంటనుకుంటున్నారా.. నిజమేనండి

ఈ నేపథ్యంలో ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా ఒక ప్రత్యేక మాస్క్ ప్రవేశపెట్టింది. హోండా తయారుచేసిన ఈ ఎయిర్ ఫిల్టర్ మాస్క్ కార్ క్యాబిన్లోని కోవిడ్ 19 వైరస్ ను ఎదుర్కోగలదు. క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లగా పనిచేస్తున్న ఈ కొత్త యాంటీవైరల్ మాస్క్ కు హోండా "కురుమాకు' అని పేరు పెట్టింది.

హోండా కార్ మాస్క్.. కార్ మాస్క్ ఏంటనుకుంటున్నారా.. నిజమేనండి

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఇవి ప్రధానంగా వైరస్ యొక్క ప్రభావాలను నివారించడానికి ఉద్దేశించబడ్డాయి. కరోనా వైరస్ కొత్త అవతారం చాలా దేశాలలో ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, హోండా నుండి వచ్చిన ఈ కొత్త ఆవిష్కరణ ఈ మహమ్మారి నుంచి కొంతవరకు కాపాడుతుంది.

MOST READ:డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

హోండా కార్ మాస్క్.. కార్ మాస్క్ ఏంటనుకుంటున్నారా.. నిజమేనండి

జపాన్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ కొత్త మాస్క్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది ఉపరితలంపై వైరస్ బిందువులను కూడా పట్టుకోగలదని సంస్థ తెలిపింది. దీనితో వైరస్ యొక్క సంక్రమణ పరిమాణాన్ని బాగా తగ్గిస్తుంది, తద్వారా వైరస్ మరియు బ్యాక్టీరియాల వ్యాప్తి కూడా తగ్గే అవకాశం ఉంది.

హోండా కార్ మాస్క్.. కార్ మాస్క్ ఏంటనుకుంటున్నారా.. నిజమేనండి

హోండా కంపెనీ రూపొందించిన ఈ ఎయిర్ ఫిల్టర్ లో జింక్ ఫాస్ఫేట్ ఉపయోగించబడింది. ఇది సూక్ష క్రిములను నాశనం చేయడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. కావున ప్రయాణికులు ప్రయాణ సమయంలో వైరస్ భయం లేకుండా ప్రయాణించవచ్చు. హోండా దీనిని ప్రస్తుతం జపాన్‌లో అమ్మకానికి ప్రవేశపెట్టింది.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ బుకింగ్ డేట్ రిలీజ్.. పూర్తి వివరాలు

హోండా కార్ మాస్క్.. కార్ మాస్క్ ఏంటనుకుంటున్నారా.. నిజమేనండి

ఈ స్పెషల్ మాస్క్ ని యాక్ససరీస్ కింద త్వరలో ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతుందని భావిస్తున్నారు. దీని ధర జపాన్ మార్కెట్లో 6,400 యెన్స్. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు 4,500 రూపాయలు.

హోండా కార్ మాస్క్.. కార్ మాస్క్ ఏంటనుకుంటున్నారా.. నిజమేనండి

ఇది కేవలం 15 నిమిషాల్లో గాలిలోని సూక్ష్మక్రిములను చంపుతుంది. దీని ద్వారా దాదాపు 99.8 శాతం వరకు క్రిములు నాశనమయ్యే అవకాసమ్ ఉంది. ఇది కూడా ఎన్ 95 మాస్క్ మాదిరిగానే పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తుంది.

MOST READ:రతన్ టాటా వెహికల్ నెంబర్ వాడుతూ పట్టుబడ్డ యువతి.. తర్వాత ఏం జరిగిందంటే?

హోండా కార్ మాస్క్.. కార్ మాస్క్ ఏంటనుకుంటున్నారా.. నిజమేనండి

ప్రస్తుతం దీనిని చాలామంది కార్ మాస్క్ గా పిలాడం ప్రారంభించారు. కరోనా గుప్పెట్లో నలుగుతున్న ప్రపంచానికి ఇలాంటి సాధనాలు ప్రస్తుతం చాల అవసరం. కాబట్టి హోండా యొక్క ఈ కొత్త మాస్క్ ఎక్కువ ప్రజాదరణ పొందుతుందనే భావించాలి.

హోండా కార్ మాస్క్.. కార్ మాస్క్ ఏంటనుకుంటున్నారా.. నిజమేనండి

ఇది 24 గంటల్లో ఎయిర్ ఫిల్టర్ ఉపరితలాలపై పేరుకుపోయిన వైరస్ను పూర్తిగా నిర్మూలించగలిగేలా తయారుచేయబడింది. కురుమాకు అనే పేరుగల ఈ యాక్ససరీ ఒక సంవత్సరం లేదా 15,000 కిలోమీటర్లు లేదా 9,320 మైళ్ళు ఉపయోగించబడుతుంది.

MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Develops Car Cabin Mask To Prevent Spread Of Covid-19 Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X