సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (Hyundai Motor India Limited) గత నెల అమ్మకాల జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 2021లో కంపెనీ అమ్మకాలు అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చి చూస్తే 23.6 శాతం క్షీణించి 45,791 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

గత ఏడాది ఇదే నెలలో (సప్టెంబర్ 2020లో) కంపెనీ మొత్తం అమ్మకాలు 59,913 యూనిట్లుగా ఉన్నట్లు హ్యుందాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో దేశీయ అమ్మకాలు 34.2 శాతం తగ్గి 50,313 యూనిట్ల నుండి 33,087 యూనిట్లకు పడిపోగా, ఎగుమతులు 34.3 శాతం వృద్ధి చెంది 9,600 యూనిట్ల నుండి 12,704 యూనిట్లకు పెరిగినట్లు హ్యుందాయ్ నివేదించింది.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

కాగా, ఈ ఏడాది పండుగ సీజన్ లో కంపెనీ ఆశాజనక వాతావరణాన్ని ఆశిస్తోంది. రాబోయే పండుగ సీజన్ లో మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉంటుందని, ఫలితంగా అమ్మకాలు కూడా జోరుగా ఉంటాయని కంపెనీ ఊహిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీ కండక్టర్ చిప్స్ కొరత కారణంగా, కంపెనీ తమ వాహనాల ఉత్పత్తిలో తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కుంటోంది.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

గత నెలలో (సెప్టెంబర్ 2021లో) కంపెనీ అమ్మకాలు మరియు వాహనావ డెలివరీలు కూడా తగ్గుముఖం పట్టడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సరఫరా పరిమితుల కారణంగా ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో యావత్ ఆటోమొబైల్ పరిశ్రమ తక్కువ డిస్పాచ్‌లతో ముఖాముఖిగా వచ్చింది. పూర్తి సామర్థ్యంతో వాహనాల ఉత్పత్తిని కొనసాగించడానికి కార్ల తయారీదారులకు చాలా విడిభాగాలు అవసరం. వీటిలో సెమీకండక్టర్స్ ఇప్పుడు చాలా కీలకమైన భాగాలుగా ఉన్నాయి.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

సెమీకండక్టర్ చిప్స్ కొరత

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న సెమీ కండక్టర్స్ చిప్స్ కొరతను అధిమించేందుకు హ్యుందాయ్ వివిధ రకాల ప్రయత్నాలపై తీవ్రంగా పనిచేస్తోంది. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు మరియు దానిని ఉత్తమంగా నిర్వహించడానికి మరియు అదనపు సరఫరా సమస్యలను నివారించడానికి వివిధ రకాల విక్రేతలతో హ్యుందాయ్ పని చేస్తూనే ఉంది. ఆటోమొబైల్ కంపెనీలు ఈ పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తున్నాయి మరియు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ ప్రయత్నాల ద్వారా తమ వినియోగదారులకు ఉత్పత్తుల డెలివరీని ఆలస్యం కాకుండా ఉండేలా చూస్తున్నాయి.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

సెమీకండక్టర్లు చాలా ముఖ్యమైనవి

వాహనాల తయారీలో సెమీకండక్టర్ చిప్స్ చాలా ముఖ్యమైన భాగంగా మారాయి. లేటెస్ట్ సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లతో వస్తున్న అన్ని మోడ్రన్ కార్లలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. కార్లలో ఉపయోగించే బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్టెన్స్ ఫీచర్లు, నావిగేషన్ ఎక్విప్‌మెంట్‌లు మరియు హైబ్రిడ్-ఎలక్ట్రిక్ సిస్టమ్‌లు మొదలైన వాటికి ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ ఎంతో అవసరం.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

అంతేకాకుండా, దాదాపు అన్ని రకాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లలో కూడా వీటిని అధికంగా ఉపయోగిస్తుంటారు. ఈ సెమీకండక్టర్ చిప్స్ లేకుండా, కారు తయారీలో అవసరమైన కొన్ని ముఖ్యమైన భాగాలను అసెంబుల్ చేయటం కష్టంగా ఉంటుంది. ఫలితంగా, కార్ల ఉత్పత్తి కూడా అసాధ్యం అవుతుంది. ఫలితంగా, వాహనాల వెయిటింగ్ పీరియడ్ పెరిగి అమ్మకాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

హ్యుందాయ్ అల్కజార్ ప్లాటినం (ఆప్షనల్) 7-సీటర్ లాంచ్

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ (Hyundai) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ సరికొత్త అల్కజార్ (Alcazar) 7-సీటర్ ఎస్‌యూవీలో కంపెనీ కొత్తగా మరో వేరియంట్ ను ప్రవేశపెట్టింది. మిడ్-స్పెక్ వేరియంట్ గా కంపెనీ ప్లాటినం (ఆప్షనల్) (Platinum (O)) అనే వేరియంట్‌ ను కంపెనీ విడుదల చేసింది. ఇప్పుడు, ఇది కేవలం 6 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్‌ లో అందుబాటులో ఉంటుంది.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

ఈ ఎస్‌యూవీని మొదటిగా మార్కెట్లో విడుదల చేసినప్పుడు హ్యుందాయ్ అల్కాజార్ ప్లాటినం (ఆప్షనల్) వేరియంట్ కేవలం 6 సీటర్ ఆప్షన్ తో మాత్రమే లభ్యమయ్యేది. కాగా, ఇప్పుడు ఇందులో 7 సీటర్ వేరియంట్ కూడా కస్టమర్లక అందుబాటులో ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త అల్కాజార్ ప్లాటినం (ఓ) 7 సీటర్ వేరియంట్ ధర రూ. 19.63 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఇది దాని 6 సీటర్ వేరియంట్ కంటే రూ. 15,000 తక్కువగా ఉంటుంది.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

అయితే, ఈ కొత్త వేరియంట్ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్సన్ తో మాత్రమే లభిస్తుంది, ఇందులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేదు. అది కూడా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. ఇప్పుడు అల్కజార్ యొక్క ప్లాటినం (ఓ) డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ 6 మరియు 7 సీటింగ్ ఆప్షన్‌లను పొందుతుంది. కంపెనీ ఇందులో అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను అందించింది. సీటింగ్ ఆప్షన్ మార్పు మినహా ఇందులో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

సెప్టెంబర్ 2021లో తగ్గిన హ్యుందాయ్ సేల్స్, సెమీకండక్టర్ చిప్స్ కొరతే ఇందుకు కారణం!

ఇంజన్ విషయానికి వస్తే, ఈ వేరియంట్ లో (ప్లాటినం ఆప్షనల్) 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Hyundai motor india september 2021 domestic sales registered as 33087 units
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X