భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ శాంత్రో, ఔరా, వెన్యూ, క్రెటా, వెర్నా మరియు టక్సన్ వంటి మోడళ్ల ధరలు భారీగా పెరిగాయి.

భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుంది. తాజాగా, హ్యుందాయ్ తమ కార్ల ధరలను కనిష్టంగా రూ.1,200 నుండి గరిష్టంగా రూ.34,000 వరకూ పెంచింది. హ్యుందాయ్ ప్రోడక్ట్ లైనప్‌లో అత్యధికంగా టక్సన్ ఎస్‌యూవీ ధరలు పెరిగాయి.

భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

పెరిగిన కొత్త ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. హ్యుందాయ్ యొక్క ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రో కారు ధరలు రూ.6,200 మేర పెరిగాయి. ఇందులో స్పోర్ట్జ్ ఏఎమ్‌టి వేరియంట్ ధర రూ.1500 మేర పెరిగింది.

MOST READ:సన్నీ లియోన్ కేరళ కార్ డ్రైవింగ్‌లో ఎదురైన చేదు అనుభవం.. కారణం ఇదే

భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వేరియంట్ లైనప్‌లో స్పోర్ట్జ్ టర్బో వేరియంట్ ధరను రూ.1,200 మేర పెంచగా, దాని ఏఎమ్‌టి మరియు సిఎన్‌జి వేరియంట్ల ధరలను రూ.5,200 మేర పెంచారు. ఇక ఇందులోని ఇతర వేరియంట్ల ధరలను రూ.4,200 మేర పెంచారు.

భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

హ్యుందాయ్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ వెర్నా యొక్క టర్బో మరియు డీజిల్ వేరియంట్ల ధరనుల రూ.5,700 మేర పెంచారు. మిగిలిన పెట్రోల్ వేరియంట్ల ధరలను రూ.8,700 మేర పెంచారు. హ్యుందాయ్ వెర్నా ఈ విభాగంలో మంచి ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఒకటిగా ఉంది.

MOST READ:కోవిడ్-19 పేషెంట్ల కోసం రైలునే ఆస్పత్రిగా మార్చారు: ఆక్సిజెన్ కూడా ఉంది!

భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

హ్యుందాయ్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ ఆరా యొక్క పెట్రోల్ వేరియంట్ ధరను రూ.5,200 మేర మరియు డీజిల్ వేరియంట్ ధరలను రూ.1,200 మేర పెంచారు. ఇందులో సిఎన్‌జి వెర్షన్ ఆరా వేరియంట్ ధరలను రూ.8,200 మేర పెంచారు.

భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ అలాంట్రా 2.0 ఎస్ఎక్స్ (ఆప్షనల్) వేరియంట్ ధరను రూ.15,000 మేర పెంచారు. అదే సమయంలో, ఈ మోడల్‌లోని ఇతర వేరియంట్ల ధరలను రూ.2,000 మేర పెంచారు.

MOST READ:కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

హ్యుందాయ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టక్సన్‌లో జిఎల్ (ఓ) 2 వీల్‌డ్రైవ్ ఆటోమేటిక్ పెట్రోల్, జిఎల్ (ఓ) 2 వీల్‌డ్రైవ్ ఆటోమేటిక్ డీజిల్ మరియు జిఎల్‌ఎస్ 4 వీల్‌డ్రైవ్ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ల ధరలను రూ.2,000 పెంచారు.

భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

కాగా హ్యుందాయ్ టక్సన్ జిఎల్‌ఎస్ 2 వీల్‌డ్రైవ్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ధరను రూ.34,000 మేర పెంచారు. కంపెనీ యొక్క మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా ధరలను రూ.19,600 వరకు పెంచారు. కొత్త తరం హ్యుందాయ్ ఐ20 ధరల్లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు.

MOST READ:కరోనా కాటుకు బలైపోయిన మహిళను బైక్‌పై తరలించిన హృదయ విషాద గాథ.. ఎక్కడంటే?

భారీగా పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు: శాంత్రో, ఆరా, వెన్యూ, వెర్నా..

హ్యుందాయ్ యొక్క కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ ఈ 1.2 పెట్రోల్ వేరియంట్ ధరను రూ.5,400 మేర, ఎస్ఎక్స్ 1.0 టర్బో వేరియంట్ ధరను రూ.2,590 మేర మరియు స్పోర్ట్ ఎస్ఎక్స్ 1.0 టర్బో ఐఎమ్‌టి వేరియంట్ ధరను రూ.1,400 మేర పెంచారు. ఇందులో ఇతర వేరియంట్ల ధరను రూ.9,900 మేర పెంచారు.

Most Read Articles

English summary
Hyundai Motor India Increased Car Prices Upto Rs 34,000, Details. Read in Telugu.Hyundai Motor India Increased Car Prices Upto Rs 34,000, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X