హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ గడచిన జనవరి నెలలో తమ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5' టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ కారును పూర్తిగా ఆవిష్కరించింది. హ్యుందాయ్ ఈ కారును తమ 1975 హ్యుందాయ్ పోనీ మోడల్‌కి అంకితం చేసింది.

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

హ్యుందాయ్ ఈ సరికొత్త అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును నెక్స్ట్ జనరేషన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసింది. ఇది ఈ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతున్న బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును అనేక రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌తో హ్యుందాయ్ పరిచయం చేసింది.

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

ఈ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో హైబ్రిడ్ ఇంజన్‌తో పాటు ఆల్ ఎలక్ట్రిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. హ్యుందాయ్ గడచిన 2019 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో అయానిక్ 5 కారును 45 కాన్సెప్ట్‌గా ప్రదర్శనకు ఉంచింది. బయటి వైపు నుండి ఈ కారు చాలా క్లీన్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

ఈ కారులో పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ విండ్‌షీల్డ్ ర్యాక్డ్ బ్లాక్ రూఫ్, సన్నటి బాక్స్ టైప్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, మినిమాలిస్టిక్ క్యారెక్టర్ లైన్స్, 20-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఛార్జింగ్ పోర్ట్ వెనుక వైపు ఉంటుంది మరియు ఇరువైపులా క్లామ్‌షెల్ ఆకారపు బోనెట్ ఉంటుంది.

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ రియర్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో బాక్స్ టైప్ స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ మరియు రియర్ బంపర్‌పై రిఫ్లెక్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

ఈ కారు కొలతలను గసమనిస్తే ఇది 4,635 మి.మీ పొడవు, 1,890 మి.మీ వెడల్పు, 1,605 మి.మీ ఎత్తు మరియు 3,000 మి.మీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని బూట్ స్పేస్ సామర్థ్యం 531 లీటర్లుగా ఉంటుంది. కావాలనుకుంటే, వెనుక సీట్లను ఫోల్డ్ చేసుకొని ఈ సామర్థ్యాన్ని 1,600 లీటర్లకు పెంచుకోవచ్చు.

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

ఇక ఈ కారు లోని ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇందులో స్లైడింగ్ ఫ్రంట్ సెంటర్ కన్సోల్, విశాలమైన క్యాబిన్ స్పేస్, ముందు మరియు వెనుక వరుసలలో రిక్లైనింగ్ సీట్స్, అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్స్, పైభాగంలో పూర్తి గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

అంతేకాకుండా, స్టీరింగ్ వెనుక భాగం నుండి డ్యాష్‌బోర్డ్ మధ్య వరకూ ఒకే ప్యానెల్‌లో రెండు 12 ఇంచ్ డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి. ఇందులో ఒకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కోసం కగా, మరొకటి కారులోని వివిధ ఫీచర్లను కంట్రోల్ చేయటానికి ఉపయోగిస్తారు.

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

ఈ ఎలక్ట్రిక్ కారుకు గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో 58 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మరియు సింగిల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఈ మోటార్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ; పూర్తి వివరాలు వెల్లడి

ఈ కారు 8.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదని కంపెనీ పేర్కొంది. ఇందులోని ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లో 161 బిహెచ్‌పి మోటారును దాని వెనుక యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది. ఈ రెండు మోటార్లు గరిష్టంగా 232 బిహెచ్‌పి శక్తిని, 605 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట రేంజ్ 480 కిలోమీటర్లు.

Most Read Articles

English summary
Hyundai Ioniq 5 Electric Car Unveiled; Features, Range And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X