హ్యుందాయ్ వెన్యూలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ వెన్యూలో కంపెనీ ఓ సరికొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ ఈ నెల ఆరంభంలో వెన్యూలో రెండు కొత్త వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో కొన్ని అప్‌డేట్స్ చేసినట్లు సమాచారం.

హ్యుందాయ్ వెన్యూలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్!

తాజా సమాచారం ప్రకారం, హ్యుందాయ్ వెన్యూలోని ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఫీచర్‌ను జోడించినట్లు తెలుస్తోంది. జూన్ 2021 తర్వాత తయారు చేసిన హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీలో ఈ ఫీచర్ జోడించినట్లు సమాచారం.

హ్యుందాయ్ వెన్యూలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్!

అంతేకాకుండా, హ్యుందాయ్ వెన్యూలో అందించే బ్లూ లింక్ కనెక్ట్ కార్ టెక్నాలజీని కూడా కంపెనీ అప్‌డేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో పాటుగా, హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని టైర్ ప్రెజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్)ను కూడా కంపెనీ మెరుగుపరిచింది.

హ్యుందాయ్ వెన్యూలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్!

కాకపోతే, హ్యుందాయ్ వెన్యూలో చేసిన ఈ అప్‌డేట్స్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో హ్యుందాయ్ వెన్యూ ఎస్ (ఓ) మరియు ఎస్ (ఓ) ఎగ్జిక్యూటివ్ అనే వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు కొత్త వేరియంట్ల రాకతో కంపెనీ ఇదివరకటి 6 వేరియంట్లను మార్కెట్లో నిలిపివేసింది.

హ్యుందాయ్ వెన్యూలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్!

కొత్తగా విడుదల చేసిన రెండు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. నిలిపివేసిన 6 వేరియంట్ల విషయానికి వస్తే, ఇందులో నాలుగు పెట్రోల్ ఇంజన్లు మరియు రెండు డీజిల్ ఇంజన్ వేరియంట్లు ఉన్నాయి. డీజిల్ వేరియంట్లలో 'ఈ' 1.5-లీటర్ డీజిల్ మాన్యువల్ మరియు 'ఎస్' 1.5-లీటర్ డీజిల్ మాన్యువల్ ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్!

పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో, 'ఎస్' 1.0-లీటర్ పెట్రోల్ ఎమ్‌టి, 'ఎస్' 1.0-లీటర్ పెట్రోల్ ఐఎమ్‌టి, 'ఎస్' 1.0-లీటర్ పెట్రోల్ డిసిటి మరియు ఎస్ఎక్స్ (ఓ) 1.0-పెట్రోల్ ఎమ్‌టి వేరియంట్లను నిలిపివేశారు. కొత్తగా జోడించిన వెన్యూ ఎస్ (ఓ) వేరియంట్‌ను 1.0-లీటర్ పెట్రోల్ ఎఎమ్‌టి మరియు డిసిటి మరియు 1.5-లీటర్ డీజిల్ మాన్యువల్‌తో అందిస్తున్నారు.

హ్యుందాయ్ వెన్యూలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్!

అలాగే, వెన్యూ ఎస్ (ఓ) ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను ఒకే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందిస్తున్నారు. హ్యుందాయ్ వెన్యూ ఎస్ఎక్స్ (ఓ) ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లో కొత్త డిజైన్‌తో కూడిన స్టీల్ వీల్స్ లభిస్తాయి, అంతకుముందు కంపెనీ అందులో అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేసేది. ఈ వేరియంట్ ధరను తగ్గించడానికే కంపెనీ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్‌లో సన్‌రూఫ్‌ను అలానే ఉంచారు.

హ్యుందాయ్ వెన్యూలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్!

హ్యుందాయ్ వెన్యూ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ కారు మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో విక్రయించబడుతోంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 82 బిహెచ్‌పి శక్తిని మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే అప్‌డేట్!

ఇకపోతే, రెండవ ఇంజన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 118 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక, మూడవది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 99 బిహెచ్‌పి శక్తిని మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

Most Read Articles

English summary
Hyundai India To Update Venue SUV With New Wireless Android Auto Connectivity Feature, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X