5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. 'హ్యుందాయ్ అయానిక్ 5' పేరుతో కంపెనీ ఓ కొత్త ఎలక్ట్రిక్ సియూవీ (క్రాసోవర్ యుటిలిటీ వెహికల్) టీజర్‌ను ఆవిష్కరించింది. ఇది హ్యుందాయ్ నుండి వస్తున్న రెండవ ఆల్-ఎలక్ట్రిక్ కార్.

5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

హ్యుందాయ్ ఇప్పటికే మార్కెట్లో 'కోనా' అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఇది హ్యుందాయ్ నుండి వచ్చిన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు. ఆ తర్వాత హ్యుందాయ్ డెడికేటెడ్ బిఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) లైనప్ నుండి వస్తున్న మొదట్టమొదటి మరియు బ్రాండ్ యొక్క రెండవ ఆల్-ఎలక్ట్రిక్ కార్ ఈ కొత్త 2021 హ్యుందాయ్ అయానిక్ 5.

5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

హ్యుందాయ్ తమ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ అయానిక్ 5 మోడల్‌ను భారత కార్ మార్కెట్లోని మిడ్-సైజ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

MOST READ:డోనాల్డ్ ట్రంప్ వాడిన కారు వేలంలో పాల్గొంటున్న ఇండియన్, ఎవరో తెలుసా ?

5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

హ్యుందాయ్ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారును నెక్స్ట్ జనరేషన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనుంది. ఇది ఈ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతున్న బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తులో హ్యుందాయ్ నుండి మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు వచ్చే అవకాశం ఉంది.

5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

హ్యుందాయ్ అయానిక్ 5 విషయానికి వస్తే, ప్రస్తుతానికి ఈ కారుకి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేకపోయినప్పటికీ, టీజర్ ఆధారంగా కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు పేరులో ఓ ప్రత్యేకత దాగి ఉంది. అయానిక్ 5 కారు కేవలం 5 నిమిషాల చార్జ్‌తో 100 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

MOST READ:పేస్ మాస్క్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ

ఈ టీజర్ వీడియోలో కూడా హ్యుందాయ్ అదే విషయాన్ని హైలైట్ చేసింది. ఇందులో '5 మినిట్ ఛాలెంజ్' పేరుతో ఈ ఫీచర్ గురించి టీజ్ చేశారు. హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారులో 3.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించవచ్చని తెలుస్తోంది. పూర్తి చార్జ్‌పై ఈ బ్యాటరీ 450 కిలోమీటర్ల సుధీర్ఘమైన డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం.

5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

అయానిక్ 5 ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రెండు యాక్సిళ్లలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా సుమారు 309 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇది 5 సెకన్లలోనే గరిష్టంగా గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

MOST READ:నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

హ్యుందాయ్ అయానిక్ 5 మెరుగైన రేంజ్ మరియు సాటిలేని పవర్‌ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. కొత్త మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతున్న ఈ ఎలక్ట్రిక్ కారు విషయంలో ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్పేసియస్ ఇంటీరియర్స్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కంపెనీ తెలిపింది.

5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

హ్యుందాయ్ అయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును ఫిబ్రవరి 2021లో జరగనున్న వర్చువల్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నారు. హ్యుందాయ్ తన భవిష్యత్ ప్రణాళికలో భాగంగా, 2022లో అయానిక్ 6 మరియు 2023లో అయానిక్ 7 కార్లను కూడా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.

MOST READ:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

కాగా, హ్యుందాయ్ 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో 10 శాతం వాటాను దక్కించుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Most Read Articles

English summary
Hyundai Ioniq 5 Electric Car Teaser Released, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X