రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి కార్ల ధరలు రూ.600 నుండి రూ.45,000 మేర పెరిగాయి.

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు కంపెనీ తమ అన్ని కార్ల కొత్త ధరలను అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అప్‌డేట్ చేసింది.

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

ప్రస్తుతం హ్యుందాయ్ భారత మార్కెట్లో శాంత్రో, గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా, వెన్యూ, వెర్నా, క్రెటా, ఎలాంట్రా మరియు టూసాన్ మోడళ్లను విక్రయిస్తోంది. కాగా, హ్యుందాయ్ శాంత్రో అత్యల్పంగా రూ.600 ధర పెంపును అందుకోగా, ఎలాంట్రా సెడాన్‌పై అత్యధికంగా రూ.45,000 మేర ధరలు పెరిగాయి.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రో కారు ధరలు రూ.600 నుండి రూ.4,900 మేర పెరిగాయి. తాజా పెంపు తర్వాత మార్కెట్లో ఈ కారు ధరలు రూ.4.67 లక్షల నుండి రూ.6.53 లక్షల మధ్యలో ఉన్నాయి.

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు ధరలు రూ.2,900 నుండి రూ.7,390 మేర పెరిగాయి. తాజా పెంపు తర్వాత మార్కెట్లో ఈ కారు ధరలు రూ.5.19 లక్షల నుండి రూ.8.41 లక్షల మధ్యలో ఉన్నాయి.

MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ ఔరా కారు ధరలు రూ.2,200 నుండి రూ.9,800 మేర పెరిగాయి. తాజా పెంపు తర్వాత మార్కెట్లో ఈ కారు ధరలు రూ.5.92 లక్షల నుండి రూ.9.32 లక్షల మధ్యలో ఉన్నాయి.

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ ధరలు రూ.1,760 నుండి రూ.12,400 మేర పెరిగాయి. తాజా పెంపు తర్వాత మార్కెట్లో ఈ కారు ధరలు రూ.6.86 లక్షల నుండి రూ.11.67 లక్షల మధ్యలో ఉన్నాయి.

Model Pre-Hike Price New Price Hike
Santro ₹4.63 Lakh to ₹6.31 Lakh ₹4.67 Lakh to ₹6.53 Lakh ₹600 to ₹4,900
Grand i10 NIOS ₹5.12 Lakh to ₹8.35 Lakh ₹5.19 Lakh to ₹8.41 Lakh ₹2,900 to ₹7,390
Aura ₹5.85 Lakh to ₹9.28 Lakh ₹5.92 Lakh to ₹9.32 Lakh ₹2,200 to ₹9,800
Venue ₹6.75 Lakh to ₹11.65 Lakh ₹6.86 Lakh to ₹11.67 Lakh ₹1,760 to ₹12,400
Verna ₹9.02 Lakh to ₹15.17 Lakh ₹9.11 Lakh to ₹15.20 Lakh ₹2,700 to ₹12,100
Creta ₹9.81 Lakh to ₹17.31 Lakh ₹9.11 Lakh to ₹15.20 Lakh ₹17,000 to ₹31,000
Elantra ₹17.60 Lakh to ₹20.65 Lakh ₹9.11 Lakh to ₹15.20 Lakh ₹15,000 to ₹45,000
Tucson ₹22.30 Lakh to ₹27.03 Lakh ₹22.55 Lakh to ₹27.33 Lakh ₹31,000 to ₹39,000

MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

హ్యుందాయ్ అందిస్తున్న వెర్నా ప్రీమియం సెడాన్ ధరలు రూ.2,700 నుండి రూ.12,100 మేర పెరిగాయి. తాజా పెంపు తర్వాత మార్కెట్లో ఈ కారు ధరలు రూ.9.11 లక్షల నుండి రూ.15.20 లక్షల మధ్యలో ఉన్నాయి.

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా ధరలు రూ.17,000 నుండి రూ.31,000 మేర పెరిగాయి. తాజా పెంపు తర్వాత మార్కెట్లో ఈ కారు ధరలు రూ.10 లక్షల నుండి రూ.17.54 లక్షల మధ్యలో ఉన్నాయి.

MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

హ్యుందాయ్ విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ ఎలాంట్రా ధరలు రూ.15,000 నుండి రూ.45,000 మేర పెరిగాయి. తాజా పెంపు తర్వాత మార్కెట్లో ఈ కారు ధరలు రూ.17.80 లక్షల నుండి రూ.21.10 లక్షల మధ్యలో ఉన్నాయి.

రూ.45,000 మేర పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, కొత్త ధరల జాబితా

హ్యుందాయ్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టూసాన్ ధరలు రూ.31,000 నుండి రూ.39,000 మేర పెరిగాయి. తాజా పెంపు తర్వాత మార్కెట్లో ఈ కారు ధరలు రూ.22.55 లక్షల నుండి రూ.27.33 లక్షల మధ్యలో ఉన్నాయి.

(పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Hyundai Motor India Increases Its Car Price Upto Rs 45,000. Model Wise Price Hike Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X