భారీగా పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; వేరియంట్ వారీగా కొత్త ధరల వివరాలు

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా ధరలను భారీగా పెంచింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ మోడల్ ధరలు రూ.19,600 వరకు పెరిగాయి.

భారీగా పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; వేరియంట్ వారీగా కొత్త ధరల వివరాలు

ధరల పెంపు అనంతరం మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా రూ.10.16 లక్షల నుండి రూ.17.87 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో లభిస్తోంది. హ్యుందాయ్ క్రెటా రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

భారీగా పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; వేరియంట్ వారీగా కొత్త ధరల వివరాలు

వీటిలో 1.5 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. క్రెటా వివిధ రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటాలో వేరియంట్ల వారీగా పెరిగిన ధరల వివరాలను తెలుసుకుందాం రండి.

భారీగా పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; వేరియంట్ వారీగా కొత్త ధరల వివరాలు

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ వేరియంట్ల ధరలు:

  • 1.5 లీటర్ ఈ మాన్యువల్ - రూ.10.16 లక్షలు
  • 1.5 లీటర్ ఈఎక్స్ మాన్యువల్ - రూ.11.12 లక్షలు
  • 1.5 లీటర్ ఏస్ మాన్యువల్ - రూ.12.35 లక్షలు
  • 1.5 లీటర్ ఎక్స్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ మాన్యువల్ - రూ.13.34 లక్షలు
  • 1.5 లీటర్ ఎస్ఎక్స్ మాన్యువల్ - రూ.14.13 లక్షలు
  • 1.5 లీటర్ ఎస్ఎక్స్ ఐవిటి - రూ.15.61 లక్షలు
  • 1.5 లీటర్ ఎస్ఎక్స్ (ఓ) ఐవిటి - రూ.16.82 లక్షలు
  • 1.4 లీటర్ ఎస్ఎక్స్ డిసిటి - రూ.16.83 లక్షలు
  • 1.4 లీటర్ ఎస్ఎక్స్ (ఓ) డిసిటి - రూ.17.87 లక్షలు
  • భారీగా పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; వేరియంట్ వారీగా కొత్త ధరల వివరాలు

    హ్యుందాయ్ క్రెటా యొక్క 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఐవిటి ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లు వరుసగా రూ.15.61 లక్షలు మరియు రూ.17.87 లక్షల ధరలో అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.13.34 లక్షలుగా ఉంది. అలాగే, 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఎస్ఎక్స్ డిసిటి మరియు ఎస్ఎక్స్ (ఓ) డిసిటి వేరియంట్ల ధరలు వరుసగా రూ.16.83 లక్షలు మరియు రూ.17.87 లక్షలుగా ఉన్నాయి.

    భారీగా పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; వేరియంట్ వారీగా కొత్త ధరల వివరాలు

    డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే, క్రెటా 1.5 లీటర్ ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.14.30 లక్షలకు చేరుకుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్ల ధరలు వరుసగా రూ.10.63 లక్షలు, రూ.12.03 లక్షలు, రూ.13.31 లక్షలు మరియు రూ.15.09 లక్షలుగా ఉన్నాయి..

    భారీగా పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; వేరియంట్ వారీగా కొత్త ధరల వివరాలు

    పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.16,010 మేర పెరగగా, డీజిల్ వేరియంట్ ధరలు రూ.12,100 మేర పెరిగాయి. మిడ్ మరియు హై వేరియంట్‌ల ధరలు రూ.19,600 మేర పెరిగాయి. తాజా ధరల పెరుగుదలకు ముందు, హ్యుందాయ్ క్రెటా ధరలు రూ.9.99 లక్షల నుండి రూ.17.67 లక్షల మధ్యలో ఉండేవి.

    భారీగా పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; వేరియంట్ వారీగా కొత్త ధరల వివరాలు

    హ్యుందాయ్ క్రెటా డీజిల్ వేరియంట్ల ధరలు:

    • 1.5 లీటర్ ఈ -మాన్యువల్ - రూ.10.6 లక్షలు
    • 1.5 లీటర్ ఈఎక్స్ మాన్యువల్ - రూ.12.03 లక్షలు
    • 1.5 లీటర్ ఏస్ మాన్యువల్ - రూ.13.31 లక్షలు
    • 1.5 లీటర్ ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ మాన్యువల్ - రూ.14.30 లక్షలు
    • 1.5 లీటర్ ఎస్ఎక్స్ మాన్యువల్ - రూ.15.09 లక్షలు
    • 1.5 లీటర్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ - రూ.16.57 లక్షలు
    • 1.5 లీటర్ ఎస్ఎక్స్ (ఓ) మాన్యువల్ - రూ.16.37 లక్షలు
    • 1.5 లీటర్ ఎస్ఎక్స్ (ఓ) ఆటోమేటిక్ - రూ.17.78 లక్షలు
    • (గమనిక: పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, డీలరు ప్రాంతాన్ని బట్టి ఈ ధరలలో స్వల్ప మార్పులు ఉంటాయని గమనించగలరు).

      భారీగా పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; వేరియంట్ వారీగా కొత్త ధరల వివరాలు

      హ్యుందాయ్ క్రెటాలో సరసమైన ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్‌ను గడచిన జూన్ నెలలోనే మార్కెట్లో విడుదల చేశారు. కాగా, ఇప్పుడు ఈ వేరియంట్ ధర కూడా పెరిగింది. క్రెటా 1.5-లీటర్ పెట్రోల్, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, ఐవిటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
Hyundai creta suv price increased variant wise new price list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X