హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

ఇప్పటి వరకూ టీజర్ల రూపంలో ఊరిస్తూ వచ్చిన హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎట్టకేలకు తన పరదాలను తొలగించుకుంది. కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'బేయోన్'ను ప్రపంచానికి పరిచయం చేసింది. యూరప్, ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ కొత్త కారును ప్రవేశపెట్టింది.

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఈ కొత్త హ్యుందాయ్ బేయోన్ విడుదల కానుంది. వచ్చే ఏడాది నాటికి ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో కూడా విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. అయితే, దీనికి సంబంధించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

హ్యుందాయ్ ఎస్‌యూవీ లైనప్‌లోనే బేయోన్ అత్యంత సరసమైన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ గతంలో వెల్లడించింది. ఆసియా మార్కెట్లలో ఇది హ్యుందాయ్‌కి ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా మారనుంది.

MOST READ:2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రివ్యూ ; కొత్త ఫీచర్స్ & పూర్తి వివరాలు

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

ఈ కారు పరిమాణం హ్యుందాయ్ కోనా ఈవీ మాదిరిగానే ఉంటుంది. అయితే, దాని డిజైన్ కారణంగా, ఇది కోన కంటే పెద్దదిగా కనిపిస్తుంది. హ్యుందాయ్ బేయోన్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క ఆధునిక డిజైన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు.

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

ఫ్రాన్స్‌లోని బేయోన్ నగరం నుండి స్పూర్తి పొంది ఈ కారుకు బేయోన్ అనే పేరును పెట్టారు. అత్యాధునిక డిజైన్ ఎలిమెంట్స్‌తో ఈ కారు మంచి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది. సమాచారం ప్రకారం, ఈ ఎస్‌యూవీని మొదట యూరప్ దేశాల్లో విడుదల చేయనున్నారు, ఆ తర్వాత ఆసియా దేశాలకు పరిచయం చేయనున్నారు.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 48 వోల్ట్స్ హైబ్రిడ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ కారులో హ్యుందాయ్ నుండి అత్యంత పాపులర్ అయిన కప్పా 1.0-లీటర్ టి-జిడి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్ మరియు 120 బిహెచ్‌పి పవర్ ఆప్షన్లలలో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

ఈ ఇంజన్స్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారులో స్ప్లిట్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, దానిపై భాగంలో సన్నటి ఎల్‌ఈడీ డీఆర్ఎల్ లైట్స్ మరియు కారు ముందు భాగంలో గ్రిల్ మధ్యలో ఉంచిన పెద్ద ఎయిర్ ఇంటేక్ వంటి డిజైన్ వివరాలను ఇందులో గమనించవచ్చు.

MOST READ:వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

వెనుక భాగంలో బ్లాక్ బంపర్ దాని క్రింది భాగంలో అమర్చిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్, వెనుక బంపర్‌లో అమర్చిన రివర్స్ పార్క్ అసిస్ట్ ల్యాంప్స్, బాణాల ఆకారంలో ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మరియు రెండు టెయిల్ ల్యాంప్స్‌ను కలుపుతున్నట్లుగా ఉండే ఎల్ఈడి లైట్ బార్, రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, బ్లాక్డ్ అవుట్ రూఫ్ వంటి మార్పులు ఉన్నాయి.

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

ఇంటీరియర్స్‌లో క్లీన్ అండ్ నీట్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కోసం పెద్ద ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజైనర్ ఫ్యాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:స్కూల్ బస్సులు యెల్లో కలర్‌లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

హ్యుందాయ్ బేయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; వివరాలు

హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రస్తుతం తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో 4 ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. వీటిలో హ్యుందాయ్ వెన్యూ, క్రెటా, టక్సన్ మరియు కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఉన్నాయి. హ్యుందాయ్ ఇటీవలే, దేశీయ మార్కెట్లో తమ సరికొత్త 2021 ఐ20 కారును మార్కెట్లో విడుదల చేసింది.

Most Read Articles

English summary
Hyundai Bayon Unveiled; Features, Specs And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X