Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 7 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్.. ఐపీఎల్ 2021 నుంచి స్టార్ పేసర్ ఔట్! ఆందోళనలో ఫాన్స్!
- News
కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ
- Finance
Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్న "హ్యుందాయ్ ఐ20"
"2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్" (ICOTY) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. విడుదలైన ఈ ఫలితాల ప్రకారం, సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ యొక్క ఇటీవల విడుదల చేసిన మూడవ తరం హ్యుందాయ్ ఐ 20 కార్ 2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతగా నిలిచింది.

ఇది మాత్రామే కాకుండా ఈ పోటీలో టాటా మోటర్స్ యొక్క టాటా నెక్సన్ ఈవి కి మొదటిసారిగా "2021 గ్రీన్ కార్ అవార్డు" లభించింది, మరియు ల్యాండ్ రోవర్ డిఫెండర్ 2021 ప్రీమియం కార్ అవార్డును కైవసం చేసుకుంది. గ్రీన్ కార్ అవార్డు విభాగాన్ని మొదటిసారిగా 2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్‌లో చేర్చారు.

హ్యుందాయ్ ఐ 20 కార్ అత్యధికంగా 104 పాయింట్ల అగ్రస్థానంలో నిలిచి, ఇంతటి గొప్ప ఘానా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో కియా సొనెట్ 91 పాయింట్లు దక్కించుకుని రెండవ స్థానంలో నిలిచింది. మాధవ స్థానంలో మహీంద్రా థార్ 78 పాయింట్లతో నిలిచింది.
MOST READ:పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !

ఇందులో ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే, టాటా నెక్సాన్ ఈవి మొత్తం 106 పాయింట్లతో ఎలక్ట్రిక్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. గ్రీన్ కార్ అవార్డు విభాగంలో, 99 పాయింట్లతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, 93 పాయింట్లతో ఎంజి మోటార్స్ ఎంజి జెడ్ఎస్ ఈవి గ్రీన్ కార్ అవార్డు విభాగంలో రెండవ స్థానంలో నిలిచాయి.

ప్రీమియం కార్ విభాగంలో కూడా ల్యాండ్ రోవర్ డిఫెండర్ 108 పాయింట్లు సాధించింది. రెండవ స్థానంలో నిలిచిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇకి 77 పాయింట్లు, మూడో స్థానంలో నిలిచిన బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్‌కు 61 పాయింట్లు వచ్చాయి. వీటిని ఎంపిక చేయడంలో అత్యంత అనుభవజ్ఞులైన ఆటోమోటివ్ జర్నలిస్టులు ఉన్నారు.

ICOTY 2021 విజేత హ్యుందాయ్ ఐ 20 కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్టర్. ఎస్.ఎస్. కిమ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండి & సిఇఒ మాట్లాడుతూ, సరికొత్త ఐ 20 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021' అనే అత్యంత ప్రతిష్టాత్మక ఆటోమోటివ్ అవార్డును గెలుచుకున్నందుకు మాకు గౌరవంగా ఉంది.

అవార్డు గెలుచుకోవడం అనేది హ్యుందాయ్ బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసం మరియు విశ్వాసాన్ని సూచిస్తుంది. సరికొత్త ఐ 20 ను ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 గా ఎంచుకున్నందుకు మా కస్టమర్లు, భాగస్వాములు, ప్రభుత్వం, మీడియా మరియు న్యాయనిర్ణేతలందరికి ధన్యవాదాలు అని ఆయన అన్నారు.
MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ కైవసం చేసుకున్న కొత్త హ్యుందాయ్ ఐ 20 యొక్క ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 6.80 లక్షలు కాగా, దాని దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 11.18 లక్షలు (ఎక్స్- షోరూమ్) గా ఉంది.

ఐ 20 రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో విక్రయించబడుతుంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 120 బిహెచ్‌పి శక్తిని ఇస్తుంది. రెండవది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 88 బిహెచ్‌పి శక్తిని ఇస్తుంది. చివరగా మూడవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 100 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. ఏది ఏమైనా హ్యుందాయ్ ఐ 20 విడుదలైన అతి తక్కువ కాలంలో ఇంత గొప్ప అవార్డు కైవసం చేసుకోవడం అనేది, చాలా గొప్ప విషయం.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]