అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ (Hyundai), భారత మార్కెట్లో గడచిన అక్టోబర్ 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్ 2020 తో పోల్చుకుంటే, గత నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు భారీగా తగ్గాయి. అక్టోబర్ 2020 లో హ్యుందాయ్ భారత మార్కెట్లో మొత్తం 56,605 కార్లను విక్రయించగా, అక్టోబర్ 2021 లో 37,021 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ సమయంలో హ్యుందాయ్ అమ్మకాలు 34.6 శాతం క్షీణతను నమోదు చేశాయి.

అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కుంటున్న సెమీకండక్టర్ కొరత సమస్య కారణంగా, కంపెనీ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. కాగా, గత నెలలో హ్యుందాయ్ నుండి అత్యధికంగా అమ్ముడైన కారుగా వెన్యూ (Venue) ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ 2020 లో హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు 8,828 యూనిట్లుగా ఉంటే, అక్టోబర్ 2021 లో ఇవి 10,554 యూనిట్లకు పెరిగి 20 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ క్రెటా. అక్టోబర్ 2020 లో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) అమ్మకాలు 14,023 యూనిట్లుగా ఉంటే, అవి అక్టోబర్ 2021 లో 6,455 యూనిట్లకు పడిపోయాయి. ఈ సమయంలో క్రెటా అమ్మకాలు 54 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. హ్యుందాయ్ తాజాగా 2022 క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ఇండోనేషియా మార్కెట్లో ఆవిష్కరించింది. వచ్చే ఏడాది ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ అందిస్తున్న చిన్న కారు గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios) ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. గత అక్టోబర్ 2020 లో ఈ కారు విక్రయాలు 14,003 యూనిట్లుగా ఉంటే, అవి అక్టోబర్‌ 2021 లో 6,042 యూనిట్లకు తగ్గాయి. ఈ సమయంలో గ్రాండ్ ఐ10 నియోస్ అమ్మకాలు 57 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది హ్యుందాయ్ ఐ20 (Hyundiai i20) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్.

అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

అక్టోబర్ 2020 లో హ్యుందాయ్ ఐ20 అమ్మకాలు 8,399 యూనిట్లుగా ఉంటే, అక్టోబర్ 2021 లో 4,414 యూనిట్లకు పడిపోయి 47 శాతం క్షీణతను నమోదు చేసింది. హ్యుందాయ్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ శాంత్రో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. అక్టోబర్ 2020 లో మొత్తం 3,463 శాంత్రో కార్లు అమ్ముడుపోగా, అక్టోబర్‌ 2021 లో అవి 2,877 యూనిట్లకు పడిపోయాయి. ఈ సమయంలో హ్యుందాయ్ శాంత్రో (Hyundiai Santro) అమ్మకాలు 17 శాతం తగ్గుదలను నమోదు చేశాయి.

అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

గత నెలలో హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ హ్యుందాయ్ ఆరా (Hyundiai Aura) భారీగా క్షీణించాయి. అక్టోబర్ 2020 లో 5,577 యూనిట్లుగా ఉన్న హ్యుందాయ్ ఆరా అమ్మకాలు అక్టోబర్ 2021 లో 2,701 యూనిట్లకు తగ్గాయి. ఈ సమయంలో హ్యుందాయ్ ఆరా అమ్మకాలు 72 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ వెర్నా (Hyundiai Verna) ఏడవ స్థానంలో ఉంది.

అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

అక్టోబర్ 2020 తో పోలిస్తే, గత నెలలో హ్యుందాయ్ వెర్నా అమ్మకాలు 2,166 యూనిట్ల నుండి 2,438 యూనిట్లకు పెరిగి, 13 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఈ జాబితాలో హ్యుందాయ్ అల్కాజర్ (Hyundiai AlcazaR) ఎనిమిదవ స్థానంలో ఉంది. హ్యుందాయ్ ఈ ఏడాది అక్టోబర్‌ 2021 నెలలో మొత్తం 1,392 ఆల్కజార్ కార్లను విక్రయించింది. ఇది ఈ ఏడాదే మార్కెట్లోకి వచ్చిన కారు కాబట్టి, దీనిని గతేడాది అమ్మకాలతో పోల్చలేము.

అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ టక్సన్ (Hyundiai Tucson) గత నెలలో అమ్మకాల పరంగా 9వ స్థానంలో నిలిచింది. అక్టోబర్ 2020 లో కేవలం 87 యూనిట్ల టక్సన్ ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించిన హ్యుందాయ్ గత నెలలో మొత్తం 119 కార్లను విక్రియంచింది. ఈ సమయంలో హ్యుందాయ్ టక్సన్ అమ్మకాలు 37 శాతం పెరిగాయి.

అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు కోన (Hyundiai Kona) అమ్మకాలు గత నెలలో 18 యూనిట్లుగా నమోదు కాగా, అక్టోబర్ 2020లో ఇవి 13 యూనిట్లుగా ఉన్నాయి. ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచిన హ్యుందాయ్ కోన ఈ సమయంలో 38 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ నుండి లభిస్తున్న 11 కారు మరియు ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది హ్యుందాయ్ ఎలాంట్రా ప్రీమియం సెడాన్.

అక్టోబర్ 2021 లో Hyundai మోడల్ వారీ అమ్మకాలు; అగ్రస్థానంలో Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

గత అక్టోబర్ 2020 లో హ్యుందాయ్ (Hyundiai Elantra) అమ్మకాలు 46 యూనిట్లుగా ఉంటే, గత నెలలో అవి 11 యూనిట్లకు పడిపోయి 76 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. ఓవరాల్‌ గా చూస్తే, గత నెలలో వెన్యూ, వెర్నా, టక్సన్ మరియు కోన వాహనాలను మినహా, మిగిలిన అన్ని హ్యుందాయ్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. హ్యుందాయ్ అమ్మకాల తగ్గుదలకు ప్రధాన కారణం, దేశంలో సెమీకండక్టర్ చిప్ ల కొరతగా భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Hyundai model wise sales report in october 2021 venue compact suv tops the list details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X