మరోసారి పెరిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు - వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరల పెరుగుదలను ప్రకటించింది. పెరుగుతున్న ముడి సరుకుల ఖర్చు మరియు రవాణా చార్జీల కారణంగా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు - వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క పెట్రోల్ ఇంజన్ వేరియంట్ల ధరలు రూ.2,000 నుండి రూ.5,000 మధ్యలో పెరగగా, సిఎన్‌జి వేరియంట్ల ధరలు రూ.5,000 మేర పెరిగాయి. కాగా, ఇందులో ‘మాగ్నా' వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు - వివరాలు

ఇక ఇందులో డీజిల్ వేరియంట్ల ధరల విషయానికొస్తే, ఇందులో ‘మాగ్నా కార్పొరేట్ ఎడిషన్' ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే, మిగిలిన అన్ని డీజిల్ వేరియంట్ల ధరలను రూ.4 ,000 మేర పెంచారు.

MOST READ:కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

మరోసారి పెరిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు - వివరాలు

తాజా ధరల పెరుగుదల అనంతరం మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు రూ.5.23 లక్షల నుంచి రూ.8.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Hyundai Grand i10 Petrol And CNG Price
Petrol Variant New Price Old Price
Era ₹5.23 Lakh ₹5.19 Lakh
Magna ₹6.00 Lakh ₹6.00 Lakh
Sportz ₹6.61 Lakh ₹6.57 Lakh
Magna AMT ₹6.62 Lakh ₹6.57 Lakh
Sportz Dual-Tone ₹6.91 Lakh ₹6.87 Lakh
Sportz AMT ₹7.23 Lakh ₹7.18 Lakh
Asta ₹7.38 Lakh ₹7.33 Lakh
Sportz Turbo ₹7.83 Lakh ₹7.81 Lakh
Asta AMT ₹7.86 Lakh ₹7.81 Lakh
Sportz Turbo Dual-Tone ₹7.88 Lakh ₹7.86 Lakh
CNG Variant New Price Old Price
Magna CNG ₹6.85 Lakh ₹6.80 Lakh
Sportz CNG ₹7.38 Lakh ₹7.33 Lakh
Diesel Variant New Price Old Price
Magna ₹7.16 Lakh ₹7.12 Lakh
Magna Corporate Edition ₹7.31 Lakh ₹7.31 Lakh
Sportz ₹7.69 Lakh ₹7.65 Lakh
Sportz AMT ₹8.31 Lakh ₹8.27 Lakh
Asta ₹8.45 Lakh ₹8.41 Lakh
మరోసారి పెరిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు - వివరాలు

భారత మార్కెట్లో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 83 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

MOST READ:విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

మరోసారి పెరిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు - వివరాలు

ఇకపోతే, రెండవది 1.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 75 బిహెచ్‌పి శక్తిని మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు - వివరాలు

ఇక ఇందులో చివరి ఇంజన్ ఆప్షన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

మరోసారి పెరిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు - వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ రూపంలో లభిస్తుంది.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు - వివరాలు

తక్కువ ధరలో మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే కస్టమర్లకు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఓ చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. ప్రీమియం ఫీచర్లను కలిగి ఉండే గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్, ఈ విభాగంలో మారుతి స్విఫ్ట్, టాటా టిగోర్ మరియు ఫోర్డ్ ఫిగో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల హవా

Most Read Articles

English summary
Hyundai Grand I10 Nios Gets Another Price Hike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X