కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాలో కంపెనీ ఓ కొత్త తరం (2020) మోడల్‌ను గతేడాది ఆరంభంలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి, ఈ ఎస్‌యూవీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

కాగా, కంపెనీ ఇప్పుడు క్రెటా అమ్మకాలను మరింత పెంచుకునేందుకు ఇందులో మరిన్ని కొత్త ఫీచర్లను మరియు మెరుగైన కనెక్టివిటీ టెక్నాలజీని ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కంపెనీ హ్యుందాయ్ క్రెటా లైనప్‌లో కొన్ని సవరణలు చేసే అవకాశం ఉంది.

కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

హ్యుందాయ్ క్రెటా ధరలను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ తం ఎంట్రీ లెవల్ ఈ వేరియంట్‌లో కొన్ని ఫీచర్లను తొలగించనుంది. అదే సమయంలో ఇతర వేరియంట్లలో కొన్ని అదనపు ఫీచర్లను జోడించనుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

MOST READ:బెంగళూరులో కరోనా ఎఫెక్ట్; లాక్‌డౌన్‌లో పట్టుబడ్డ వారికి డిఫరెంట్ పనిష్మెంట్

కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

తాజాగా, లీకైన సమాచారం ప్రకారం, హ్యుందాయ్ క్రెటా యొక్క టాప్-ఎండ్ ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కొత్త వాయిస్ కమాండ్స్ కోసం ఓవర్-ది-ఎయిర్ (ఓడిఎ) కనెక్షన్‌ను కలిగి ఉంటాయి.

కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

ఈ ఖరీదైన వేరియంట్లులో రిమోట్ ఇంజన్ స్టార్ట్, డాష్‌బోర్డ్‌లో మృదువైన పెయింట్ ఫినిషింగ్ మరియు కొత్త స్మార్ట్ కీని కలిగి ఉంటాయి. అలాగే, మిడ్-రేంజ్ ఎక్స్ మరియు ఎస్ వేరియంట్లు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను పొందుతాయి.

MOST READ:మీరెప్పుడూ చూడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీడియో.. ఇప్పుడు చూసెయ్యండి

కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

ఇప్పటి వరకూ ఈ ఎస్‌యూవీలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను వైర్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కారుకు కనెక్ట్ చేయడం ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసలుబాటు ఉండేది. ఇకపై వైర్ లేకుండా ఈ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు.

కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

ఇక ఎంట్రీ లెవల్ క్రెటా ఈ వేరియంట్లో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్‌లు తొలగించబడతాయి. అంతేకాకుండా, ఈ వేరియంట్ లగేజ్ కంపార్ట్మెంట్ అందించిన లైటింగ్ మరియు ప్యాసింజర్ సీటు వెనుక భాగంలో అందించిన సీట్ పాకెట్‌ను కూడా కోల్పోనుంది. ఈ వేరియంట్లో సైడ్ మిర్రర్‌లపై అందించిన టర్న్-ఇండికేటర్లను ఫ్రంట్ ఫెండర్‌లపైకి మార్చనున్నారు.

MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

ఇదిలా ఉంటే, గడచిన ఏప్రిల్ నెలలో హ్యుందాయ్ తమ క్రెటా డీజిల్ వెర్షన్ ధరలను రూ.19,600 మేర పెంచగాపెట్రోల్ వెర్షన్ ధరలు రూ.13,600 మేర పెంచిన సంగతి తెలిసినదే. అయితే, క్రెటా బేస్ పెట్రోల్ ఈ వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది మునుపటి మాదిరిగానే రూ.9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తుంది.

కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వీటిలో 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు వరుసగా 115 బిహెచ్‌పిల శక్తిని మరియు 144 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

కొత్త ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీతో రానున్న కొత్త హ్యుందాయ్ క్రెటా!

ఈ మూడు ఇంజన్ ఆప్షన్లు కూడా స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. అయితే, ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారి కోసం కంపెనీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ సివిటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి ఆప్షన్లను అందిస్తోంది.

Source: Rushlane

Most Read Articles

English summary
Hyundai Creta To Get New Features And Improved Connectivity, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X