Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అంతర్జాతీయ మార్కెట్లకు పయనమైన మేడ్ ఇన్ ఇండియా హ్యుందాయ్ ఐ20
హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 2020 హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ ఇప్పుడు భారతదేశం నుండి ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది.

పూర్తిగా భారతదేశంలోనే తయారైన ఈ మేడ్ ఇన్ ఇండియా హ్యుందాయ్ ఐ20 కారును దక్షిణాఫ్రికా, పెరూ, చిలీ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు కంపెనీ ఎగుమతి చేయటం ప్రారంభించింది. ఈ మోడల్ ఎగుమతుల ప్రారంభం గురించి హ్యుందాయ్ వ్యాఖ్యానిస్తూ, ఇది ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్' పట్ల తమ బ్రాండ్ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుందని కంపెనీ పేర్కొంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా తొలిసారిగా 2007లో ఐ20 హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను దేశీయ మార్కెట్లో ప్రారంభించింది. అప్పటి నుండి కంపెనీ ఈ మోడల్‌ను భారతదేశంలో తయారు చేసి, ఇక్కడి నుండి వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. గడచిన నవంబర్ 2020 వరకూ హ్యుందాయ్ ఇప్పటికే 5.16 లక్షల యూనిట్ల మునుపటి తరం ఐ20 కార్లను ఎగుమతి చేసింది.
MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతిదారుగా ఉన్న
హ్యుందాయ్, ఇటీవలే 30 లక్షల వాహనాలను ఎగుమతి చేసి సరికొత్త మైలురాయిని చేరుకుంది. హ్యుందాయ్ భారతదేశంలో తయారు చేసే వాహనాలను ప్రపంచవ్యాప్తంగా 88 దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఇక హ్యుందాయ్ అందిస్తున్న ఈ కొత్త తరం 2020 ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే, పూర్తిగా రిఫ్రెష్డ్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్, సరికొత్త ఫీచర్లు, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, శక్తివంతమైన మరియు మెరుగైన మైలేజీనిచ్చే ఇంజన్స్ వంటి లక్షణాలతో రూపుదిద్దుకున్న ఈ కారు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది.
MOST READ:భారత్‌లో లాంచ్ అయిన కవాసకి Z H2 & Z H2 SE బైక్‌లు : ధర & వివరాలు

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 మోడల్ మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ 35,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. నవంబర్ 5, 2020వ తేదీన ఈ కారును భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేశారు. ఇది భారత్‌లో మూడవ తరం ఐ20 మోడల్.

ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా మరియు ఆస్టా (ఆప్షనల్) అనే నాలుగు వేరియంట్లలో అందిస్తున్నారు. వీటి ధరలు రూ.6.79 లక్షల నుండి రూ.11.17 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. కొత్తగా ఈ కారును బుక్ చేసుకోవాలనుకునే వారు రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
MOST READ:లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

కొత్త హ్యుందాయ్ ఐ20 రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది. పెట్రోల్ ఇంజన్లలో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ యూనిట్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే, ఇందులో 1.5 లీటర్ డీజిల్ యూనిట్ కూడా అందుబాటులో ఉంది.

ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అదేవిధంగా, ఇందులోని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి లేదా 6-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇకపోతే, డీజిల్ వెర్షన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.
MOST READ:అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే

ఈ కారులో పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్, షార్ప్‌గా కనిపించే ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, జెడ్ ఆకారంలో ఉండే ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఫ్రంట్ బంపర్‌పై త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

అలాగే, దీని ఇంటీరియర్స్‌లోఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్పోర్టి స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ స్పీకర్లు, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.