కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

భారతదేశంలో కరోనా మహమ్మరి ఎక్కువగా వ్యాపించడం వల్ల ఎంతోమంది దీనికి బలైపోయారు. అంతే కాకుండా చాలామంది ఈ వైరస్ బారినపడి పోరాడుతున్నారు. కరోనా నివారణకోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ రోగులకు కావలసినన్ని బెడ్లు గాని ఆక్సిజన్ గాని సరఫరా చేయలేకపోతున్నారు.

కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

కరోనా కోరల్లో పడి భారతదేశం నలుగుతున్న ఈ సమయంలో ప్రపంచంలో చాలాదేశాలు మనదేశానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. మన పొరుగుదేశమైన పాకిస్థాన్ నుంచి చైనా వరకు అనేకదేశాలు మనదేశానికి తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి.

కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

అమెరికా, సింగపూర్, కెనడా వంటి దేశాలు ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు, మెడిషన్స్ మాత్రమే కాకుండా ఆర్థిక సహాయానికి కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తున్నాయి. ఈ విధంగా ఇతర దేశాలు మాత్రమే కాకుండా మనదేశంలోని చాలా కంపెనీలు కూడా మనదేశానికి అండగా నిలవడానికి కృషి చేస్తున్నాయి.

MOST READ:అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

భారతదేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలలో ఒకటైన హ్యుందాయ్ మోటార్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే కరోనా రిలీఫ్ ఫండ్‌కు రూ. 20 కోట్లు విరాళంగా ఇస్తామని కంపెనీ తెలిపింది. ఆసుపత్రులలో ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి హ్యుందాయ్ ఈ మొత్తాన్ని కేటాయించింది.

కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ యూనిట్లను నిర్మించడానికి ఈ సహాయ నిధిని ఉపయోగించాలని హ్యుందాయ్ నిర్ణయించింది.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

హ్యుందాయ్ కంపెనీ మాత్రమే కాకుండా మారుతి సుజుకి కూడా హర్యానాలోని తన ప్లాంట్‌లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చడానికి కృషి చేస్తామని మారుతి సుజుకి అధికారికంగా ప్రకటించింది.

కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించడానికి కరోనా రిలీఫ్ ఫండ్‌కు రూ. 20 కోట్లు చెల్లించడానికి హ్యుందాయ్ ప్రతిపాదించడం నిజంగా ప్రశంసనీయం. ఇది దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గిస్తుంది మరియు ప్రజలు ప్రాణాలు రక్షించడానికి చాలా సహాయపడుతుంది.

MOST READ:సన్నీ లియోన్ కేరళ కార్ డ్రైవింగ్‌లో ఎదురైన చేదు అనుభవం.. కారణం ఇదే

కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

ప్రస్తుతం కరోనా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతోంది. కావున ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి అవసరమైతే తమ సిబ్బందిని మోహరిస్తామని హ్యుందాయ్ తెలిపింది. అదనంగా, అవసరమైతే ట్రస్ట్ ద్వారా అదనపు నిధులను అందిస్తామని కూడా కంపెనీ తెలిపింది.

కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

దీని గురించి హ్యుందాయ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ట్రస్ట్ సిఇఓ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ కోవిడ్ 19 వైరస్ యొక్క సెకండ్ వేవ్ భారతదేశానికి పెద్ద ముప్పును తలపెట్టనుంది. దీనివల్ల దేశంలోని పలు ప్రధాన నగరాలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో మనదేశానికి సహాయం చేయడం నిజంగా మా అదృష్టం అన్నారు.

MOST READ:కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

రోజు రోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మరి నివారణలో ప్రభుత్వాలు పూర్తిగా కృషి చేస్తున్నాయి. కావున ప్రభుత్వాలకు మనవంతు కూడా మద్దతు తెలిపి సహకరించాలి. అప్పుడే దీనిని పూర్తిగా నివారించవచ్చు. లేకుండా భారతదేశం యొక్క పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది.

Most Read Articles

English summary
Hyundai Motors To Give Rs.20 Crore To Corona Relief Fund. Read in Telugu.
Story first published: Thursday, April 29, 2021, 12:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X