BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

దేశంలో భారత్ (BH) సిరీస్ వాహనాల రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 15, 2021వ తేదీ నుండి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు మరియు నాలుగు రాష్ట్రాలకు పైగా కార్యాలయాలు కలిగిన ప్రైవేటు సంస్థలో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులు ఈ సుదుపాయాన్ని ఆస్వాదించవచ్చు.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ఉద్యోగ బదిలీ కారణంగా ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి మారే ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని, వారి వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో, వారికి లబ్ధి చేకూరేలా 'ఒకే దేశం, ఒకే రిజిస్ట్రేషన్' ఉండేలా భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ఈ నిర్ణయం ప్రకారం, ఇకపై ఇలా ఉద్యోగరీత్యా తరచూ బదిలీ అయ్యే ఉద్యోగులు తమ వాహనాల రిజిస్ట్రేషన్ ను కొత్తగా బదిలీ అయ్యే రాష్ట్రంలోకి మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి వారి వాహనాల కోసం కొత్త పాన్-ఇండియా రిజిస్ట్రేషన్ సిరీస్‌ (BH Series)ను కేంద్రం ప్రవేశపెట్టింది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

అంటే, ఈ కొత్త BH సిరీస్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న వాహనాలను దేశంలోని ఏ రాష్ట్రంలో నైనా ఎంత కాలమైనా, ఎలాంటి ఆంక్షలు లేకుండా నడుపుకోవచ్చు. మరి ఈ BH సిరీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం అర్హులైన వారు ఎలా అప్లై చేసుకోవచ్చో దశల వారీగా తెలుసుకుందాం రండి..!

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

మొదటి దశ 1 :- భారత్ సిరీస్ (BH Series) రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం, ముందుగా మీరు మీ మాతృ రాష్ట్రం (మీ వాహనం ప్రస్తుతం ఎక్కడైతే రిజిస్టర్ చేయబడి ఉంటుందో ఆ రాష్ట్రం) నుండి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ను పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మరొక రాష్ట్రం (కొత్తగా బదిలీ అయ్యే రాష్ట్రం) యొక్క BH సిరీస్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

రెండవ దశ 2 - ఇలా ఎన్ఓసి పొందిన తర్వాత, కొత్త రాష్ట్రంలో రహదారి పన్ను (రోడ్ టాక్స్) ను ప్రో -రాటా ప్రాతిపదికన చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్రం మీకు భారత్ సిరీస్ వాహన శ్రేణి (BH) రిజిస్ట్రేషన్ నెంబరును కేటాయిస్తుంది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

మూడవ దశ 3 - ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తుదారులు తమ మాతృ రాష్ట్రంలో రోడ్డు పన్ను వాపసు కోసం దరఖాస్తును దాఖలు చేసుకోవాలి. రోడ్డు పన్ను వాపసు పొందే ప్రక్రియ రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటుందని గమనించండి.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

BH సిరీస్ రిజిస్ట్రేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?

BH రిజిస్ట్రేషన్ ఫార్మాట్ "YY BH #### XX" గా ఉంటుంది. ఇందులో YY అనేది మొదటి సంవత్సరం రిజిస్ట్రేషన్, BH అనేది భారత్ సిరీస్ కోడ్, #### అనేది 0000 నుండి 9999 వరకు గల ఏవైనా నాలుగు సంఖ్యలు మరియు చివరగా XX అనేది AA నుండి ZZ వరకు కలిగిన ఆంగ్ల అక్షరాలు. ఉదాహరణకు, ఈ కొత్త సిరీస్ క్రింద వాహన రిజిస్ట్రేషన్ సంఖ్య [21 BH 1234 AB] ఇలా ఉంటుందని అనుకోవచ్చు.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ఇలా BH సిరీస్ రిజిస్ట్రేషన్ పొందిన వినియోగదారులు తమ వాహనానికి సంబంధించిన మోటార్ వాహన పన్ను రెండు సంవత్సరాలకు ఒక్కసారి చొప్పున లేదా 4, 6, 8, 10 ఇలా రెండేసి గుణకాల చొప్పున చెల్లించే సదుపాయం ఉంటుంది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

