అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ, భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ మేకర్ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) గడచిన అక్టోబర్ 2021 నెల విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, హ్యుందాయ్ గత నెలలో మొత్తం 43,556 యూనిట్ల కార్లను విక్రయించింది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

కాగా, గతేడాది ఇదే సమయంలో (అక్టోబర్ 2020 నెలలో) హ్యుందాయ్ అమ్మకాలు 68,835 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో హ్యుందాయ్ అమ్మకాలు 36.7 శాతం క్షీణించాయి. కేవలం దేశీయ విక్రయాలనే పరిగణలోకి తీసుకుంటే, గత నెలలో (అక్టోబర్ 2021లో) హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు 37,021 యూనిట్లుగా ఉన్నాయి.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

అక్టోబర్ 2020 నెలలో హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 56,605 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో దేశీయ అమ్మకాలు కూడా 34.6 శాతం క్షీణించాయి. ఇక కార్ల ఎగుమతుల విషయానికి వస్తే, ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో, కంపెనీ మొత్తం 6,535 యూనిట్ల కార్లను భారత మార్కెట్ నుండి ఎగుమతి చేయగా, గత సంవత్సరం అక్టోబర్ నెలలో, మొత్తం 12,230 యూనిట్ల కార్లను ఎగుమతి చేసింది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

ఈ సమయంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎగుమతులు కూడా 46.6 శాతం క్షీణించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కొరత సమస్య కారణంగా గత నెలలో అమ్మకాలు క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ సమస్య కేవలం భారతీయ ఆటో పరిశ్రమనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆటో రంగాన్ని ప్రభావితం చేస్తోంది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

హ్యుందాయ్ మోటార్ ఇండియా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కంపెనీ ఈ గ్లోబల్ సెమీకండక్టర్ చిప్స్ కొరత గురించి సమాచారం ఇచ్చింది. హ్యుందాయ్ ఈ విషయంపై.. "గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా పరిమితులు ఒక సవాలుగా మిగిలిపోయాయి, ఫలితంగా పరిశ్రమ అంతటా ఉత్పత్తి తగ్గింది" అని కంపెనీ పేర్కొంది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

గడచిన అక్టోబర్ 2021 నెలలోనే కాకుండా సెప్టెంబర్ 2021 నెలలో కూడా హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 2021లో హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో 33,087 యూనిట్ల కార్లను విక్రయించగా, గత ఏడాది సెప్టెంబర్ నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 50,313 యూనిట్ల కార్లను విక్రయించింది ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా కంపెనీ అమ్మకాలు 34.2 శాతం క్షీణతను నమోదు చేశాయి.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

అయితే, సెప్టెంబర్ 2021 నెలలో కంపెనీ ఎగుమతులు మాత్రం వృద్ధిని కనబరిచాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా గత సెప్టెంబర్ నెలలో మొత్తం 12,704 యూనిట్ల కార్లను భారత్ నుండి విదేశాలకు ఎగుమతి చేసింది. అయితే, గత సంవత్సరం ఇదే సమయంలో (సెప్టెంబర్ 2020 నెలలో) కంపెనీ మొత్తం ఎగుమతులు 9,600 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో హ్యుందాయ్ కార్ల ఎగుమతులు 32.3 శాతం పెరిగాయి.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

కొత్త 2022 Hyundai Creta ఆవిష్కరణ..

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఆవిష్కరించింది. ఈ అప్‌డేటెడ్ మోడల్ ముందుగా యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్లలో కంపెనీ మార్పులు చేర్పులు చేసింది. హ్యుందాయ్ యొక్క సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ ఆకారాన్ని మరియు పరిమాణాన్ని రీడిజైన్ చేయడం వలన ఇప్పుడు ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది హ్యుందాయ్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన అల్కాజార్‌ ఎస్‌యూవీలా కనిపిస్తుంది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

అలాగే, ఫ్రంట్ బంపర్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్ లను కూడా రీడిజైన్ చేశారు. మొత్తంగా చూస్తే, హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు మునుపటి కన్నా మరింత అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సైడ్ ప్రొఫైల్ లో మాత్రం పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది. అయితే, ఇందులో కొత్త అల్లాయ్ వీల్స్‌ డిజైన్ ని మాత్రం ఆశించవచ్చు. వెనుక బంపర్ మరియు టెయిల్‌గేట్ కూడా రీడిజైన్ చేశారు.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

అయితే, కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా లోపలి భాగంలో పెద్దగా మార్పులు చేయనట్లు తెలుస్తోంది. ఇది మునుపటి మాదిరిగానే ఆల్-బ్లాక్ క్యాబిన్ థీమ్ తో కానీ లేదా బ్లాక్ అండ్ బ్రౌన్ థీమ్‌ లో కానీ అందించబడుతుంది. కంపెనీ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన 7-సీటర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కజార్ లో కూడా ఇదే ఇంటీరియర్ స్టైల్ కనిపిస్తుంది.

అక్టోబర్ 2021లో హ్యుందాయ్ సేల్స్ డౌన్.. ఆదుకోవడానికి కొత్త 2022 క్రెటా వస్తుందా..?

గతేడాది ఆరంభంలో హ్యుందాయ్ తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2020 క్రెటాను మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి క్రెటా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ సెగ్మెంట్లోకి కొత్తగా వచ్చిన స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్ల కారణంగా క్రెటా అమ్మకాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ తమ క్రెటాకు వచ్చే ఏడాది ఆరంభంలో ఫేస్‌లిఫ్ట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Hyundai motor india october 2021 sales down by 37 percent details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X