అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా గడచిన అక్టోబర్ 2021 నెల అమ్మకాల వివరాలను విడుదల చేసింది. అక్టోబర్ 2020తో పోలిస్తే, గత నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు 36.7 శాతం క్షీణతను నమోదు చేశాయి. అక్టోబర్ 2021లో హ్యుందాయ్ మొత్తం 43,556 యూనిట్లను విక్రయించగా, అక్టోబర్ 2020 నెలలో 68,835 యూనిట్లను విక్రయించింది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

ఈ సమయంలో, ఏడాది ప్రాతిపదికన (YoY) దేశీయ మార్కెట్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) అమ్మకాలు 56,605 యూనిట్ల నుండి 37,021 యూనిట్లకు పడిపోయి 34.6 శాతం క్షీణతను నమోదు చేశాయి. కాగా, ఇదే సమయంలో హ్యుందాయ్ కార్ల ఎగుమతులు 12,230 యూనిట్ల నుండి 6,535 యూనిట్లకు పడిపోయి 46.6 శాతం క్షీణతను నమోదు చేశాయి.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

అక్టోబర్ 2021 నెలలో హ్యుందాయ్ మోడల్ వారీగా విక్రయాలను గమనిస్తే, వీటిలో చాలా వరకు హ్యుందాయ్ మోడళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టగా, కొన్ని మోడళ్ల విక్రయాలు మాత్రం పెరిగాయి. అదే సమయంలో, హ్యుందాయ్ ఎలాంట్రా సెడాన్ మరియు హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్లు చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. గత నెలలో మోడల్ వారీగా హ్యుందాయ్ కార్ల వివరాలు ఇలా ఉన్నాయి:

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

గత నెలలో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) అమ్మకాలు 6,455 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, అక్టోబర్ 2020లో విక్రయించిన 14,023 యూనిట్లతో గత నెలలో క్రెటా అమ్మకాలు 54 శాతం క్షీణతను నమోదు చేశాయి. అలాగే, సెప్టెంబర్ 2021లో విక్రయించిన 8,193 యూనిట్లతో పోలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు 21 శాతం తగ్గాయి. గతేడాది ఆరంభంలో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి క్రెటా అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో కోవిడ్-19 సంక్షోభం మరియు ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా క్రెటా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా తర్వాతి స్థానంలో హ్యుందాయ్ ఐ10 (Hyundai i10) హ్యాచ్‌బ్యాక్ ఉంది. గడచిన అక్టోబర్ 2020 నెలలో ఐ10 విక్రయాలు 6042 యూనిట్లుగా ఉన్నాయి. అక్టోబర్ 2020 నెలలో విక్రయించిన 14,003 యూనిట్లతో పోలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు 57 శాతం తగ్గగా, సెప్టెంబర్ 2021లో విక్రయించిన 4,168 యూనిట్లతో పోలిస్తే 45 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. ఈ మోడల్ లో కూడా కంపెనీ గతేడాది ఓ కొత్త వెర్షన్ ను ప్రవేశపెట్టింది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 ఎలైట్ (Hyundai i20 Elite) విషయానికి వస్తే, గత నెలలో కంపెనీ మొత్తం 4,414 యూనిట్లను విక్రయించింది. అక్టోబర్ 2020లో విక్రయించిన 5,153 యూనిట్లతో పోలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు 14 శాతం క్షీణించాయి. హ్యుందాయ్ గతేడాది అక్టోబర్ నెలలో హ్యుందాయ్ తమ కొత్త తరం ఐ20 ఎలైట్ కారును మార్కెట్లో విడుదల చేసింది. రిఫ్రెష్డ్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ ఈ కారును ప్రవేశపెట్టింది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

ఈ సమయంలో హ్యుందాయ్ అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ (Hyundai Venue) అమ్మకాలు మాత్రం పెరిగాయి. అక్టోబర్ 2020తో విక్రయించిన 8,828 యూనిట్లతో పోలిస్తే, అక్టోబర్ 2021 నెలలో హ్యుందాయ్ మొత్తం 10,554 యూనిట్ల వెన్యూ ఎస్‌యూవీలను విక్రయించింది. ఈ సమయంలో వెన్యూ అమ్మకాలు 20 శాతం పెరిగాయి.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) అమ్మకాలను గమనిస్తే, అక్టోబర్ 2020 మరియు సెప్టెంబర్ 2021 నెలలతో పోలిస్తే గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు వరుసగా 52 శాతం మరియు 6 శాతం తగ్గుదల నమోదు చేశాయి. అక్టోబర్‌ 2021లో ఈ మోడల్ అమ్మకాలు 2701 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ అల్కాజార్ (Hyundai Alcazar) ప్రీమియం ఎస్‌యూవీ నుండి మంచి ఆదరణ పొందుతోంది, ఇది ఈ విభాగంలో మంచి పనితీరు కనబరుస్తోంది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

గడచిన అక్టోబర్ 2020 నెలలో, హ్యుందాయ్ అల్కజార్ అమ్మకాలు 1392 యూనిట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 2021లో విక్రయించిన 1929 యూనిట్లతో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 28 శాతం తగ్గాయి. హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) అమ్మకాలను గమనిస్తే, అక్టోబర్ 2020లో విక్రయించిన 2166 యూనిట్లతో పోలిస్తే, అక్టోబర్ 202లో ఈ మోడల్ అమ్మకాలు 2438 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఇవి 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ క్రెటా (Creta) కన్నా వెన్యూ (Venue) ఎస్‌యూవీనే ఎక్కువగా కొన్నారు..!

ఇదే సమయంలో, హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ కారు శాంత్రో అమ్మకాలు సెప్టెంబర్‌ 2021లో విక్రయించిన 879 యూనిట్లతో పోలిస్తే అక్టోబర్ 2021లో 177 శాతం పెరిగాయి. అక్టోబర్ 2021లో మొత్తం 2877 యూనిట్ల శాంత్రో కార్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్ 2021 నెలలో టక్సన్, కోన మరియు ఎలంట్రా అమ్మకాలు వరుసగా 119 యూనిట్లు, 18 యూనిట్లు మరియు 11 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే కోన మినహా మిగిలిన రెండింటి విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hyundai model wise sales report in october 2021 creta i10 i20 venue details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X