Creta Grand పేరుతో విడుదలైన Hyundai Alcazar ఎస్‌యూవీ, ఎక్కడంటే..?

దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) గత జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన క్రెటా ఆధారిత 7 సీటర్ ఎస్‌యూవీ అల్కాజార్ (Alcazar) ను కంపెనీ ఇప్పుడు మెక్సికో మార్కెట్లో విడుదల చేసింది. మెక్సికన్ మార్కెట్లో హ్యుందాయ్ అల్కజార్ ను కంపెనీ హ్యుందాయ్ క్రెటా గ్రాండ్ (Creta Grand) పేరుతో ప్రవేశపెట్టింది.

Creta Grand పేరుతో విడుదలైన Hyundai Alcazar ఎస్‌యూవీ, ఎక్కడంటే..?

మెక్సికో మార్కెట్లో విడుదలైన హ్యుందాయ్ క్రెటా గ్రాండ్ ప్రారంభ ధర 4,55,000 మెక్సికన్ పెసోలు (మనదేశ కరెన్సీలో సుమారు రూ. 16.52 లక్షలు) గా ఉంటుంది. పూర్తిగా భారతదేశంలో తయారైన హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీని క్రెటా గ్రాండ్ పేరుతో కంపెనీ మెక్సికో దేశానికి ఎగుమతి చేయనుంది. అక్కడి మార్కెట్లో ఈ కారు జిఎల్ఎస్ ప్రీమియం మరియు లిమిటెడ్ ఆటోమేటిక్ అనే రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో టాప్ మోడల్ ధర 4,98,000 మెక్సికన్ పెసో (సుమారు రూ. 18.07 లక్షలు)గా ఉంటుంది.

Creta Grand పేరుతో విడుదలైన Hyundai Alcazar ఎస్‌యూవీ, ఎక్కడంటే..?

డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా గ్రాండ్, భారత మార్కెట్లో లభించే హ్యుందాయ్ అల్కజార్ మాదిరిగానే ఉంటుంది. స్టాండర్డ్ వెర్షన్ క్రెటాతో పోలిస్తే, ఈ ఎస్‌యూవీ పరిమాణంలో క్రెటా కన్నా పెద్దదిగా ఉండి, 6 లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్ తో లభిస్తుంది. అయితే, మెక్సికోలో మాత్రం ఈ కారు కేవలం 7 సీట్ల ఎంపికలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని కె2 డిజైన్ ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి తయారు చేసింది. హ్యుందాయ్ క్రెటా కూడా ఇదే ప్లాట్‌ఫామ్ పై నిర్మించబడింది.

Creta Grand పేరుతో విడుదలైన Hyundai Alcazar ఎస్‌యూవీ, ఎక్కడంటే..?

ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో, హ్యుందాయ్ సిగ్నేచర్ క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, పొడవాటి రియర్ ఓవర్‌హాంగ్, వెనుక భాగంలో ప్రధానంగా కనిపించే క్వార్టర్ గ్లాస్ మరియు 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో డ్యూయల్-టిప్ ఫాక్స్ ఎగ్జాస్ట్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడి బ్రేక్ లైట్లు, సిల్వర్ కలర్ సైడ్‌స్టెప్స్ మరియు రూఫ్‌ రైల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Creta Grand పేరుతో విడుదలైన Hyundai Alcazar ఎస్‌యూవీ, ఎక్కడంటే..?

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఫ్రంట్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్ కోసం 64 కలర్ ఆప్షన్స్ మరియు పడల్ ల్యాంప్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Creta Grand పేరుతో విడుదలైన Hyundai Alcazar ఎస్‌యూవీ, ఎక్కడంటే..?

సేఫ్టీ విషయానికి వస్తే, హ్యుందాయ్ క్రెటా గ్రాండ్ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి. ఇక చివరిగా ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, మెక్సికన్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా గ్రాండ్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది, ఈ ఇంజన్ 157 బిహెచ్‌పి పవర్ ను మరియు 191 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది.

Creta Grand పేరుతో విడుదలైన Hyundai Alcazar ఎస్‌యూవీ, ఎక్కడంటే..?

కాగా, భారత మార్కెట్లో లభిస్తున్న హ్యుందాయ్ అల్కాజార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో ప్రవేశపెట్టబడింది. ఇందులోని 2.0 లీటర్ న్యాచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి శక్తిని మరియు 191 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ అల్కజార్ లీటరుకు 14 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఆఫర్ చేస్తుంది.

Creta Grand పేరుతో విడుదలైన Hyundai Alcazar ఎస్‌యూవీ, ఎక్కడంటే..?

ఇక డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారులోని 1.5 లీటర్-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. డీజిల్ వెర్షన్ అల్కజార్ లీటరుకు 18-20 కిమీ లకు పైగా మైలేజీనిస్తుంది. ఈ కారులో కంఫర్ట్, ఎకో మరియు స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్స్ మరియు స్నో, శాండ్ మరియు మడ్ అనే ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ ఉన్నాయి.

Creta Grand పేరుతో విడుదలైన Hyundai Alcazar ఎస్‌యూవీ, ఎక్కడంటే..?

భారత మార్కెట్లో హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ సిగ్నేచర్, సిగ్నేచర్ (O), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (O), ప్లాటినం మరియు ప్లాటినం (O) అనే ట్రిమ్ లలోఅందించబడుతుంది. కొత్త ఆల్కాజార్ 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి: టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్స్. సీటింగ్ కాన్ఫిగరేషన్, ఇంజన్ మరియు గేర్‌బాక్స్ కాంబినేషన్‌ల ఆధారంగా ఈ 6 ట్రిమ్‌లు మొత్తం 17 వేరియంట్‌లుగా విభజించారు. తెలుగులో ఆటోమొబైల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, November 8, 2021, 15:20 [IST]
English summary
Hyundai alcazar suv launched as creta grand in mexico details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+