సాధారణంగా, వాహనాల విషయంలో ప్రతి 14 ఏళ్లకు ఒక్కసారి చొప్పున రోడ్ టాక్స్ వసూలు చేస్తారు. ఈ గడువు పూర్తయిన తర్వాత, మోటారు వాహన పన్ను లేదా రహదారి పన్ను ప్రతి ఏటా వసూలు చేస్తారు. ఇది ఆ వాహనం కోసం గతంలో వసూలు చేసిన మొత్తంలో సగం వరకూ ఉంటుంది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ఇక ఈ కొత్త BH సిరీస్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు దేశంలో ఏ రాష్ట్రానికి తీసుకువెళ్లినా, అక్కడ మళ్లీ తాజాగా రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఉండదు. ఈ పథకం వలన ప్రజలు కొత్త రాష్ట్రానికి మారినప్పుడు తమ ప్రైవేట్ వాహనాలను ఉచితంగా తరలించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ప్రస్తుతం అమలులో ఉన్న RC బదిలీ ప్రక్రియ ఏమిటి?

ప్రస్తుతం అమలులో ఉన్న మోటార్ వాహనాల చట్టం 1988, సెక్షన్ 47 ప్రకారం, ఒక వాహన యజమాని తన వాహనాన్ని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ చేసినప్పుడు, తన వాహనాన్ని పాత రాష్ట్రపు రిజిస్ట్రేషన్ సంఖ్యతో, కొత్త రాష్ట్రంలో 12 నెలలకు మించి ఉపయోగించడానికి వీలు లేదు. ఈ లోపుగానే వారు తమ వాహనాలను కొత్త రాష్ట్రంలో రీ-రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ఇలా కొత్త రాష్ట్రంలో తమ వాహనాన్ని రీ-రిజిస్టర్ చేసుకోవటం కోసం, సదరు వాహన యజమాని తన మాతృ రాష్ట్రం (వాహనం ఎక్కడైతే రిజిస్టర్ చేయబడి ఉంటుందో, అక్కడి నుండి) NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ NOC ని కొత్త రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో సమర్పించి, రహదారి పన్నును ప్రో-రాటా ప్రాతిపదికన చెల్లించిన తర్వాత వాహనానికి కొత్త రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరును కేటాయించడం జరుగుతుంది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, సదరు వాహన యజమాని తన మాతృ రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్ రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అధికారులు ప్రో-రాటా ప్రాతిపదికన రోడ్ టాక్స్ ను వాహన యజమానికి వాపసు చేస్తారు. ఈ సాధారణ రిజిస్ట్రేషన్ బదిలీ ప్రక్రియ సుదీర్ఘమైనది మరియు చాలా సమయంతో కూడుకున్నది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

BH సిరీస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా తీసుకోవాలా?

ప్రభుత్వం ఈ BH సిరీస్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికి పూర్తిగా స్వచ్ఛందంగా మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. అంటే, ఇది తప్పనిసరేం కాదు అని అర్థం. తరచూ ఉద్యోగ రీత్యా బదిలీ అయ్యే వ్యక్తులు తమకు అవసరమైతే, ఈ BH సిరీస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆశ్రయించవచ్చు. వాహనాల రిజిస్ట్రేషన్‌ను పదే పదే బదిలీ చేసే సమస్య నుండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.

BH సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం ఎలా అప్లై చేయాలి? - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ఒకవేళ అలా కాకుండా, మీరు శాస్వతంగా ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి బదిలీ అయినట్లయితే, సాధారణ ప్రక్రియను అనుసరించి కొత్త రాష్ట్రపు రిజిస్ట్రేషన్ సంఖ్యను పొందవచ్చు. ఇవి రెండూ కాకుండా ఏ రాష్ట్రంలో నైనా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాహనాన్ని 12 నెలలకు మించి ఉపయోగించినట్లయితే, ట్రాఫిక్ అధికారులు సదరు వాహన యజమానికి జరిమానా విధించడం లేదా వాహనాన్ని సీజ్ చేయటం వంటివి జరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
How to get bh series registration number step by step process
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X