నవంబర్ నెలలోనూ అదే తీరు.. కలిసిరాని పండుగల జోరు..

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) గత నవంబర్ 2021 విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, గడచిన నెలలో కంపెనీ మొత్తం 46,910 యూనిట్ల కార్లను విక్రయించింది. కాగా, గతేడాది ఇదే సమయంలో (నవంబర్ 2020 లో) హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాల సంఖ్య 59,200 యూనిట్లుగా నమోదైంది. ఈ సమయంలో హ్యుందాయ్ కార్ల విక్రయాలు 21 శాతం క్షీణించాయి.

నవంబర్ నెలలోనూ అదే తీరు.. కలిసిరాని పండుగల జోరు..

ఈ సమయంలో, హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు కూడా క్షీణించాయని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది. నవంబర్ 2021 నెలలో హ్యుందాయ్ దేశీయ మార్కెట్‌లో మొత్తం 37,001 యూనిట్లను విక్రయించగా, నవంబర్ 2020 నెలలో 48,800 యూనిట్ల కార్లను విక్రయించింది. గతేడాదితో పోల్చుకుంటే, హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విక్రయాలు కూడా 24 శాతం క్షీణతను నమోదు చేశాయి.

నవంబర్ నెలలోనూ అదే తీరు.. కలిసిరాని పండుగల జోరు..

ఇక ఎగుమతుల విషయానికి వస్తే, హ్యుందాయ్ మోటార్ ఇండియా గత నవంబర్ 2021 నెలలో మొత్తం 9,999 యూనిట్ల కార్లను భారతదేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. గత సంవత్సరం నవంబర్ నెలలో మొత్తం ఎగుమతులు 10,400 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు కూడా 5 శాతం క్షీణించాయి. విక్రయాలు క్షీణించడంపై హ్యుందాయ్ మోటార్ ఇండియా వ్యాఖ్యానిస్తూ, ప్రస్తుత సెమీకండక్టర్ చిప్స్ కొరత నవంబర్‌ 2021 నెల అమ్మకాలపై ప్రభావం చూపిందని పేర్కొంది.

నవంబర్ నెలలోనూ అదే తీరు.. కలిసిరాని పండుగల జోరు..

ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత మెరుగుపడే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే, హ్యుందాయ్ ఈ ఏడాది జూన్‌లో తన భారత ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో హ్యుందాయ్ అల్కాజార్ (Hyundai Alcazar) అనే ఫుల్-సైజ్ 7-సీటర్ ఎస్‌యూవీని విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో 4 కొత్త టాప్-ఎండ్ వేరియంట్ లను ప్రవేశపెట్టింది.

నవంబర్ నెలలోనూ అదే తీరు.. కలిసిరాని పండుగల జోరు..

ఈ కొత్త వేరియంట్ లను టాప్-స్పెక్ 7-సీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఆటోమేటిక్ ఆప్షన్ లతో లభ్యం కానున్నాయి. హ్యుందాయ్ అల్కాజర్ ను తొలిసారిగా మార్కెట్లో లాంచ్ చేసినప్పుడు, కంపెనీ ఈ వేరియంట్‌లను ప్రారంభించలేదు. ఈ కొత్త హ్యుందాయ్ ఆల్కాజర్ ఎస్‌యూవీ యొక్క సిగ్నేచర్ (ఆప్షనల్) 7-సీటర్ ఆటోమేటిక్ వేరియంట్‌ల ధరలు రూ. 19.41 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.19.85 లక్షల మధ్యలో ఉన్నాయి. కంపెనీ ఈ వేరియంట్ లను ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో ప్రవేశపెట్టింది.

నవంబర్ నెలలోనూ అదే తీరు.. కలిసిరాని పండుగల జోరు..

ఈ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టడంతో పాటు కంపెనీ హ్యుందాయ్ అల్కాజార్ యొక్క ఎంట్రీ-లెవల్ వేరియంట్లు అయిన ప్రెస్టీజ్ మరియు ప్రెస్టీజ్ (ఆప్షనల్) అనే సిక్స్-సీటర్ పెట్రోల్ వేరియంట్‌లను నిలిపివేసింది. ఇవి రెండూ వరుసగా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడ్డాయి. అయితే, కంపెనీ ఇప్పుడు నాలుగు కొత్త సెవెన్-సీటర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లను ప్రారంభించింది, ఇవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్నాయి. అవి ప్లాటినం (ఆప్షనల్) మరియు సిగ్నేచర్ (ఆప్షనల్) ట్రిమ్‌లలో ప్రవేశపెట్టబడ్డాయి.

నవంబర్ నెలలోనూ అదే తీరు.. కలిసిరాని పండుగల జోరు..

హ్యుందాయ్ అల్కజార్ ఇంజన్ ఆప్షన్ల విషయానికి వల్తే, ఇది 2.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ 157 బిహెచ్‌పి పవర్ మరియు 191 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇకపోతే, డీజిల్ ఇంజన్ 113 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ మరియు 6 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లను కలిగి ఉంటాయి.

నవంబర్ నెలలోనూ అదే తీరు.. కలిసిరాని పండుగల జోరు..

ఫీచర్ల విషయానికి వస్తే, అల్కజార్ టాప్-ఎండ్ వేరియంట్లలో కంపెనీ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో హ్యుందాయ్ యొక్క బ్లూలింక్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇంకా ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

నవంబర్ నెలలోనూ అదే తీరు.. కలిసిరాని పండుగల జోరు..

ప్రస్తుతం, భారత మార్కెట్లో హ్యుందాయ్ అల్కాజార్ మూడు ట్రిమ్ స్థాయిలలో అందించబడుతుంది. అవి - ప్రెస్టీజ్, ప్లాటినం మరియు సిగ్నేచర్. ఇవన్నీ కూడా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ (ఆప్షనల్) వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ప్రస్తుతం వీటి ధరలు రూ. 16.30 లక్షల నుండి రూ. 20.14 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) లో ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hyundai motor india sales november 46910 units cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X