హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

జనవరి నెలలో ధరల పెంపుతో కస్టమర్లపై వాతలు పెట్టిన కార్ కంపెనీలు, ఈ ఫిబ్రవరి నెలలో వెన్న రాసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ ఉత్పత్తులపై ఇప్పటికే కొన్ని కార్ కంపెనీలు డిస్కౌంట్లను ప్రకటించగా, తాజాగా హ్యుందాయ్ తమ కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

ఈ నెలలో కస్టమర్లను ఆకర్షించేందుకు మరియు అమ్మకాలను పెంచుకునేందుకు కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఎంపిక చేసిన కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందిస్తోంది. మోడల్ వారీగా హ్యుందాయ్ అందిస్తున్న ఆఫర్ల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

హ్యుందాయ్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రో కారులో ఎరా వేరియంట్ కొనుగోలుదారులుపై కంపెనీ రూ.20,000 నగదు తగ్గింపును మరియు ఇతర వేరియంట్లపై రూ.30,000 వరకు తగ్గింపు అందిస్తోంది. అలాగే అన్ని శాంత్రో వేరియంట్లపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై కంపెనీ ఈ నెలలో రూ.45,000 నగదు తగ్గింపును అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ కేవలం 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్లపై మాత్రమే లభ్యం కానుంది.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

ఇతర ఐ10 నియోస్ వేరియంట్‌లపై రూ.15,000 నగదు తగ్గింపు లభిస్తుంది. అన్ని ఐ10 వేరియంట్లపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

హ్యుందాయ్ విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్ ఔరాపై రూ.50,000 నగదు తగ్గింపును అందిస్తోంది. అయితే, ఇది కూడా గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోడలపై మాత్రమే లభిస్తుంది.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

కాగా, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ డీజిల్ వేరియంట్లపై రూ.20,000 నగదు తగ్గింపును అందిస్తున్నారు. అయితే, సిఎన్‌జి వేరియంట్లపై ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్ చేయడం లేదు. అన్ని ఔరా వేరియంట్లపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

హ్యుందాయ్ ఎలంట్రాలోని పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్లపై రూ.30,000 వరకు తగ్గింపు ఆఫర్ చేస్తుండగా, పెట్రోల్ మాన్యువల్ మోడళ్లపై రూ.70,000 తగ్గింపు అందిస్తు్ననారు.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

కాగా, డీజిల్ వేరియంట్‌ ఎలాంట్రా మోడళ్లపై ఎలాంటి నగదు తగ్గింపు ఆఫర్ లేదు. అయితే, అన్ని వేరియంట్లపై రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తున్నారు.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు కోనపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నారు. అయితే, ఇందులో వైట్ కలర్ ఆప్షన్‌పై కేవలం రూ.50,000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. ఇతర అన్ని కలర్ ఆప్షన్లపై రూ.1.5 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. దీనిపై ఎలాంటి ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ బోనస్‌లు లేవు.

హ్యుందాయ్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు, మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు

ఇక వాణిజ్య ఉపయోగం కోసం మాత్రమే విక్రయించబడుతున్న హ్యుందాయ్ ఎక్సెంట్ కారు కొనుగోలుపై కస్టమర్లు రూ.50,000 వరకూ క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. హ్యుందాయ్ ఈ ఆఫర్లకు అదనంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు వైద్య సిబ్బంది కోసం అన్ని హ్యుందాయ్ కార్లపై రూ.3,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 6, 2021, 10:38 [IST]
English summary
Hyundai February Offers; Discounts On Santro, Grand i10 Nios, Aura, Elantra. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+