లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

సాధారణంగా ఒక వాహనాన్ని లోన్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, వారు తప్పకుండా కొన్ని డాక్యుమెంట్స్ సంబంధిత బ్యాంకుకి అందించాలి. కానీ 2021 నవంబర్ 01 నుంచి దేశ రాజధాని 'ఢిల్లీ' లో లోన్ పై వాహనాన్ని కొనుగోలు చేసేవారు బ్యాంకుకు వెళ్లి, హైపోథెకేషన్ ప్రక్రియ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ (ఫిజికల్ డాక్యుమెంట్స్) అందించాల్సిన అవసరం లేదు. వెహికల్ హైపోథెకేషన్ టెర్మినేషన్ (HPT) ప్రక్రియను సులభతరం చేయడానికి, ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్రధాన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలతో చర్చలు జరిపింది.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

ఈ హైపోథెకేషన్ ప్రక్రియలో, బ్యాంకు లొనుపై కొనుగోలు చేసిన వాహనాల రికార్డులు అందించాలి. లోన్ తిరిగి చెల్లించిన తరువాత కొనుగోలుదారుకు బ్యాంక్ మరియు రవాణా శాఖతో సంబంధం ఉన్న ప్రక్రియ ద్వారా ఇవి పునరుద్ధరించబడతాయి. ఈ ప్రక్రియ 2021 నవంబర్ 01 నుంచి మరింత సులభతరం కానుంది.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

నవంబర్ 01 నుంచి బ్యాంకులు మరియు రుణ సంస్థలు సాఫ్ట్‌వేర్‌లోని అన్ని డాక్యుమెంట్స్ మరియు NOC లను OTP కార్డు ద్వారా డిజిటల్‌గా సమర్పించాలి, ఇది ఆధార్ కార్డుకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను అందుకుంటుంది. ఈ ప్రక్రియలో కస్టమర్‌లు భౌతికంగా సిగ్నేచర్ చేయాల్సిన అవసరం కూడా లేదు.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

రవాణా శాఖ ఇప్పటికే ఆటోమేటిక్ హైపోథికేషన్ కోసం ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. అంతే కాకుండా పేస్ లెస్ (ముఖా ముఖి) సర్వీస్ ప్రారంభించిన తర్వాత, వాహనాలపై రుణాలు పొందిన 7,800 మంది దరఖాస్తుదారుల డేటాను పొందింది. కానీ నవంబర్ ప్రారంభం నుండి, ఏదైనా ఆర్థిక సంస్థ నుండి వెహికల్ లోన్ తీసుకోవాలనుకునే దరఖాస్తుదారు బ్యాంకును సందర్శించి భౌతిక రూపంలో డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

వెహికల్ లోన్ తీసుకున్న తరువాత లేదా మొత్తం చెల్లించిన తరువాత, సంబంధిత బ్యాంక్ ఆ సమాచారాన్ని నేరుగా వెహికల్ డేటాబేస్‌కు బదిలీ చేస్తుంది. ఇది HPT సేవను సమీక్షించడానికి మరియు ఆమోదించడానికి రవాణా శాఖను అనుమతిస్తుంది. ఇది వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్:

భారతదేశంలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి కారణంగా అనేక సేవలకు అంతరాయం కలిగింది. ఇందులో కొన్ని సర్వీసులు నిలిచిపోగా మరికొన్ని ఆలస్యమయ్యాయి. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మరియు ఆధార్ కార్డ్‌ వంటి సర్వీసులు ఉన్నాయి.

దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం, ఇప్పుడు వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందటాన్ని మరింత సులభతరం చేయడానికి లైసెన్స్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేసింది. ఢిల్లీలో, ఇప్పుడు ప్రజలు ఇంట్లో కూర్చుని లెర్నింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజలు ఢిల్లీలో లెర్నింగ్ లైసెన్స్ పొందడానికి RTO కి వెళ్లవలసిన అవసరం కూడా లేదు.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

ఢిల్లీ రవాణా శాఖ యొక్క ఈ సులభమైన పద్దతిని 2021 ఆగస్టు 11 నుండి ప్రారంభించింది. కావున ఇప్పుడు దరఖాస్తుదారులు ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది డ్రైవింగ్ లైసెన్స్ పొందే వారికి చాలా సులభమైన ప్రక్రియ.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

డ్రైవింగ్ టెస్ట్ ఇప్పుడు రాత్రిపూట కూడా..

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో, ఎక్కువ మంది డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి డ్రైవింగ్ టెస్ట్ కు హాజరవుతున్నారు. డ్రైవింగ్ టెస్ట్ కి రోజురోజుకి డిమాండ్‌ పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC) రాత్రి 10 గంటలకు కూడా డ్రైవింగ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దీని కోసం అన్ని జోనల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీస్ టెస్ట్ ట్రాక్‌లలో అధిక సామర్థ్యం గల లైట్లు ఏర్పాటు చేయబడ్డాయి.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన లైట్లు పగటి పూట కాంతి వలె ప్రకాశవంతంగా ఉంటాయి. ఇది కాకుండా, డ్రైవింగ్ సమయాన్ని తగ్గించడానికి ఆదివారం కూడా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. దీని కోసం ఢిల్లీ రవాణా కార్యాలయాల సేవలను పారదర్శకంగా అందించడానికి మరియు రవాణా కార్యాలయం కార్యాలయాలకు వెళ్లే ప్రజలను నిరోధించడానికి ఢిల్లీ రవాణా సేవల యొక్క చాలా సేవలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందిస్తోంది.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

దీని కోసం ప్రజలు డ్రైవింగ్ టెస్ట్‌లు మరియు వెహికల్ ఫిట్ నెస్ టెస్ట్ ల కోసం మాత్రమే రవాణా కార్యాలయాలను సందర్శించాల్సి ఉంటుంది. ఢిల్లీలో వాయు కాలుష్య రేటు రోజురోజుకి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.

లోన్ ద్వారా వెహికల్ కొంటున్నారా.. నవంబర్ 01 నుంచి వెరీ సింపుల్

ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి దాని ఓన్ ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం కింద, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారి కోసం ప్రభుత్వం అనేక రాయితీలను అందిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంలోని అనేక విభాగాలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేశాయి. అంతే కాకుండా ఢిల్లిలోని ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

NOTE: ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Hypothecation termination process to become simple from 1st november details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X