Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 7 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్.. ఐపీఎల్ 2021 నుంచి స్టార్ పేసర్ ఔట్! ఆందోళనలో ఫాన్స్!
- News
కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ
- Finance
Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, గడచిన జనవరి నెలలో టీజ్ చేసిన తమ కొత్త బి-సెగ్మెంట్ క్రాసోవర్ 'బేయోన్'ను వచ్చే నెలలో అధికారికంగా ఆవిష్కరించనుంది. మార్చి 2వ తేదీన హ్యుందాయ్ బేయోన్ కారును ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ బేయోన్ అత్యంత సరసమైన బి-సెగ్మెంట్ క్రాసోవర్ (లేదా ఎస్‌యూవీ)గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది ఆసియా మార్కెట్లలో ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా మంచి పాపులారిటీని దక్కించుకుంటుందని కంపెనీ ధీమాగా ఉంది.

ఇటీవల హ్యుందాయ్ విడుదల చేసిన బేయోన్ టీజర్ ఫొటోలను బట్టి చూస్తే, ఈ కారును పూర్తిగా సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇందులోని షార్ప్ ఫ్రంట్ అండ్ రియర్ ప్రొఫైల్స్ ఈ కారుకి మంచి స్పోర్టీ రూపాన్ని ఇవ్వటంలో సహకరిస్తాయి.
MOST READ:పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !

బేయోన్ ముందు భాగంలో సన్నటి ఎల్ఈడి డిఆర్ఎల్ వెనుక భాగంలో బూమరాంగ్ ఆకారంలో ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ డిజైన్‌ను ఈ టీజర్ ఫొటోలలో చూడొచ్చు. ఫ్రంట్ బంపర్‌లో అమర్చిన స్ప్లిట్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, దాని పై భాగంలో సన్నటి ఎల్‌ఈడీ డీఆర్ఎల్ లైట్స్ మరియు కారు ముందు భాగంలో గ్రిల్ మధ్యలో ఉంచిన పెద్ద ఎయిర్ ఇంటేక్ వంటి డిజైన్ వివరాలను ఇందులో గమనించవచ్చు.

హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ 2021 మొదటి అర్ధభాగంలో యూరోపియన్ మార్కెట్లను తాకే అవకాశం ఉంది. ఆ తర్వాతి, కాలంలో ఇది భారత్ వంటి మార్కెట్లలో కూడా విడుదల కావచ్చని అంచనా. గతేడాది నవంబర్ నెలలోనే హ్యుందాయ్ తమ బేయోన్ పేరును ఆవిష్కరించింది. పేరును ఆవిష్కరించిన కొద్ది నెలల్లోనే కంపెనీ దీని ప్రోటోటైప్‌ను కూడా సిద్ధం చేయటం విశేషం.

హ్యుందాయ్ బేయోన్‌కు ఈ పేరును నైరుతి ఫ్రాన్స్‌లో ఉన్న బేయోన్ నగరం నుండి స్పూర్తి పొంది పెట్టారు. ఈ నగరం సెయిలింగ్ మరియు హైకింగ్ చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ రెండు అంశాలను ప్రతిభింభింపజేసేలా హ్యుందాయ్ తమ సరికొత్త బేయోన్ ఎస్‌యూవీని డిజైన్ చేసినట్లుగా చెబుతోంది.

ఈ కారులో చాలా వరకూ యూరోపియన్ డిజైన్ ఎలిమెంట్స్ కనిపించే అవకాశం ఉంది. హ్యుందాయ్ తమ కార్లకు కొన్ని ప్రముఖ నగరాల పేర్లను పెట్టడం ఇదే మొదటిసారి కాదు. ప్రస్తుతం హ్యుందాయ్ విక్రయిస్తున్న టక్సన్ మరియు శాంటాఫే మోడళ్లకు కూడా అమెరికాలోని అరిజోనా మరియు న్యూ మెక్సికో రాష్ట్రాల్లోని నగరాల నుండి స్పూర్తి పొంది ఆ పేర్లను పెట్టారు.
MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

హ్యుందాయ్ బేయోన్ ఎలక్ట్రిక్ కారులో ప్రస్తుత తరం ఐ20 కారులో ఉపయోగిస్తున్న ఇంజన్ ఆప్షన్లనే ఉపయోగించవచ్చని సమాచారం. ప్రస్తుతానికి హ్యుందాయ్ ఈ సరికొత్త ఎస్‌యూవీకి సంబంధించిన స్పెసిఫికేషన్లు మరియు ఇతర వివరాలను ఇంకా వెల్లడించలేదు. మార్చి 2న మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.