ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన Hyundai i20 N Line; ధర & వివరాలు
భారతీయ మార్కెట్లో Hyundai (హ్యుందాయ్) కంపెనీ తన కొత్త i20 N Line కారుని విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Hyundai i20 N Line యొక్క ప్రారంభ ధర రూ. 9.84 లక్షలు (ఎక్స్-షోరూమ్). Hyundai తన i20 N Line స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్‌ను రెండు ట్రిమ్‌లలో పరిచయం చేసింది. అవి N6 మరియు N8 వేరియంట్స్.

కొత్త Hyundai i20 N Line (హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్) యొక్క బుకింగ్‌లు ఆవిష్కరించబడిన రోజునుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కొనుగోలుదారులు కంపెనీ వెబ్ సైట్ లో లేదా కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌లలో రూ. 25,000 అడ్వాన్స్‌గా చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

Hyundai i20 N Line అనేది భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొట్టమొదటి ఎన్‌లైన్ సిరీస్ కారు. కానీ హ్యుందాయ్ 2013 లో మొదటి ఎన్‌లైన్ సిరీస్ కారును ప్రవేశపెట్టింది. ఇప్పుడు కంపెనీ ఎన్‌లైన్ సిరీస్‌లో మొత్తం 11 మోడళ్లను విక్రయిస్తోంది. హ్యుందాయ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్‌లైన్ బ్రాండ్ కింద 11 కార్లను విక్రయిస్తోంది. ఇందులో కోనా మరియు టక్సన్ ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి.

Hyundai కంపెనీ యొక్క ఎన్‌లైన్ బ్యాడ్జింగ్ పొందిన మొదటి మోడల్ Hyundai i20. ఇది అధికారిక N లోగోతో 2014 లో కాన్సెప్ట్ మోడల్‌గా ప్రవేశపెట్టబడింది. హ్యుందాయ్ ఐ 20 ఎన్‌లైన్ పరిమాణం మరియు ఫీచర్‌ల విషయంలో స్టాండర్డ్ ఐ 20 మోడల్‌తో సమానంగా ఉంటుంది.

కొత్త Hyundai i20 N Line కొలతల విషయానికి వస్తే, ఇది 3,995 మిమీ పొడవు, 1,775 మిమీ వెడల్పు, 1,505 మిమీ ఎత్తు మరియు 2,580 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. కానీ విజువల్ అప్పీల్, పవర్, స్టీరింగ్ కంట్రోల్స్ మరియు సస్పెన్షన్ వంటివి స్టాండర్డ్ ఐ20 మరియు i20 N Line మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది.

Hyundai i20 N Line టైటాన్ గ్రే, ఫియరీ రెడ్, థండర్ బ్లూ, పోలార్ వైట్ అనే నాలుగు సింగిల్ టోన్ కలర్స్ మరియు రెండు డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్‌తో పాటు ఫైరీ రెడ్ మరియు సాకేత్ థండర్ బ్లూ అనే ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కావున ఇది వాహనదారులను మరింత ఆకర్షించడంలో సహాయపడుతుంది.

Hyundai i20 N Line యొక్క డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఇది దాదాపు దాని స్టాండర్డ్ మోడల్‌కి సమానమైన డిజైన్‌ను పొందుతుంది. కానీ ఇందులో డ్యూయల్ క్రోమ్ ఎగ్జాస్ట్, కొత్త అల్లాయ్ వీల్స్, రెడ్ యాక్సెంట్స్ తో కొత్త గ్రిల్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ లభిస్తాయి. ఇవన్నీ కారుకు మంచి స్పోర్టి లుక్ ఇస్తాయి.

Hyundai i20 N Line యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో సీట్లు బకెట్ స్టైల్‌లో ఉంచబడ్డాయి. అంతే కాకుండా ఎన్ బ్రాండ్ అపోల్స్ట్రే చాలా చోట్ల, స్పోర్టీ స్టీరింగ్ వీల్ మరియు క్యాబిన్‌లో చాలా చోట్ల, రెడ్ కలర్ హైలైట్‌లు స్పోర్టీ కోసం ఇవ్వబడ్డాయి. అయితే ఇందులోని క్యాబిన్ పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటుంది.

Hyundai i20 N Line లోపల 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇంద్దులో 7 స్పీకర్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 58 కనెక్ట్టెడ్ ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా సన్‌రూఫ్ కంట్రోల్ వంటివి కూడా ఉంటాయి. కావున ఈ మోడల్ వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Hyundai i20 N Line యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 120 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది N6 వేరియంట్‌లో 6 స్పీడ్ IMT గేర్‌బాక్స్ మరియు N8 వేరియంట్‌లో 6 స్పీడ్ IMT మరియు 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ కూడా కలిగి ఉంటుంది. ఐ20 ఎన్‌లైన్ DCT యూనిట్‌తో 20.25 కిమీ మరియు iMT తో 20 కిమీ మైలేజీని అందిస్తుందని హ్యుందాయ్ పేర్కొంది.

Hyundai i20 N Line లో సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హెడ్‌లైట్ యూనిట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

Hyundai i20 N Line లో సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హెడ్‌లైట్ యూనిట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








